Krishna Mukunda Murari Today Episode: ప్రసాద్‌ నలుగు పెట్టడానికి కావాల్సిన లిస్ట్‌ రాస్తూ ఉంటాడు. అక్కడ ఆయన భార్య, మురారి, కృష్ణ కూర్చొంటారు. ఇక కృష్ణ తనకు గంధం ఎక్కువ కావాలి అని కేసు తేలిపోయిన తర్వాత మరోసారి తనకు మురారికి పెళ్లి అవుతుంది అని అప్పుడు తనకు గంధం రాయాలని కోరుతుంది. అది దూరం నుంచి చూసిన భవాని కోపంతో తన గదిలోకి వెళ్లిపోతుంది. 


భవాని: ఇదేంటి నేను ఆ ప్రభాకరే అంతా చేశాడని నమ్ముతున్నాను కానీ చూస్తుంటే.. నేను ఒక్కదాన్నే నమ్ముతున్నట్లు అనిపిస్తుంది ఒకవేళ నేను తప్పు చేస్తున్నానా.. వాళ్లు  ముఖ్యంగా కృష్ణ వైపు ఎలాంటి భయం కానీ టెన్షన్ కానీ నాకు కనపడటం లేదు. అది పైకి కనిపిస్తున్న గాంభీరమా.. భయపడుతున్న ఛాయలు కృష్ణలో కానీ కృష్ణ దూరం అవుతుందేమో అన్న భయం మురారిలోనూ కనిపించడం లేదు. నేను అనవసరంగా భయపడుతున్నానా.. 
శకుంతల: వదినా.. మీ కాళ్లు పట్టుకంటా కొంచెం ఆలోచించండి..
భవాని: చూడు శకుంతల నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు. నేను ఏం చెప్తానో నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు నేను మాట్లాడుకొని ఏం చేస్తాం చెప్పు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. 


మరోవైపు మురారి, కృష్ణ ఇంటికి వస్తాడు. తనకు తల నొప్పి అని అంటే కృష్ణ మసాజ్ చేస్తుంది. ఇక మురారి కృష్ణ చెవిలో గుసగుసలు ఆడితే కృష్ణ తెగ సిగ్గు పడిపోతుంది. ఇక వాళ్ల ఇద్దరినీ అలా చూసి శకుంతల మురిసిపోతుంది. తాను భవానిని కలిశానని వాళ్లకి చెప్తుంది. ఇక తన పిన్ని చాలా బాధ పడుతుంది అని కృష్ణ అంటుంది. 


ఇక ముకుంద దేవ్‌కి తన రింగ్ గురించి అడుగుతుంది. అందుకు దేవ్ వారం క్రితం తన గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి చేసుకుందామని తనకు ఆ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్తాడు. ఇక ఈ విషయం తన దగ్గర ఎందుకు దాచావని ముకుంద అడుగుతుంది. ఇక ఇంట్లో వాళ్లు అందరూ భోజనం చేస్తుంటే దేవ్, ముకుంద కూడా వచ్చి కూర్చొంటారు. కృష్ణ, మురారిలు కూడా కూర్చొంటారు. భోజనం చేస్తున్నప్పుడు కృష్ణ దేవ్ చేతికి ఉన్న రింగును చూసేస్తుంది. 


కృష్ణ: తనలో తాను.. ఆ రింగు ఈ రింగు అయిండదులే. 
భవాని: అందరూ వినండి రేపు ముకుంద, మురారీలకు నలుగు పెడుతున్నాం. ప్రసాద్‌ ఆ పని మీదే బయటకు వెళ్లాడు.
దేవ్: మనసులో.. నేను ఇప్పుడు పెర్మామెన్స్ చేయకపోతే కృష్ణ, మురారీలకు డౌట్ వస్తుంది. మేడం.. ఒక్కసారి ఆలోచించండి.. నా చెల్లి పెళ్లి అవుతుందని మీరు సంతోషిస్తున్నారేమో కానీ నా చెల్లి కృష్ణ జీవితం ఏమవుతుందా అనే బెంగతో నాకు భోజనం కూడా సహించడం లేదు. 
భవాని: ఏమన్నావ్.. మీ చెల్లి కృష్ణ అన్నావ్ కదూ.. గుడ్ నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికింది. రేపు ముకుంద నలుగు మీ రెండో చెల్లి అదే కృష్ణ ఇంట్లో మా అవుట్ హౌస్‌లో జరుగుతుంది. కృష్ణ ఈ విషయం మీ చిన్నమ్మకి కూడా చెప్పి ఇద్దరూ రెడీగా ఉండండి.. ఇక కృష్ణ ఏడూస్తూ భోజనం చేయకుండా చేతులు కడిగేసి వెళ్లిపోతుంది. వెనకాలే మురారి కూడా వెళ్లిపోతాడు.


కృష్ణ: ఏంటి నా మనసు అంతా శూన్యం అయిపోయింది దిగులుగా ఉంది ఏంటి. మనసు ఖాళీ అయిపోయింది. ఇలా ఎప్పుడూ కాలేదు. ఎందుకు నేను ఇంత భయపడుతున్నాను. రేపు నలుగు, ఎల్లుండి పెళ్లి. ఈ పెళ్లి ఆగాలి అంటే ఆ ఉంగరం వాడు దొరకాలి. పెద్దత్తయ్య మనసు అయినా లేదంటే ఆదర్శ్ అయినా రావాలి. ఈ మూడింటిలో ఉంగరం వాడు దొరకడమే బెటర్. ఏసీపీ సార్ నాకు భయం వేస్తుంది. ఏదో కొత్త ఫీలింగ్ నా మనసుకు నేను సమాధానం చెప్పలేకపోతున్నా.
మురారి: భయపడకు  కృష్ణ. మనిషిని క్రుంగ దీసేవి పరిస్థితులు కావు. భయం. ముందు దాన్ని దూరం పెట్టు. అది మనల్ని డామినేట్ చేస్తే మనం ఓడిపోయినట్లే.. ఎందుకు భయం నేను లేనా.. ఇప్పుడే డిపార్ట్‌మెంట్ వాళ్లకి కాల్ చేశా రేపో మాపో కేసు తేలిపోతుంది అని చెప్పారు. నువ్వు లేకుండా నేను ఉండగలనా.. మరి నేను ఎందుకు భయపడటం లేదు. నీతోనే నేను అన్న ధైర్యంతోనే నేను ఉన్నా. 
కృష్ణ: చాలు ఏసీపీ సార్ ఎప్పటికీ మీరే నా మొగుడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: నోట్లో కాల్చితే వెనుక నుంచి బుల్లెట్, అలా ఎలా? - ‘సైంధవ్’ సీన్‌పై ఫన్నీ ట్రోల్స్ - స్పందించిన దర్శకుడు