krishna Mukunda Murari Today Episode: అందరూ పంతులు రాక కోసం హాల్‌లో ఎదురు చూస్తే ఉంటారు. ఇక కృష్ణ, మురారిలు వస్తారు. వాళ్లని చూసి నందూ నవ్వుతుంది. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారని కృష్ణ అడిగితే తింగరి అని అందరూ నవ్వుతారు. దీంతో కృష్ణ పెద్దత్తయ్యలా ఫుల్‌గా సీరియస్‌గా ఉంటానని అంటుంది. ఉంటే శారీ కొని ఇస్తానని రేవతి అంటుంది.


భవాని: రేవతి పంతులు గారు ఇంకా రాలేదా.. 
రేవతి: రాలేదు అక్క బయల్దేరాను అన్నారు ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం.
భవాని: కృష్ణ భవానిని ఇమిటేట్ చేసి భవానిలా కూర్చొంటే అందరూ నవ్వుతారు.. దాంతో భవాని ఏమైంది ఎందుకు అందరూ నవ్వుతున్నారు. చెప్పండి.. మీరందరూ నవ్వు తుంటే తను సీరియస్‌గా ఉంది ఏంటి. ఎవరైనా ఏమైనా అన్నారా.. ఏమైంది కృష్ణ. అరే ఎవరూ మాట్లాడరేంటి.
మురారి: ఏం లేదు పెద్దమ్మ మీలా సీరియస్‌గా రెండు నిమిషాలు ఉండమన్నాం. 
కృష్ణ: ఏసీపీ సార్ సీరియస్ అంటే సీరియసే. నవ్వించాలి అని చూడకండి.
భవాని: ఏయ్ తింగరి నీ మొఖానికి ఇవన్నీ షూట్ అవ్వవు. అయినా నేను నీలా బిగుసుకుపోయి కూర్చొంటానా.. ఒకరు మరొకరిలా ఉంటే బాగోదు. ఎవరిలా వాళ్లు ఉంటేనే అందం. వెళ్లు అందరికీ కాఫీ తీసుకురా..
మురారి: మన శోభనానికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారు. ఇవాళ కావొచ్చు రేపు కావొచ్చు రెడీగా ఉండు. ఆదర్శ్‌ వచ్చేంత వరకు ఆగమన్నావ్ ఆగా. ఇక ఆగడాలు లేవు.
పంతులు: అమ్మా మరో పది పదిహేను రోజుల వరకు మంచి రోజులు లేవు. 
ముకుంద: మనసులో.. అమ్మయ్య ఇవాళో రేపో అనలేదు ఏం చెప్పాలో తెలీక పిచ్చి ఎక్కిపోయేదాన్ని. పది రోజుల టైం ఉంది కదా ఏం చేయాలో ఈలోపు ఆలోచించొచ్చు.
పంతులు: మనసులో మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా ఎందుకు భవాని గారు పది పదిహేను రోజుల వరకు లేవు అని చెప్పమన్నారు. 


ముకుంద: మనసులో.. ఎప్పుడు ఇవాళ రేపు శోభనం అంటారో అని బయపడ్డాను. దేవుడు నా వైపు ఉన్నాడు. ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. కానీ పాపం ఆదర్శ్ నా మీద ఎన్నో ఆశలతో వచ్చినా నిరాశే మిగిలిపోతుంది. నా వల్ల మొన్నటి వరకు మురారి, కృష్ణలు సఫర్ అయ్యారు. వాళ్లు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు ఆదర్శ్‌ వంతు. ఎవరో ఒకరు నా వల్ల ఇలా బాధపడాల్సిందేనా.. అయినా నేను ఏదీ కావాలని చేయడం లేదే.. నా ఇష్టం వేరే ఒకరికి  కష్టంగా మారితే దానికి నేనే ఏం చేయను. మురారిని మర్చిపోయి వేరే వాళ్లతో బతకడం నా వల్ల కావడం లేదు. అత్తయ్య ఇంకా నన్ను అనుమానంగానే చూస్తుంది. 
ఆదర్శ్: ముకుంద ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తుంది. ఇప్పట్లో ముహూర్తాలు లేవు అని చెప్పడంతో డిసప్పాయింట్ అవుతోందా..
ముకుంద: ఇంట్లో ఇన్ని డిస్టబెన్సెస్ వస్తున్నా ఎంత బాధ పడుతున్నా నేను మాత్రం ఎందుకు నిన్ను మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. కుటుంబ పరువు పోతుంది అని తెలిసి కూడా నిన్ను ఎందుకు మర్చిపోలేకపోతున్నా.. ఏ ముంది మురారి నీలో.. ఎందుకు నా మనసు నిన్ను  వదిలి రాను అంటుంది. ఇంతలో ఆదర్శ్ వచ్చి మీద చేయి వేయడంతో ముకుంద గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ పరుగున అక్కడికి వస్తారు.
మధు: ముకుంద ఏమైంది.
ముకుంద: అది ఏం లేదు.. బాగా ఇరుక్కు పోయాను ఇప్పుడేంచేయాలి. ఆదర్శ్ భుజం మీద చేయి వేసినందుకు అరిచాను అని చెప్తే అత్తయ్యకు నామీద అనుమానం ఇంకా పెరిగిపోతుంది. 
ఆదర్శ్: అది ఏం లేదు అసలు ఏం జరిగింది అంటే.. 
ముకుంద: నేను చెప్తాను.. మేం ఇద్దరం ఇక్కడ నిల్చొని మాట్లాడుతుంటే చెట్టు మీద నుంచి తొండ పడింది. నాకు తొండ అంటే భయం కదా అందుకే గట్టిగా అరిచాను. 
మధు: ఈ చుట్టు పక్కల తొండ ఎక్కడ ఉంది. చూసి కూడా చాలా రోజులు అయింది. నిజంగానే తొండ పడిందా ముకుంద. అసలు మీద పడింది తొండేనా కాదా అన్న అనుమానంతో అడిగా.. అయినా ఆదర్శ్ బ్రో కూడా చూశాను అన్నాడు కదా.. బ్రో నిజమేనా.. మనసులో వేరే ఏదో జరిగింది. 
ముకుంద: సారీ ఆదర్శ్ నువ్వు అనుకోలేదు. నిజంగానే ఏదో మీద పడింది అనుకున్నా. అందుకే అలా అరిచాను.
ఆదర్శ్: ఇట్స్ ఓకే జరిగింది జరిగినట్లు చెప్పకపోవడమే మంచిది అయింది. లేదంటే నేను చేయి వేసినందుకు అరిచావని నేను అంటే ఇష్టం లేదు అనుకుంటారు.
ముకుంద: అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అవును ఏమైనా మాట్లాడటానికి వచ్చావా..
ఆదర్శ్: ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడగడానికి వచ్చా. కానీ నువ్వు ఏదో డీప్ థింకింగ్ చేస్తున్నావ్ అని యూ కారియాన్.
ముకుంద: సారీ ఆదర్శ్ నా మనసు ఎప్పటికీ మారదని నీకు ఎలా చెప్పాలి. నిన్ను మోసం చేస్తున్నాను. నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. 


మరోవైపు మురారి, కృష్ణలు మాట్లాడుకుంటారు. ఆదర్శ్‌ని ముకుంద రిసీవ్ చేసుకోవడం చూసి హ్యాపీగా ఉందని అంటుంది. ఆదర్శ్‌ని ఆది అని ముకుంద పిలుస్తుంది అని అంటుంది. వాళ్లని అలా చూస్తే చాలా ముచ్చట వేసిందని కృష్ణ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 27th: నో డౌట్ రిషి వచ్చేస్తున్నాడు - శైలేంద్రని ఆడేసుకున్న మహేంద్ర!