Krishna Mukunda Murari Today Episode: శకుంతల తన భర్త పెద్దపల్లి ప్రభాకర్‌కి ఫోన్ చేస్తుంది. జైల్లో ఎందుకు గొడవ పెట్టుకున్నావని తిడుతుంది. ఇక రేవతి, కృష్ణ, మురారి అక్కడికి వస్తారు. ఇంతలో ముకుంద కూడా వచ్చి చిన్నమ్మ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని అంటుంది. ఇక కృష్ణతో మీరు కలిసిపోయారు. నేను మారిపోయాను.. నిజంగా ఇది మనకు పండగే కదా అని అంటుంది. ఇంతలో మధు వస్తాడు. మధుతో కృష్ణ ఈ సంక్రాంతి పండగను డబుల్‌ ఢమాకా ఉండేలా ముకుంద ప్లాన్ చేస్తుందని చెప్తుంది. 


ముకుంద: రేపు మార్నింగ్‌ భోగి అది అందరికీ గుర్తుండిపోయాలా చేస్తా నాకు వదిలేయండి. ముకుంద కాఫీ తేవడానికి లోపలికి వెళ్తుంది. కృష్ణ, మురారిలు బయటకు వెళ్తారు. 
రేవతి: వదినా మధు ముకుందను నమ్మొద్దు మారలేదు అంటున్నాడు. 
మధు: అవును అత్త నాకు అయితే ఇంకా అనుమానంగానే ఉంది. మారలేదు అని గ్యారెంటీగా చెప్పలేను కానీ మారింది అని మాత్రం చెప్పలేకపోతున్నా.
రేవతి: అందుకే మన జాగ్రత్తలో మనంలో ఉండాలి. 
మధు: అలా అని ముకుందను మనం అనుమానంగా చూడకూడదు. ఒకవేళ నటిస్తే జాగ్రత్త పడుతుంది. 


మురారి, కృష్ణ బైక్‌ మీద వెళ్తుంటారు. కృష్ణ చలి అని అంటే మురారి షడెన్‌గా బ్రేక్ వేస్తాడు. ఇక మురారి తనని పట్టుకోమని అప్పుడు చలి వేయదు అంటాడు. ఇక సుమలత తన భర్తతో ముకుంద నిజంగానే మారిందా అని అడుగుతుంది. దానికి ప్రసాద్ ముకుంద అన్నలా తను కూడా నాటకం ఆడితే ముకుందకు వచ్చిన లాభం ఏంటి అని ప్రశ్నిస్తాడు. కృష్ణ ముకుందకు ఫుల్ సపోర్ట్ చేయడం వల్ల ముకుంద ఎమోషనల్ అయిందని తను ఇక ఏ తప్పు చేయదని అంటాడు. 


రేవతి: శోభనం ముహూర్తం గురించి అక్కకి చెప్తాను. అక్కని అడగకుండా పంతులుని పిలిపిస్తే తన మీద కోపంతో చెప్పడం లేదని బాధపడుతుంది. ఇప్పటికే నాతో అనకపోయినా.. ఒక తప్పుని కాపాడడానికి ప్రయత్నించినందుకు బాధ పడుతుంది. ఇంతకు ముందులానే అక్కతో ఉంటే ఆ బాధని మర్చిపోతుంది. అక్కా..
భవాని: ఆ రేవతి కృష్ణని రమ్మని చెప్తావా.
రేవతి: చెప్పాను అక్కా. శకుంతలని కూడా రమ్మని చెప్తే తను అవుట్ హౌస్‌లోనే ఉంటాను అని చెప్పింది. 
భవాని: సరే తనిష్టం. మీ ప్రభాకర్ అన్నయ్య గురించి లాయర్‌తో మాట్లాడాను. ఒక వారంలో విడిపిస్తాను అన్నారు. రేవతి నీకు నామీద కోపం లేదా.. 
రేవతి: ఛ.. ఛా అలా ఏం లేదు అక్క. మంచి చేయడం కోసం తపన పడతారు. చెడు అంటే భయపడతారు. ఒక చెడును మంచి అనుకొని మీరు భ్రమ పడ్డారు అంతే. ఇప్పుడు ఆ భ్రమ కూడా తొలగిపోయింది. అన్ని తొలగిపోయాయి అని నేను మిమల్ని అడిగి పంతులుగారికి కబురు పెడదామని అడుగుదామని వచ్చాను.
భవాని: గుడ్ ముహూర్తం పెట్టించు రేవతి. మురారి అగ్రిమెంట్ పెళ్లిని పర్మినెంట్ చేయాలి అంటే ఆ బంధం చేయాలి అంటే త్వరగానే ముహూర్తం పెట్టిద్దాం.  


కృష్ణ: షాపింగ్‌లో కలిశాను కదా ఆయన తన తమ్ముడిని పంపిస్తా అన్నారు. 
మురారి: ఒకవేళ ఆదర్శ్ ఆచూకి తెలిసినా ఇంటికి వస్తాడు అనే నమ్మకం లేదు. 
కృష్ణ: మీ ఫ్యామిలీ మంచిది ఏసీపీ సార్. పెద్దత్తయ్య పెంపకంలో పెరిగిన మీరంతా చాలా సిన్సియర్. ముందు బాధ పడితారు. తర్వాత ఎలా చెప్పినా వింటారు. ఆ నమ్మకంతోనే ఆదర్శ్‌కి మన పరిస్థితి చెప్తే అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం నాకు ఉంది. 
మెహతా: ఆదర్శ్ ఇప్పుడు ఎన్‌ఎస్ కంపెనీలో కమాండర్‌గా ఉంటున్నాడు. ప్రమోషన్ వచ్చింది. ఇది 6 నెలల క్రితం మాట. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని చెప్తాను. సాధ్యమైనంత తొందరగా మీకు ఆదర్శ్‌ కోసం చెప్తాను. 


ముకుంద: చిన్నమ్మ నా మీద నీకు నమ్మకం లేదు కదా.. నన్ను నమ్మడం లేదు కదా.. 
శకుంతల: అలా ఏం లేదు బిడ్డా. నువ్వు మారావ్ కదా అంతే చాలు. నీ ఈడు బిడ్డే కదా మా కిట్టమ్మ కూడా. దాని జీవితం కూడాఎక్కడ ఆగం అవుతుందో అని భయపడ్డా అంతే.
ముకుంద: చిన్మమ్మ ప్రమాణం చేసి చెప్తున్నా.. ఇక కృష్ణ జీవితంలోకి అడ్డురాను. 


ఇక రేవతికి పంతులు గారు ఫోన్ చేసి పండక తర్వాత ముహూర్తం పెట్టుకోని చెప్పారు అని చెప్తుంది. ఇక నందూ, మధు, ముకుందలు మార్కెట్‌కి బయలుదేరుతారు. మరోవైపు కృష్ణ లూజుగా ఉండే స్వెటర్ కొనుకుంటుంది. ఇక పక్కనే కనిపిస్తున్న ఐస్‌క్రీమ్‌ కవాలి అని అడుగుతుంది. అందరికీ ఐస్‌క్రీమ్‌లు పంచుతుంది. తర్వాత కృష్ణ ఐస్‌ క్రీమ్ తిన్న తర్వాత ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


ALSO Read: Alluda Majaka Promo: ఆ షో కోసం స్పెషల్ స్కిట్ చేసిన విక్టరీ వెంకటేష్ - ఖుష్బు, మీనాలతో కలిసి అల్లరే అల్లరి