Krishna Mukunda Murari Today Episode : ముకుంద, ఆదర్శ్‌లను భవాని ముందు బెస్ట్ కపుల్‌గా నిలపాలి అని కృష్ణ, మురారిలు ఓ ఐడియా వేస్తారు. ఇక ముకుంద రోజంతా ఆదర్శ్‌తో సంతోషంగా గడిపింది అని తెలుసుకున్న మధు అది నిజమా అబద్దమా అని తెలుసుకోవాలి అని అందుకు మురారి, ఆదర్శ్‌లను తాగించాలి అని వాళ్లిద్దరికీ మందు తాగిస్తాడు. ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తాడు. దీంతో ఆదర్శ్, మురారీలు మధుతో ఫుల్లుగా తిగించి పడుకునేలా చేస్తారు. మరో వైపు భోజనం కోసం కృష్ణ వాళ్లు ఆదర్శ్ మురారిల కోసం వెతుకుతారు. ఇంతలో ఇద్దరూ తూగుతూ ఇంటికి వస్తారు. దాంతో కృష్ణ మురారిని తాగారా అని అడుగుతుంది. ప్రశ్నలమీద ప్రశలు వేస్తుంది. ఇక మురారి ముకుంద ఆదర్శ్‌ని ఏం అడగడం లేదు నువ్వు మాత్రం నన్ను అన్ని అడుగుతున్నావ్ అని అంటాడు. దానికి ముకుంద ఒకరిని టెస్ట్ చేస్తే ఇంకొకరు దొరికిపోతారు అని అంటుంది. మురారిని ఊదమని కృష్ణ అడిగితే మురారి గాలిలో ఊదుతాడు. ఇక బయటకు దూదినట్లే లోపలికి ఊదుతాడు. అందరూ నవ్వుకుంటారు.
కృష్ణ: సరిగా ఊదలేదో పెద్దత్తయ్యని పిలుస్తా..
రేవతి: మీరు మీరు కలిసి అక్కని ఇబ్బంది పెట్టొద్దు అసలే తలనొప్పి అని పడుకుంది. సరే ముందు భోజనం చేయండి.
నందూ: అసలు మధుని అడిగితే నిజం చెప్పేస్తాడు. మధు ఎక్కడ ఇంకా రాలేదు.
ఆదర్శ్: మధు రాలేని పరిస్థితిలో ఉన్నాడు.
నందూ: అంటే తాగి పడిపోయాడు. ఒప్పుకున్నారు కృష్ణ వీళ్లు తాగారని..
మురారి: అలా మనిషి కనిపించని అంత మత్రానా తాగి పడిపోయినట్లా.. వాలంటైన్స్ డేకి కావల్సిన ఎరేంజ్ మెంట్స్ చేయడానికి వెళ్లాడు.
ముకుంద: మురారి కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవచ్చా.. ఎలా ఉంటుంది. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు.
మురారి: అది మాత్రం సర్‌ప్రైజ్.
కృష్ణ: రేపటి వరకు మీరందరూ ఓపిక పట్టాల్సిందే మేం ఇచ్చే సర్‌ఫ్రైజ్‌కి మీరందరూ త్రిల్ అవుతారు. ముకుంద నువ్వేం టెన్షన్ పడొద్దు. రేపు మేం ఇచ్చే సర్‌ప్రైజ్ మీ ప్రేమకు పరీక్ష అనుకో. మీరేం టెన్షన్ పడొద్దు అందులో మీరే విన్ అవుతారు.
రేవతి: హలో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు. ఎవరు ఫస్ట్ వస్తారో డిసైడ్ చేసేది మా అక్క. ఏమో మీరు కూడా విన్ అవ్వొచ్చు కదా..
ముకుంద: కృష్ణ మాటలు తలచుకుంటూ.. మళ్లీ ఏం ప్లాన్ చేస్తుందో ఎందులో ఇరికిస్తుందో. అంటే ఆదర్శ్‌తో నేను క్లోజ్‌గా ఉండాలి. అది మాత్రం జరగని పని. ఇందులో నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయనుందో తెలుసుకోవాలి. ఆదర్శ్ మీకు ఏమైనా తెలిసిందా..
ఆదర్శ్: ఏంటి..
ముకుంద: అదే కృష్ణ ఏదో ప్లాన్ చేసింది కదా దాని గురించి..
ఆదర్శ్: సర్‌ప్రైజ్ కదా ముకుంద ఎలా తెలుస్తుంది. మురారిని అడిగి చూశా కానీ చెప్పలేదు. అయినా టెన్షన్ ఎందుకు. ముకుంద దాని గురించి ఏం ఆలోచించకు. మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పుడు అదే మనల్ని గెలిపిస్తుంది.
ముకుంద: మనసులో.. నిజం అయితే గెలిపిస్తుంది. కానీ లేదు కదా.. అప్పుడు మనం ఓడిపోతాం. అందరికీ నా మీద అనుమానం వస్తుంది. ఇప్పుడేం చేయాలి.
మరోవైపు మురారి కింద చాప పరుచుకుంటాడు. వద్దు బెడ్ మీద పడుకోండి అని కృష్ణ అంటే ఇంకా ముహూర్తం పెట్టలేదు కదా మత్తులో నేను ఏం చేస్తానో అని పడుకోని అని మురారి అంటాడు. ఇక కృష్ణ వద్దు అని చెప్తే మురారి కృష్ణను రెచ్చగొడతాడు. ఇక కృష్ణ మురారి కాళ్లు పట్టుకొని మంచం మీద పడుకోమని చెప్తుంది. దీంతో మురారి నువ్వు కాళ్లు పట్టి ఈ రేంజ్‌లో భయపెడితే పడుకోకుండా ఎలా ఉంటానా అని అడుగుతాడు. ఉదయం అందరూ హాలో ఉండి ఎవరి ఫోన్ వాళ్లు చూస్తూ బిజీగా ఉంటారు. మధు వచ్చి అందరూ ఫోన్లలో బిజీగా ఉన్నారు అంటే నందూ పోనీ నీ ఫోన్ ఇవ్వు చూస్తా అంటుంది.
మధు: వద్దులే..
ఆదర్శ్: ఎవరూ వాళ్ల ఫోన్ పక్కవాళ్లకి ఇవ్వరు బ్రో. భార్యభర్తలు కూడా.. నువ్వు నీ ఫోన్ ముకుందకు ఇస్తావా.. ఇవ్వవు. పోనీ ముకుంద తన ఫోన్ నీకు ఇస్తుంది.
ముకుంద: మనసులో.. వీడు ఒకడు చుట్టూ తిరిగి నా దగ్గరకే వస్తాడు. అత్తయ్యని మ్యానేజ్ చేయొచ్చు కానీ వీడిని చేయలేం.
మధు: మాట్లాడరేంటి.. ఒకరి ఫోన్ మరొకరు మార్చుకుంటారా..
మురారి: ఎందుకు మార్చుకోవాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నవాళ్లకి ఇలాంటి ఆలోచనలు రావు. నీలా అనుమానం ఉన్నవాళ్లకే ఇలాంటి అనుమానాలు వస్తాయి. నందూ: బాగా చెప్పావు అన్నయ్య అడుగుఅడుగుకి వాడికి అనుమానమే వాడి నీడను కూడా వాడు నమ్మడు.
మధు: నా టాపిక్ పక్కన పెట్టి అసలు టాపిక్ లోకి రండి ఈరోజు వాలెంటైన్స్ డే సరదా లేదు సంతోషం లేదు. కనీసం ఐలవ్యూ అని అయినా చెప్పుకున్నారా..
కృష్ణ: అబ్బా.. అనీ నీ ముందే చేస్తారా.. నీకు చెప్పే చేస్తారా..
నందూ: కృష్ణ నీ రింగ్ ఏది..
కృష్ణ: అవును నా రింగ్ ఏది.. ఏసీపీ సార్ నా రింగ్ మీరు చూశారా.. అసలు నేను నా వేలి నుంచి తీయలేదు.
ముకుంద: లాస్ట్ టైం ఎప్పుడు చూసుకున్నావ్ కృష్ణ.
కృష్ణ: పొద్దున్న లేచినప్పుడు చూసుకున్నా ఉంది. పొద్దున్న లేచి ముగ్గు వేశా ఆ తర్వాత ఏం చేయలే. అని తులసి కోట దగ్గర వెతుకుతుంది. మిగతా వారు ఇంట్లో వెతుకుతారు. కానీ దొరకదు. కృష్ణ తన గదిలో కూడా వెతుకుతుంది. అయినా దొరకదు. దీంతో కృష్ణ చాలా ఫీలవుతుంది.
నందూ: కృష్ణ అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అదేదో మామూలు రింగ్ కాదు. అన్నయ్య ప్రేమతో తొడిగిన రింగ్ వాలంటైన్స్ డే రోజు పోతే ఎలా ఉంటుంది.
మురారి: నందిని ఇప్పటికే రింగ్ పోయింది అని కృష్ణ బాధపడుతుంటే నువ్వు దానికి సెంటిమెంట్ పెడితే ఎలా. అయినా ఈరోజు ఏదో డే అని రింగ్‌కి తెలుసా లూజ్‌గా ఉండి ఎక్కడో పడిపోయి ఉంటుంది.
ముకుంద: మనసులో.. మురారికి కృష్ణ వేలికి తొడగమని నేనే కదా ఇచ్చాను. అది ప్రేమికల రోజు పడిపోయింది అంటే ఇంక నేను నా ప్రేమ మీద ఆశలు పెంచుకోవచ్చని అర్థమా.. మురారి, కృష్ణ వాడు కాదు నా వాడని అర్థమా.. ఛీఛీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి. కృష్ణకి నావల్ల అన్యాయం జరగకూడదు.
మురారి: కృష్ణ నువ్విలా బాధపడకు. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. దొరుకుతుంది. లేదంటే అలాంటిదే ఇంకొకటి కొనుక్కుందాం.
రేవతి: ఇదిగో నువ్వు అలా డల్‌గా ఉండకు.
మరోవైపు ఈవెంట్ డెకరేషన్ చేయడానికి వస్తారు. వాళ్లు ఏవో పిన్నులు అడిగితే ఆదర్శ్ పాత కబోర్డ్‌లో ఉన్నాయని తీసుకెళ్లమని ఆదర్శ్‌కి మురారి చెప్తాడు. ఆదర్శ్ వెళ్తాడు. ఇక ముకుంద అక్కడికి వచ్చి మురారిని చూసి లాస్ట్ వాలెంటైన్స్ డే ఎంత బాగా జరిగింది అనుకుంటుంది. మురారి ఫొటో తీసుకోవాలి అని అనుకొని మురారి కనిపించేలా తనకు తాను సెల్ఫీ తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.