Krishna mukunda Murari  Serial Today Episode: కృష్ణ కాఫీ తీసుకుని వచ్చి హాల్లో మురారి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. వాకింగ్ కి వెళ్లానని చెప్తుంది. వాకింగ్‌కు వెళ్లావంటే కాలు నొప్పి తగ్గిపోయిందా? అంటూ  కృష్ణ అడుగుతుంది. ఏమీ చెప్పకుండా ముకుంద కాఫీ ఇవ్వమని కృష్ణను అడుగుతుంది. మురారి కోసం తీసుకొచ్చిన కాఫీ ఇస్తుంది కృష్ణ. ఈరోజు మురారి కోసం కలిపిన కాఫీ ఇచ్చావ్ రేపు తనని కూడా ఇవ్వాల్సి వస్తుందేమో, నీకు అన్యాయం చేయాలని నాకు అసలు లేదు. కానీ నాకు ఆదర్శ్ వద్దని చెప్పిన తర్వాత రేపు ఏం జరుగుతుందో చెప్పలేం కదాని మనసులో అనుకుంటుంది ముకుంద. మరోవైపు మురారి ఒంటరిగా నిలబడి ముకుంద మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? సమయానికి పెద్దమ్మ కూడా ఊర్లో లేదు. రేపో మాపో విడుదలై వస్తున్న ప్రభాకర్ మావయ్యకి కృష్ణకి అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఆయనే ముకుందను చంపేస్తాడు.  ఏది ఏమైనా కృష్ణకి మాత్రం ఈ విషయం  తెలియకూడదు. నేనే దీనికి పరిష్కారం ఆలోచించాలని అనుకుంటాడు. మరోవైపు ముకుంద దగ్గరకి ఆదర్శ్ వచ్చి పలకరిస్తాడు.


ముకుంద: శోభనం ముహూర్తంలోగా ఏదో ఒకటి చేసి మురారి ఆదర్శ్ ను  పంపించేస్తాడు. ఇక నేను ఎందుకు టెన్షన్ పడటం. ఈలోపు ఏదో ఒకటి మ్యానేజ్ చేస్తే సరిపోతుందు (అని మనసులో అనుకుంటుంది.)


ఆదర్శ్‌: అంతా ఒకేనా కాలు నొప్పి తగ్గిపోయిందా?


ముకుంద: తగ్గిపోయింది. అందుకే బయటకి వెళ్ళి వాకింగ్ చేసి వస్తున్నాను.  


కృష్ణ కాఫీ తీసుకొచ్చి ఆదర్శ్ కి ఇస్తుంటే ముకుందకి ఇవ్వమని అంటాడు. నేను తాగేశానని ముకుంద అంటే పర్లేదు మళ్ళీ తాగు అంటాడు. దీంతో కృష్ణ ఒకే కాఫీని ఇద్దరూ షేర్ చేసుకోండి, ఎలాగూ పాలు పంచుకుంటారు కదా అంటుంది. ఎందుకు ఇలా చావగొడుతున్నావ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా టార్చర్ చేస్తున్నావని కృష్ణను ముకుంద మనసులో తిట్టుకుంటుంది. తర్వాత ఆదర్శ్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ మూడు రోజులు శోభనం కదా బయటకి రావడం కుదరదని చెప్తుంటాడు. ఆదర్శ్‌ మాటలు విన్న మురారి ఏదో ఒకటి చేసి ముకుంద మనసు మార్చాలని.. ఆదర్శ్‌  లైఫ్ సెటిల్  చేయాలని ఫిక్స్‌ అవుతాడు. బెడ్‌రూంలో కూర్చున్న ముకుంద ఆలోచిస్తుంది.


ముకుంద: నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? లేదు నాప్రేమ కోసం ఆలోచిస్తూ దాన్ని గెలిపించుకోవడం తప్పు ఎలా అవుతుంది. అందరి కోసం ఆలోచిస్తూ నాకు నేను అన్యాయం చేసుకుంటున్నాను అది తప్పు అవుతుంది. నేను పట్టుబడితే ఎలా ఉంటుందో మురారికి బాగా తెలుసు. ఏది ఏమైనా నేను పట్టువదలకూడదు అలా చేస్తే మురారిని వదులుకున్నట్టే


( అని మనసులో అనుకుంటుండగానే ఆదర్శ్‌ వస్తాడు)


ఆదర్శ్‌: మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు.  రేపు సిటీకి వస్తున్నాడట కలుద్దామని పిలుస్తున్నాడు.


ముకుంద: అయితే వెళ్లి కలిసిరండి.


ఆదర్శ్‌: ఏం చెప్తున్నావ్..  రేపు మన శోభనం కదా ఎలా వెళ్తాను. అక్కడ ఫ్రెండ్ తో తాగేసి ఉంటే శోభనం ఇష్టం లేక వెళ్లపోయానని అనుకుంటారు.


ముకుంద: తాగేసి అక్కడే పడిపోతే బాగుండేది మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది ( అని మనసులో అనుకుంటుంది.)


ఆదర్శ్‌: ఏంటి అలా డిసప్పాయింట్ అయ్యావ్ నేను నిన్ను కన్వీన్స్ చేసి మందు తాగడానికి వెళ్తానని అనుకుంటున్నావా? అలా అసలు చేయను పాల గ్లాసు పట్టుకునే చేతితో మందు గ్లాసు ఎలా పట్టుకుంటాను. నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చినా తన దగ్గరకి నేను వెళ్ళడం లేదు నాకు నువ్వే ముఖ్యం.


ముకుంద: ఈయన నాకు దగ్గర అవ్వడం  కోసం ఎదురు చూస్తున్నాడు. నేనేమో ఈయనకు దూరం కావడానికి ఎదురుచూస్తున్నాను. మురారి తొందరగా ఏదో ఒకటి చెయ్యి


అంటూ ముకుంద మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: బాలీవుడ్ బిగ్ బాస్ భామకు లక్కీగా మారిన టాలీవుడ్ - ఆ స్టార్ హీరో సినిమాలో!