Krishna Mukunda Murari Serial Today Episode 


కృష్ణ మురారికి గంధం రాస్తుంది. అక్కడ అంతా సందడిగా ఉంటుంది. ఇక రేవతి అయితే వేణి నీ రాకతో ఈ ఇంట్లోకి పెళ్లి కల వచ్చేసింది అమ్మా అంటుంది. మరోవైపు మురారి వేణి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మధు వస్తాడు. పసుపు దంచే కార్యక్రమం రీల్ చేశానని పోస్ట్ చేస్తానని అంటాడు. దీంతో మురారి ఇంతకు ముందు నీవ్వు రీల్స్ చేశావు కాదా అని అడుగుతాడు. దీంతో మధు షాక్ అవుతాడు.


కృష్ణ: మధు ఇందాక పసుపు కొట్టేది వీడియో తీశావా.. (ఏసీపీ సార్ గుర్తొస్తుంది అన్నారు కదా ఇంకొంచెం గుర్తొచ్చేలా చేస్తాను) ఇక మురారి రీల్స్ చూపించమంటాడు.
మధు: మీరు ఇప్పుడు చెప్పండి వేణి గారు చూపించమంటారా
కృష్ణ: వద్దు వద్దు.. మీరు ఇప్పుడు సార్‌తో ఓ వీడియో చేయండి
మధు: ఏంటి కృష్ణ మురారికి గతం గుర్తొచ్చేలా చేస్తుందా.. వెరీగుడ్.. బ్రో మీ ఇద్దరూ వీడియో చేయండి వేణి గారు స్టెప్పులు వేయడం నేర్పిస్తారు అంటాడు. ఇక కృష్ణతో కలిసి మురారి డాన్స్ చేస్తాడు. మధు రికార్డ్ చేస్తాడు. ఇంతలో భవానిని చూసిన మధు కట్ చెప్పి వాళ్లని ఆపేస్తాడు. భవాని మురారిని పిలిచేస్తుంది. 


మధు: ఏంటి పెద్దమ్మ చాలా సంతోషంగా ఉన్నావు.. పెద్ద పెద్దమ్మకి చెప్పేశావా ఏంటి
రేవతి: నేను ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను. ఇన్నాళ్లు నువ్వు కృష్ణ ధైర్యం గురించి చెప్తే ఏంటో అనుకున్నాను. కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది. 


ముకుంద - కృష్ణ


ముకుంద: ఏయ్ ఏంటే పసుపుకొట్టే దగ్గర ఓవర్‌ యాక్షన్
కృష్ణ: దాన్ని ఓవర్ యాక్షన్ అనరు రియాక్షన్ అంటారు.. ఇప్పుడేం చూశావ్ ఇంకా రేపటి నుంచి చూడు ఒక్కో మెట్టు నేను ఎక్కుతుంటే నువ్వు ఒక్కో మెట్టు దిగుతూ ఉంటావ్. 
ముకుంద: ఏంటి కలలు కంటున్నావా
కృష్ణ: కాదు ఏసీపీ సార్‌కి గతంలో కలల్లా వస్తున్న జ్ఞాపకాలు నిజం అవుతాయి అంటున్నా. భయపడ్డావా
ముకుంద: నాకు భయం ఎందుకు నా వెనుక మా అత్తయ్య ఉంది. నీ వెనుక ఎవరు ఉన్నారు. మీ చిన్నాన్న పాపం జైలులో ఉన్నారు. ఇప్పుడు చెప్పు ఎవరు భయపడ్డారు
కృష్ణ: నేను భయపడను ముకుంద నా వెనుక నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్ అదే నా ఏసీపీ సార్ ఆయనే నా బలం.. బలగం.. ఆదర్శ్ కోసం వెయిట్ చెయ్ ముకుంద 


భవాని: రేవతి మురారికి కాఫీ తీసుకురా
మురారి: చూడు పెద్దమ్మ మధు ఏవో రీల్స్ చేశాడు కదా ఇంతకు ముందు.. ఆ రీల్స్ చూపించమంటే చూపించడం లేదు ఎందుకో ఇప్పుడు
కృష్ణ: ముకుందతో.. చూశావా.. ఏసీపీ సార్ రీల్స్ చూపించమంటున్నారు ఆయన అవి  చూస్తే నీ పెళ్లి ఫసక్.. 
మురారి: మధుతో.. పెద్దమ్మ కూడా చూపించమంది కదా 
భవాని: వాడు చూపించలేడులే నాన్న. అవన్నీ పిచ్చి రీల్స్ నేనే డిలీట్ చేయమన్నా అందుకే చూపించలేడు. కదా మధు
ముకుంద: కృష్ణతో చూశావా మా అత్తయ్య ఫవర్.. దెబ్బకి మధు నోరు మూసేశాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ బంగారం. ఇవాళ పసుపు దంచడం మూడు రోజుల్లో మురారి నాకు మూడు ముళ్లు వేయడం ఇదే లెక్క. ఇంకోటి మా ఏసీపీ సార్ నాకు అండగా ఉంటారు అన్నావు కదా చూశావా మా అత్తయ్య చెప్పిన దానికి ఎలా సైలెంట్‌గా ఉన్నాడో
భవాని: సరే సరే ఇక చాలా పనులు ఉన్నాయ్. నేను వెళ్లి ఫంక్షన్ హాల్ చూసి వస్తా.. వేణి ఇక పని అయిపోయింది కదా నువ్వు ఇక వెళ్లు
మురారి: మనసులో.. ఎందుకు పెద్దమ్మ వేణి గారిని చాలా చీప్‌గా చూస్తుంది. జైలుకి వెళ్లి వాళ్ల చిన్నాన్నతో మాట్లాడితే నిజం తెలుస్తుంది
కృష్ణ: వెళ్తాను మేడం.. రేపు రాత్రికి కోనేటిలో దీపాలు వదిలే కార్యక్రమం ఉంది చిన్న మేడం మీరు వస్తారా
ముకుంద: రారు.. మేము కూడా వెళ్లాలి మాతో పాటు వస్తారు. 
కృష్ణ: సరే మరి వస్తాను మేడం.. 
మురారి: అమ్మా కోనేటిలో దీపాలు ఎందుకు వదులుతారు
భవాని: మనసులో.. ఇప్పుడు నాకు ఓ మంచి అవకాశం దొరికింది. దీంతో ఇక మురారి ఎప్పుడూ ఆ కృష్ణ జోలికి వెళ్లడు.. ఆచారం కాదు నాన్న అలా వదిలితే తమ భర్తలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆడవాళ్లు అలా వదులుతారు. వేణి కూడా తన భర్త కోసం వదులుతుంది అంతే. (ఈ మాట వినగానే మురారి షాక్ అయిపోతాడు)
మురారి: మనసులో.. అంటే వేణి గారికి పెళ్లి అయిందా అని చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్లి పోతాడు.. ఒంటరిగా తన గదిలో కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నందూ అక్కడికి వస్తుంది. మురారిని పిలుస్తుంది. మురారి వణికిపోతూ ఉంటాడు. నందూ కంగారు పడుతుంది. వేణి డాక్టర్‌ని పిలుస్తా అంటుంది మురారి వద్దు అని తను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పమంటాడు.


మురారి: వేణి గారికి పెళ్లి అయిందంట కదా పెద్దమ్మ ఇందాక చెప్పింది కదా..తన భర్త బాగుండాలి అని కోనేటిలో దీపం పెట్టడానికి వెళ్తుంది అంట కదా.. వేణిగారికి పెళ్లి అయిందన్న విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నా నందూ. టెన్షన్‌గా ఉంది అది నిజమేనా.. ఒక్క విషయం నీకు ఇంకొకటి చెప్పనా
నందూ: ఏం చెప్పకు మురారి.. సాయంత్రం నువ్వు కొనేటి దగ్గరకు వెళ్లు నీకే తెలుస్తుంది. వేణి చాలా తెలివైనది ఇన్ డైరెక్ట్‌గా నిన్ను పిలిచింది. 
మురారి: దేనికి
నందూ: తను నిన్నెందుకు పిలుస్తుంది ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. నువ్వు టెన్షన్ పడకు వెళ్లు.   


మరోవైపు ముకుంద, భవాని రూమ్‌ కి వెళ్తుంది. తనకు చాలా టెన్షన్‌గా ఉందని చెప్తుంది. మురారి విషయంలో రేపు ఏం జరుగుతుందో తెలీదని.. రేపు ఏం జరుగుతుందో తలచుకుంటే తన జీవితం ఏంటి అని భయపడుతుంది. మురారికి గతం గుర్తొస్తే పరిస్థితి ఏంటి అని భవాని అడుగుతుంది. గతం మర్చిపోయిన మురారి కృష్ణకు చాలా దగ్గరగా ఉన్నాడని.. గతం గుర్తొస్తే ఇంకా ఏంటి అని ఏడుస్తుంది. భవాని ముకుందకు ధైర్యం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.