Krishna Mukunda Murari Telugu Serial Today Episode 


మురారి కృష్ణని అవుట్‌ హౌస్‌కి తీసుకొస్తాడు. మరోసారి కృష్ణ కాలుకి స్ప్రే చేసి మసాజ్ చేస్తాడు. దీంతో తాను చాలా అదృష్టవంతురాలిని అని పొంగిపోతుంది. 


కృష్ణ: అవును ఇందాక మీరు దేవ్ అన్నయ్యది ఓవర్‌ యాక్షన్ అని మీకు నమ్మాలి అనిపించడం లేదు అని అన్నారు. 
మురారి: నీకేం అనిపించింది.
కృష్ణ: నాకు నమ్మాలి అనిపించలేదు ఏసీపీ సార్..
మురారి: ముకుంద ఒక్కర్తే మారితే చాలు. వాళ్ల ఫ్యామిలీలో మిగతా ఇద్దరూ మంచోళ్లే. 
కృష్ణ: ముకుందలో మార్పు రావాలి అంటే ఆదర్శ్ రావాలి ఏసీపీ సార్. అది తప్పు వేరే మార్గం లేదు. 
మురారి: ముందు ఈ కేసు తేల్చి ఇందులో నీ ప్రమేయం ఏం లేదు అని పెద్దమ్మకు తెలిసిన తర్వాత మనం చేసేది ఆదర్శని వెతకడం మాత్రమే. సరే నువ్వు రెస్ట్ తీసుకో. 


ముకుంద: వీడేంటి ఇంకా రాలేదు.. హాల్‌లో ఇంకా ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా.. బ్యాక్ డోర్ నుంచి వస్తాను అన్నాడే.. క్షణం క్షణం చస్తూ బతకాల్సి వస్తోంది. అత్తయ్యతో మాట్లాడితే టెన్షన్ ఫ్రీ అవుతుంది. కానీ పదే పదే మాట్లాడితే బాగోదు. ఇంతలో దేవ్ రావడంతో.. దేవ్ ఏంటి ఇంత లేట్.
దేవ్: శ్రీనివాస్ ఫోన్ చేశారు.
ముకుంద: రేయ్ నాన్న ఫోన్ చేశాడు అని చెప్పలేవా.. ఊరికే పేరు పెట్టి పిలుస్తావ్ ఎందుకు.
దేవ్: అతడు నీకు నాన్నలా ఏం చేశాడో చెప్పు. నువ్వు మురారి పిచ్చిలో ఉన్నావు అని తెలిసి కొంపలో కూర్చొని మందు కొడుతూ బాధ పడకుండా నెంబరు 1.. నిన్ను లాగి పెట్టి కొట్టి ఇంటికి తీసుకెళ్లాలి. నెంబరు 2.. ఆదర్శ్‌ని వెతికి నీతో కాపురం చేయించాలి.. లాస్ట్‌ భవాని మేడంని నిలదీసి ప్రేమించుకున్నారు కదా.. పెళ్లి చేయండి అని అడిగినట్లయితే మీ అత్తయ్య ఇప్పుడు చేసే పని అప్పుడే చేసేది కదా.. ఇప్పుడు చెప్పు శ్రీనివాస్‌ రావుని ఎలా నాన్న అనాలి..
ముకుంద: సరే ఇప్పుడు ఆ గోల ఎందుకు జరిగిపోయింది ఎలానో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. పరిమళ వాళ్లు వచ్చేస్తారు.
దేవ్: రానివ్వు.. ఏం అయిపోతుంది. నాకు టెన్షన్ పడడంలో కాదు.. టెన్షన్ పెట్టడంలోనే కిక్ ఉంటుంది. వాడు నా బొమ్మ గీస్తాడు అంటావా.. అలా అయితే ఆలోచించాల్సిందే.. టెన్షన్ పడాల్సిందే.. మరి ఇప్పుడెలా ముకుంద.. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి.. అయితే ఒక పని చేయ్.. మురారిని ఎలాగో మ్యానేజ్ చేసి వాళ్లని రాకుండా ఆపేయ్.. అవును నాకు తెలీకుండా అడుగుతాను నువ్వు మురారితో మాట్లాడవేంటి ముకుంద. నువ్వు మాతో పాటే దూరం దూరంగా తిరుగుతావు ఏంటి. మురారి మంచోడే కావొచ్చు. కానీ మగాడు ముకుంద ఇంత కంటే నేను ఏం చెప్పలేను. 


మరోవైపు నందూ, రేవతి భవాని గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో మురారి అక్కడికి వస్తాడు. మురారిని భవాని పిలిచింది అని చెప్తారు. ఎందుకు అని మురారి అడిగితే తెలీదు అంటారు. ఇక తన గదిలో భవాని గతంలో పెద్దపల్లి ప్రభాకర్ నిజం ఒప్పుకోవడం, తాను కృష్ణని తన గెస్ట్‌ హౌస్‌లో ఉంచడం అన్నీ తలచుకుంటుంది. ఆరోజే కృష్ణని అక్కడ వదిలేసి ఉంటే ఇంత తలనొప్పి ఉండేది కాదు అని అనుకుంటుంది. ఇంతలో మురారి అక్కడికి వస్తాడు. పెద్దమ్మ నీకు చేదు అయిపోయింది కదా అని మురారిని భవాని అడుగుతుంది. 


భవాని: చిన్నప్పుడు నుంచి నిన్ను నా చేతుల్లో పెంచి పెద్ద చేసిన ఒక స్థాయిలోకి తీసుకొచ్చిన నేను.. ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది అనే అడగలేని స్థాయిలోకి నువ్వు వచ్చేశావు. 
మురారి: ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ. పెద్దమ్మ మీరు ఎందుకు ఏడుస్తున్నారు. మీరు ఇలా బాధ పడుతుంటే నేను చూడలేను. 
భవాని: గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నావు కదా నాన్న ఇంకా అలవాటు కాలేదా.. 
మురారి: మిమల్ని నేను బాధ పెట్టాలి అని ఏరోజు అనుకోలేదు.. అనుకోను కూడా..
భవాని: ఏరోజు అనుకోలేదు నిజమే.. కానీ ఇప్పుడు అనుకుంటున్నావ్ మురారి. నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు నాన్న. నీ బాధ అర్థంలేదు అని తెలుసు మురారి. అది అబద్ధం అని తెలిసి కూడా వాళ్లనే నమ్మి నన్ను బాధ పెడుతున్నావు. నిన్ను వాళ్లు నువ్వు చనిపోయావు అని ఓ అనాథ శవాన్ని పంపించినప్పుడు నా గుండె పగిలేలా ఏడ్చాను. రూంలో ఒక్కదాన్నే ఎన్ని రాత్రులు ఏడ్చానో తెలుసా.. చివరికి ముకుంద నువ్వు బతికే ఉన్నావ్ అని చెప్పింది. హాస్పిటల్‌లో నిన్ను ప్రాణాలతో చూసే వరకు నా ప్రాణం కుదుట పడలేదు తెలుసా.. 
మురారి: ఇంత దారుణానికి ఒడికట్టిన వాడిని వదలను నీ ముందు నిలబెడతాను. ఏ ఒక్క ఆధారం వాళ్లే చేశారు అని తెలిస్తే ఆ రోజు మీ కొడుకు అంటే ఏంటో మీరే చూస్తారు. 
భవాని: నాకు ముకుంద అంటే ఏదో ఒక మామూలు కన్సర్న్ ఉండేది. కానీ ఏరోజు అయితే నువ్వు బతికే ఉన్నావని చెప్పిందో ఆరోజు నుంచి నిన్ను కాపాడి నీ ఆచూకి తెలిపి నిన్ను మా దగ్గరకు చేర్చింది చూడు అక్కడి నుంచి నాకు ముకుంద అంటే ఒకలాంటి గౌరవం ప్రేమ అన్ని పెరిగాయి. దానికి నేను ఏం ఇచ్చి రుణం తీర్చుకోవాలో చెప్పు.
మురారి: ఒక్క నాలుగు రోజులు ఓపిక పట్టండి పెద్దమ్మ. ద్రోహిని పట్టుకోక పోతే అప్పుడు మీరు అన్నట్లుగానే చేస్తాను అదీ మీ మీద గౌరవం కోసం. ప్రాణంగా ప్రేమించే భార్యను మోసం చేయడం అవుతుంది. కానీ మీ కోసం ఆ పని నేను చేస్తా. 
భవాని: ప్రాణంగా నువ్వు ప్రేమిస్తున్నావ్ కానీ దాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని వాళ్లు ఏం చేస్తున్నారో నువ్వు తెలుసుకోవడం లేదు.
మురారి: అందుకే కదా పెద్దమ్మ నేను టైం అడిగింది. శుక్రవారం రోజు మీరు ఓడిపోకూడదు అనేదే నా ప్రయత్నం. దాని కోసమే నేను వాళ్లని వెతికే పని చేస్తున్నాను. 
భవాని: నువ్వు చెప్తుంది ఏంటో నాకు అర్థం కావడం లేదు మురారి. నేను గెలవడానికి నువ్వు.
మురారి: అవును పెద్దమ్మ దీనిలో కృష్ణ తప్పు లేదని రుజువు అయితేనే మీరు గెలిచినట్లు అందుకే కృష్ణ వాళ్ల మీద మీకు ఉన్న అనుమానాన్ని ఇప్పుడే పోగొట్టుకోండి. తీరా కాదు అని తెలిస్తే అప్పుడు మీరు కృష్ణని ఫేస్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ స్థితిలో మిమల్ని చూడటం నాకు ఇష్టం లేదు. త్వరలోనే మీకు అర్థం అవుతుంది. 


ఇక నందూ, రేవతి బయట కూర్చొని ఉంటే కృష్ణ అక్కడికి వస్తుంది. ఇక రేవతి ఆలోచనల్లో పడుతుంది. ఇక మురారిని భవాని పిలిచింది అని ఏం మాట్లాడుకుంటున్నారో అని రేవతి కృష్ణతో చెప్తుంది. ఇక కృష్ణ భవానీని ఇమిటేస్ చేస్తుంది. వాళ్లని నవ్విస్తుంది. ఇంతలో దేవ్ అక్కడికి వస్తాడు. ఇక దేవ్ కృష్ణని కిట్టమ్మ అని పిలుస్తాడు. దీంతో తన నాన్న, చిన్నాన్న కూడా అలాగే అంటారు అని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇక రేవతి అయితే దేవ్‌తో నువ్వు ముకుందకు కాదు కృష్ణకి తోడపుట్టినవాడిలా ఉన్నావని అంటుంది. ఇక మనసులో కృష్ణ మధు దేవ్‌ని ఎలా అనుమానించాడా అని ఆలోచిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.