Krishna Mukunda Murari Serial Today Episode 


భవాని: ముకుంద.. ఒక్కదానివే ఇక్కడ ఉండి ఏం ఆలోచిస్తున్నావు.
ముకుంద: అత్తయ్య మురారికి గతం గుర్తొచ్చింది నా భవిష్యత్‌ని అంధకారం చేస్తాడేమో అని భయంగా ఉంది.
భవాని: ఎందుకు భయం ముకుంద.. అసలు ముందు ఆ కేసు తేలాలి కదా.. అయినా నువ్వు తప్పు చేసినట్లు ఎందుకు భయపడుతున్నావ్. తప్పు చేసిన వాళ్లు ఇప్పటికే లోపల ఉన్నారు కదా. ఇప్పుడు మురారి ఆ తప్పు తెలుసుకుంటాడు. అంతే తప్ప అక్కడ ఇంకేం జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు.
ముకుంద: ఒక వేళ ఈ కేసు తేలకపోతే.. పెళ్లి రోజు వచ్చింది అనుకుంటే.. అప్పుడు పెళ్లి తర్వాత ఒకవేళ కృష్ణది తప్పు కాదు అని తెలిస్తే.
భవాని: పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు ముకుంద తప్పు చేసిన వాళ్లు కూడా జైలుకి వెళ్లకుండా తప్పించుకునే రోజులు ఇవి. అలాంటిది తప్పు చేయకుండా ఎవరైనా జైలుకి వెళ్తారా? అయినా నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. 
ముకుంద: అలా ఏం లేదు అత్తయ్య ఒకవేళ అంటున్నాను అంతే. అసలు ఏం జరిగినా మీరు ఉన్నారు కదా. ఇక నాకు టెన్షన్ ఏముంటుంది. అన్నీ మీరే చూసుకుంటారు కదా అది నాకు చాలు అత్తయ్య. 
భవాని: మనసులో.. అన్నీ నేనే చూసుకుంటా అనుకుంటుంది. ఎందుకు నేను ముకుంద, మురారిల పెళ్లి చేసి పంపాలి అనుకుంటే జరగడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. 


ఇక మురారి, ముకుంద హాస్పిటల్‌కి వస్తారు. డాక్టర్ పరిమళని కలుస్తారు. ఇక డాక్టర్‌తో కృష్ణ తమకు భవానికి జరిగిన ఛాలెంజ్ గురించి చెప్తుంది. దాంతో మురారి డాక్టర్‌ని తనని తీసుకొచ్చి సర్జరీ చేసింది ఎవరు.. వాళ్ల డిటైల్స్ ఏంటి అని అడుగుతాడు. దీంతో డాక్టర్ పరిమళ దేవ్‌ని గుర్తు చేసుకుంటుంది. అతని పేరు శేఖర్ అని చెప్తాడని చెప్తుంది. 


కృష్ణ: శేఖర్ ఎవరు.
పరిమళ: అదేంటి మీకు తెలీదా..  అదేంటి మురారి మీకు తెలీకుండా హాస్పిటల్‌లో చేర్పించి సర్జరీ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది చెప్పండి. మీరు ఎవరూ రాకపోతే నేను మురారి అనే పేరున్న మరో వ్యక్తి అనుకున్నాను. 
మురారి: అదే పరిమళ ఇప్పుడు పెద్దమ్మ ఏమో వీళ్ల చిన్నాన్న చేశారు అంటుంది. కాదు అని నేను నిరూపించాలి. అలా నిరూపిస్తేనే ఈ పెళ్లి ఆగుతుంది. అతని డిటైల్స్ ఇంకా ఏం లేవా..
పరిమళ: డిటైల్స్ ఏం లేవురా.. జస్ట్ ఎమ్ శేఖర్ అని ఉంది. మనీ గురించి ఆలోచించొద్దు అన్నాడు. అంతే.  ఇక మురారి సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ చూద్దామని అంటాడు. డాక్టర్ స్టాఫ్‌ని పిలిచి చెప్తుంది. అయితే సెప్టెంబరు 16 తేదీ ఫుటేజ్ లేదు అనడంతో డాక్టర్ షాక్ అవుతుంది. దీంతో పక్కా ప్లాన్‌తో తనకు సర్జరీ చేయించారు అని మురారి అంటాడు. ఇక మురారి, కృష్ణ అక్కడి నుంచి వచ్చేస్తారు. 


మరోవైపు పెళ్లి కోసం నగలు తీసుకొని వ్యాపారి వస్తాడు. ముకుంద భవానిని పిలుచుకొని వస్తుంది. ఇక రేవతి అయితే చాలా బాధపడుతుంది. ఇక అందరూ నగల సెలక్షన్‌లో పడతారు. రేవతి బాధగా తాళి సెలక్ట్ చేస్తుంది. ఇక రేవతి శకుంతల దగ్గరకు వెళ్లి చాలా బాధ పడుతుంది. శకుంతల రేవతికి ధైర్యం చెప్తుంది.


తర్వాత మురారి, కృష్ణలు కమిషనర్‌ని కలవాలి అని స్టేషన్‌కు వెళ్తారు. ఇక మురారి తనని తాను పరిచయం చేసుకుంటాడు. (ఫేస్ మారింది కనుక) ఇక మురారి వాళ్లను కమిషనర్ లోపలికి పిలిచి మాట్లాడుతారు. ఇక మురారి రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవుతా అని అడిగితే రెండు నెలలు కనిపించకుండా పోయి ఇప్పుడు వేరే రూపంలో రావడం వల్ల కుదరదు అని కమిషనర్ చెప్తారు దీంతో కృష్ణ, మురారీలు షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.