Krishna Mukunda Murari Serial Today Episode : మురారి తన పెద్దమ్మతో సవాలు విసురుతాడు. ఇక కృష్ణ కచ్చితంగా మీరు మా చిన్నాన్న నిర్దోషి అని నిరూపిస్తారు సార్ అని చెప్పి అవుట్ హౌస్‌కి బయలు దేరుతుంది. కృష్ణ వెళ్లగానే తన వెనక రేవతి వచ్చి కృష్ణ కృష్ణ అని పిలుస్తుంది. రేవతిని చూసి ఆగిన కృష్ణ ఇలా అంటాడు.
కృష్ణ: ఏంటి మేడమ్ మళ్లీ దిగులుగా ఉన్నారు. మీకు బాధ పడటానికి ఏదో ఒక కారణం కావాలి అని మధు చెప్తూనే ఉంటాడు. నేను జోక్‌గా అనుకున్నాను కానీ అది నిజమే అని ఇప్పుడు అనిపిస్తుంది.
రేవతి: ఏడ్చావ్‌లే నోర్ముయ్..
కృష్ణ: ఇప్పటి దాకా మనం చేసింది అదే
రేవతి: ఏంటి సెటైరా వెటకారమా?
కృష్ణ: రెండూ కాదు.. వాస్తవం.. అవును అత్తయ్య మనం చేసిందేగా ఏదో మన ప్రయత్నంలో ఏసీపీ సార్‌కి గతం గుర్తొచ్చింది కానీ లేదంటే.. శుక్రవారం ఏసీపీ సార్‌కి మాజీ భార్యని అయ్యుండేదాన్ని తెలుసా?
రేవతి: అలా జరగకూడదు అనే కదా దేవుడు ఇలా చేశాడు. అది సరే గతం గుర్తురావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశా అన్నావు కదా ఏం చేశావే తింగరి.
కృష్ణ: నిజం అత్తయ్య నా భర్త ఎవరూ అని నిన్నటి వరకు ఏసీపీ సార్ నన్ను అడుగుతూనే ఉన్నారు తెలిసిందే కదా.. నన్ను అడిగితే మీకు గతం గుర్తొచ్చినప్పుడు నా భర్త ఎవరో మీకే తెలుస్తుంది అని చెప్పాను. అంతే అదే ఆలోచనతో ఉన్న ఏసీపీ సార్ నేను కోనేటిలో పడిపోగానే కనెక్ట్ అయిపోయారు. ఇది సైన్స్ అత్తయ్య.
రేవతి: సరే కానీ.. కలిసినట్లే కలిసి కేసు తేలే వరకు విడిగా ఉంటాము అనడం నాకు నచ్చలేదు కృష్ణ.
కృష్ణ: నాకు ఇష్టమా చెప్పండి.. కానీ మేము కలిసిపోతే మా సిన్సియార్టీని పెద్దత్తయ్య గుర్తించదు. నమ్మదు కూడా.
రేవతి: ఏం ఛాలెంజ్‌లో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అక్కమో ప్రభాకర్ అన్నయ్య చేయడం లేదు అని చెప్తున్నా తన పంతాన్ని తాను వీడట్లేదు.
కృష్ణ: బాధపడకండి అత్తయ్య అన్నీ సర్దుకుంటాయి. ఎన్ని అవాంతరాలు దాటాం ఇది దాటలేమా చెప్పండి. మీరు ఏం ఆలోచించకుండా వెళ్లండి అత్తయ్య.
మురారికి గతం గుర్తొచ్చి కృష్ణని తన భార్యగా గుర్తించినందుకు శకుంతల చాలా సంతోషిస్తుంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్తుంది. ఇక కృష్ణ రాగా తనతో శకుంతల తన సంతోషాన్ని పంచుకుంది. మీ చిన్నాన్నకి ఈ విషయం చెప్తే చాలా సంతోషిస్తాడు అని కృష్ణతో అంటుంది. అప్పుడే మురారి అక్కడి వస్తాడు.
మురారి: మామయ్యని బయటకు నేనే తీసుకొస్తాను. అసలు ఈ తప్పు చేసిన వాడిని లోపల పడేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి.
కృష్ణ: ఇంక దిగులు పడటానికి ఏముంది ఏసీపీ సార్ ఇక మనకు ముందున్న రోజులన్నీ మంచి రోజులే.
మురారి: నువ్వు మాట్లాడకు.. అసలు చేసింది అంతా నువ్వే.. నేను మీ కూతురితో సీరియస్‌గా మాట్లాడాలి.. రా కృష్ణ అని బయటకు తీసుకెళ్తాడు. ఇక బయటకు వచ్చాక కృష్ణ గట్టిగా నవ్వుతుంది. దీంతో మురారి.. నేను ఇంత సీరియస్ మాట్లాడితే నువ్వు నవ్వు తావా.. నిజంగా నువ్వు తింగరివే.. నీ మొగుడి పెళ్లి కూడా వేరేవాళ్లతో జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా తింగరి పనేనా..
కృష్ణ: హా అది కాదు ఏసీపీ సార్ నేను ఎంత బాధ పడ్డానో మీకు కూడా తెలుసు. అసలు పెద్దత్తయ్యకి ఎలా చెప్పాలి.. ఏం చెప్తే అర్థం చేసుకుంటుంది అని ఎన్నో రకాలుగా ఆలోచించాను.
మురారి: కానీ ఏం సాధించావు.. వచ్చే శుక్రవారం ముకుందతో నా పెళ్లి ఊహించుకుంటేనే నీకు ఎలా ఉందో తెలీదు కానీ నాకు చాలా అసహ్యంగా ఉంది.
కృష్ణ: హా.. నాకు మహా సంబరంగా ఉంది.
మురారి: అందుకేనా పసుపు దంచడానికి వచ్చావు.
కృష్ణ: నేనేం పసుపు కొట్టడానికి రాలేదు.. అందరి కళ్లలో కారం కొట్టి మిమల్ని చూడటానికి వచ్చాను. తెలుసా మీకు.. అసలు ఏంటి ఏసీపీ సార్ నాతో గొడవ పడటానికి వచ్చారా..
మురారి: గొడవ పడటానికే వచ్చాను. అరే కళ్లేదుట మొగుణ్ని పెట్టుకొని వాడు మెంటలోడిలా మీ ఆయన ఎవరు మీ ఆయన ఎవరు అంటుంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ కథ చెప్పినట్లు గతం గుర్తొస్తేనే క్లారిటీ వస్తుంది.. గాడిద గుడ్డు గుర్తొస్తుంది అని చెప్పక పోతే అప్పుడే చెప్పొచ్చుకదా.. నేనేనయ్యా మీ భార్య అని ..
కృష్ణ: హాహా.. నేను అలా చెప్తే మీకు గతం గుర్తొచ్చేస్తుందా.. నేను అలా చెప్పబట్టే మీరు బాగా ఆలోచించ బట్టే కోనేటి దగ్గర నేను మీకు కనెక్ట్ అయ్యాను. అవునా కాదా.. నేను అసలు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందో చెప్తాను వినండి. అప్పుడు మీరు ఎందుకో క్యాంపునకు వెళ్లారు. అప్పుడు ముకుంద, పెద్దత్తయ్యతో అంటూ.. (కృష్ణ, మురారిల అగ్రిమెంట్ పెళ్లి, ముకుంద మురారిల ప్రేమ విషయం భవానితో చెప్పిన సంగతి చెప్తుంది. ఇక అప్పుడు భవాని తనని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తుంది.) తర్వాత బయటకు వచ్చాక మీరు రాసిన ఉత్తరం చదివి పరుగున మీదగ్గరకు వచ్చేశా. (తర్వాత యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్తుంది. ) ఇందులో నేను చేసిన తప్పు ఏం ఉంది ఏసీపీ సార్
మురారి: సారీ కృష్ణ..
కృష్ణ: ఆ ఉత్తరం యాక్సిడెంట్‌లో పోయింది. మా ఇద్దరికి ఇక అగ్రిమెంట్ కాదు మా ఇద్దరికి ఇష్టమే అని చెప్పడానికి ఆ లెటర్ తప్ప వేరే ఆధారం లేదు. అందుకే మౌనంగా ఉండిపోయా.. పైగా మా చిన్నాన్న పెద్దత్తయ్య ఎదురుగా నేనే నేరం చేశాను అని ఒప్పుకొని జైలుకి వెళ్లడంతో ఇక పెద్దత్తయ్య అదే నిజం అనుకొని ఇదిగో వచ్చే శుక్రవారం పెళ్లి నిశ్చయించారు. ఇందులో నా తప్పు ఏంటో మీరే చెప్పండి ఏసీపీ సార్.
మురారి: తప్పు నీది కాదు మావాళ్లదే. మీ చిన్నాన్న ఇదంతా చేశారు అని మా పెద్దమ్మకి నీ మీద కోపం ఉండొచ్చు. కానీ మా అమ్మ, మధు వీళ్లంతా పాజిటివ్‌గానే ఉంటారు కదా.. ప్లస్ నందినీ గౌతమ్‌లకు మనం చాలా హెల్ప్ చేశాం. వీళ్లందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు.
కృష్ణ: మీకు తెలుసుకదా ఏసీపీ సార్.. వాళ్లకు పెద్దత్తయ్య అంటే భయం.. మీకు ఎదురించడానికి ఏ ఆధారం లేదు. ఇంకేం మాట్లాడుతారు చెప్పండి.
మురారి: సరే రేపు మనం మన ఇంటికి వెళ్దాం. అప్పుడు ఏదో ఆవేశంలో అన్నాను. ఇంత తెలిశాక ఇప్పుడు దూరం పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా పెడితే వాళ్లకు నాకు తేడా ఏం ఉంటుంది. అయినా ఇంతకాలం దూరంగా ఉండి ఇప్పుడు కూడా దూరంగా ఉంటే నా వల్ల కాదు.
కృష్ణ: లేదు ఏసీపీ సార్.. అత్తయ్యకి మనం ఏంటో బాగా తెలుసు. మనం మాట మీద నిలబడతామని కూడా తెలుసు అలాంటప్పుడు ఇచ్చిన మాట ఎందుకు తప్పడం దూరంగానే ఉందాం.
ఇక మురారి కృష్ణకు ముద్దు పెట్టమని అడుగుతాడు. కృష్ణ సిగ్గు పడుతుంది. దీంతో మురారి కృష్ణని మాటల్లో పెట్టి ముద్దు పెట్టేస్తాడు. ఇక మురారి కృష్ణతో చూశావా.. నువ్వు వద్దన్నా ఎలా ముద్దుపెట్టుకున్నానో అని గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కృష్ణ తెగ సంబరపడిపోతుంది. మరోవైపు భవాని తన గదిలో మురారి తనతో అన్న మాటల్ని గుర్తుచేసుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటుంది.
భవాని: ఒకవేళ మురారి చెప్పినట్లు పెద్దపల్లి ప్రభాకర్ కాకుండా వేరే ఎవరో అయితే ముకుంద జీవితం ఏంటి.. పెద్దపల్లి ప్రభాకర్ అని గట్టిగా నమ్మడంతో నేను అందరి ముందు ఏం జరిగిందని ఒప్పుకున్నాను. మాటిచ్చాను. కానీ మురారి మాట నిలబెట్టుకుంటే అప్పుడు వాళ్లిద్దరూ వెళ్లిపోతే ఒంటరిగా నా ఎదురుగా ఉన్న ముకుందకు ఏం సమాధానం చెప్పాలి..
భవాని అంతరాత్మ: భవాని నిన్ను చూస్తే జాలేస్తుంది.
భవాని: నన్ను చూసి ఈర్ష్య పడేవాళ్లు, గర్వపడేవాళ్లు ఉన్నారు కానీ నన్ను చూసి జాలిపడే అవకాశం నేను ఎవరికీ ఇవ్వను. అది నీకు తెలుసు.
భవాని అంతరాత్మ: తెలుసు కానీ నిన్ను ఇప్పుడు చూస్తుంటే నీకు నీ చెల్లెలు రేవతికి పెద్ద తేడా లేదు అనిపిస్తుంది. ఏ రేవతితో పోల్చితే నీకు అంత రోషం పొడుచుకువచ్చిందా
భవాని: ఆ అమాయకురాలు.. ఆ సెంటిమెంటల్ ఫూల్‌తో నాకు పోలికా.. సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా..
భవాని అంతరాత్మ: ఎస్ ఇప్పటి వరకు నువ్వు న్యాయంగా, పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకునేదానివి కానీ ఇప్పుడు.. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు చూడు అది నువ్వు నువ్వు కాదు అనే నిజం. కాదు అంటావా.. పోనీలే కాదు అని నన్ను కూడా భుకాయిస్తావు అనుకున్నా. కానీ ఒప్పుకున్నావులే.
భవాని: తీసుకున్న నిర్ణయం మీద ఆలోచించడం తప్పా..
భవాని అంతరాత్మ: గర్షణ పడటం తప్పు.
భవాని: ఎలా తప్పు అవుతుంది.
భవాని అంతరాత్మ: చెప్తాను విను. మురారికి యాక్సిడెంట్ జరగకపోయి ఉండుంటే.. లేకపోతే అంతకన్నా ముందు ముకుంద, మురారిల ప్రేమ విషయం తెలిసి ఉంటే ఏం చేసుండేదానివి.
భవాని: వాళ్లిద్దరిదీ అగ్రిమెంట్ పెళ్లి కాబట్టి క్యాన్సిల్ చేసి మురారికి, ముకుందకు పెళ్లి చేసుండేదాన్ని.
భవాని అంతరాత్మ: మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదు. మురారి రూపం తప్ప మరింకేం మారలేదు కదా. మరెందుకు టెన్సన్ అవుతున్నావు. ఒక విషయం చెప్పు నువ్వు పడుతున్న అంతర్మధనానికి నేను చెక్ పెడతాను. ఏ భార్య అయినా భర్తతోనే జీవితం అనుకుంటుంది. పెళ్లి అయిన ఆడదానికి ఆప్షన్లు గానీ ప్రేయారిటీలు గానీ భర్త తప్ప తల్లిదండ్రులు కాదు అనేది వాస్తవం. మరి నువ్వు కృష్ణని అగ్రిమెంట్ మ్యారేజ్ అని నిలదీసి చేసిన తప్పునకు శిక్షగా బయటకు పంపిస్తే ఏం చేసింది..
భవాని: బయటకు వెళ్లిపోయింది.. సో వాట్
భవాని అంతరాత్మ: భర్త కోసం ఎదురు తిరగాలి.. ఎదురు మాట్లాడాలి.. కానీ మొగుడు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూ బయటకు వెళ్లిపోయింది కదా.. నీ మాటలకు భయపడి తల వంచే మనస్తత్వం కాదు కృష్ణది. అవసరం అయితే నిన్ను ఎదురించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు నీ మాటలకు భయపడిందా.. గౌరవించి వెళ్లిపోయిందా.. నిజం బయట పడిపోతుంది అన్న అపరాధభావంతో వెళ్లిపోయిందా.. ఎస్ నేనే నీ భార్యని అని మురారితో చెప్పొచ్చు. అవకాశాలు ఎన్ని ఉన్నా ఉపయోగించుకోలేదు. సో బాగా ఆలోచించు భవాని నాకు అయితే నీ నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత నీఇష్టం.
కృష్ణ: (ముకుంద దగ్గర వెయిట్ చేస్తూ) నిజంగా నాకు దేవుడు ఏసీపీ సార్‌ని ఇంత దగ్గర చేస్తాడు అనుకోలేదు. బయటకు ఎంత ధైర్యంగా ఉన్నా లోపల భయంగానే ఉంది. వచ్చే శుక్రవారం పెళ్లి పెట్టుకొని పెళ్లికి సిద్ధమైపోతుంటే మొండిగా ఉన్నాను. మొండిగా ఉండబట్టే నన్ను పెద్దత్తయ్య ఇక్కడ ఉంచగలిగారు లేదంటే.. నన్ను ఎప్పుడో బయటకు పంపేవారు.
ఇంతలో ముకుంద కళ్లు తెరచి మురారికి గతం గుర్తొచ్చిన సంగతి తలచుకుంటుంది. ఇక బెడ్ మీద నుంచి లేచి తన పక్కనే ఉన్న కృష్ణని చూసి బయపడిపోతుంది. గుడ్ మార్నింగ్ చెప్పిన కృష్ణ ట్యాబ్లెట్లు ఇవ్వడానికి వచ్చాను అంటే వద్దు నువ్వు వెళ్లిపో అని అరుస్తుంది. అసలు నన్ను ఎందుకు బతికించావ్ అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.