Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో 14 వారాల నుంచి కంటెస్టెంట్స్ అంతా ఇంటి ఫుడ్‌ను మిస్ అవుతున్నారని తెలుసుకున్న బిగ్ బాస్.. వారికోసం ఇంటి ఫుడ్‌ను పంపించాడు. కానీ దానిని కూడా కంటెస్టెంట్స్ అంతా టాస్కులు ఆడి గెలుచుకోవాలని తెలిపాడు. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే.. కంటెస్టెంట్స్ అంతా ఎవరి ఇంటి ఫుడ్ కోసం వారు టాస్కులు ఆడడం కాదు.. మరొకరు టాస్క్ ఆడి గెలిస్తేనే.. వారికి తమ ఇంటి ఫుడ్ దక్కుతుంది. ఇప్పటికే అర్జున్, అమర్‌దీప్, శివాజీ.. తమ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్‌ను ఆస్వాదించారు. ఇంకా ప్రియాంక, యావర్, పల్లవి ప్రశాంత్‌లకు మాత్రం రాలేదు. అయితే ఈ ముగ్గురి ఇంటి ఫుడ్ కోసం అర్జున్, అమర్, శివాజీ టాస్కులు ఆడాలని బిగ్ బాస్ తెలిపారు.


పత్తి యాపారం..
‘‘అమర్‌దీప్, అర్జున్, శివాజీ.. ఆహారం లభించని వారిలో నుంచి ఎవరైనా ఒక్కరికి తమ ఇంటి సభ్యులు పంపిన ఆహారాన్ని బహుమతిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆహారం లభించని వారికోసం మరోసారి ఆడాల్సిన సమయం వచ్చేసింది’’ అంటూ బిగ్ బాస్ తరపున హాచీ కంటెస్టెంట్స్‌కు వివరించాడు. ఫినాలే అస్త్రా సమయంలో అర్జున్, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ కలిసి ఆడిన బాల్స్ పజిల్ టాస్కును ఇప్పుడు అర్జున్, అమర్, శివాజీ కలిసి ఆడారు. ఈ పజిల్ టాస్క్ కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉన్నా అమర్, అర్జున్‌కు ఆల్రెడీ ఇందులో అనుభవం ఉంది కాబట్టి వేగంగా ఆడడం మొదలుపెట్టారు. కానీ శివాజీకి మాత్రం చాలాసేపటి వరకు ఈ టాస్క్ ఏంటో అర్థం కాలేదు. అందుకే మధ్యలో అమర్‌ను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు. ‘‘ఇది మొత్తంగా పత్తి యాపారం అవుతుందిగా ఇక్కడ. రేయ్ అనకాపల్లి సత్తిగా ఏంట్రా రాదు ఇది’’ అని అరిచాడు. ‘‘వస్తుంది.. తట్టుకో. తిప్పాలి’’ అని సలహా ఇచ్చాడు. ఇక అర్జున్, శివాజీకంటే అమరే ముందుగా టాస్క్ పూర్తి చేసి గంట కొట్టాడు.


శివాజీని ఇబ్బందిపెట్టిన టాస్క్..
మొదటి టాస్కులో అమర్‌దీప్ గెలవడంతో ఎవరి ఆహారాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నావని అడగగా.. ‘‘7 స్టార్ హోటల్ యావర్’’ అని సమాధానమిచ్చాడు. దీంతో పల్లవి ప్రశాంత్, ప్రియాంకలు మాత్రం వారి ఇంటి ఫుడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. తరువాతి టాస్క్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కంటెస్టెంట్స్ అంతా కలిసి ఆడిన ‘బ్యాలెన్స్ ది కట్లరీ’. అర్జున్, అమర్, శివాజీ.. తమ స్టాండ్‌పై ఒకదానిపై మరో గిన్నెను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ సమయంలోనే ఈ టాస్క్ ఆడుతుండగా శివాజీకి తన చేయి నొప్పి పెరిగింది. ఇప్పుడు మరోసారి పల్లవి ప్రశాంత్ కోసం తను అదే టాస్క్ ఆడవలసి వచ్చింది. ముందుగా స్టాండ్‌పై చిన్న కప్‌ను పెట్టమని హాచీ చెప్పింది. ‘‘ఇప్పుడేంటి ఈ టీ కప్ మీద నిలబెట్టాలా అన్నీ?’’ అని అమర్ ఆశ్చర్యపోయాడు. ముందుగా శివాజీ బ్యాలెన్స్ చేయలేక టాస్క్ నుంచి తప్పుకోగా.. ఆ తర్వాత అమర్ కూడా ఔట్ అయ్యాడు. ఫైనల్‌గా అర్జున్ మాత్రమే చివరి వరకు ఆడాడు. దీంతో అర్జున్ ఈ టాస్కులో గెలిచినట్టు ప్రోమోలో తెలుస్తోంది. మరి తను ఎవరి ఇంటి ఫుడ్‌ను బహుమతిగా ఇస్తాడో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.



Also Read: అనగనగనగా ఒక కారు, ఆ కారులో పార, పార కింద చీర - అమర్‌దీప్ సీక్రెట్ బయటపెట్టిన అర్జున్