Krishna Mukunda Murari Serial Today Episode


మురారికి గతం గుర్తురావడంతో ముకుంద ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. 
మధుతో మందులు తెప్పించిన కృష్ణ ముకుందకు వేయిస్తుంది. దీంతో ముకుంద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ముకుందకు ఇక ఏ ప్రమాదం లేదు కదా అని గౌతమ్‌ను భవానీ అడుగుతుంది. ఏమీ కాదని గౌతమ్‌ చెప్తాడు.


రేవతి: మనసులో.. తన జీవితాన్ని ఇంత నాశనం చేసిన అమ్మాయిని కాపాడాలని ప్రయత్నిస్తున్నా నా కోడలి మనసును అక్కయ్య ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఏమీ అర్థం కావడం లేదు. 
భవాని: ఏమైంది రేవతి
రేవతి: ఏం లేదు అక్కయ్య నా కొడుకుకు గతం గుర్తొచ్చింది అని సంతోషించేలోపే  ఈ పిల్ల ఇలా చేస్తుంది అనుకోలేదు.  అంటే ముకుంద ఉద్దేశం మురారికి గతం గుర్తురాకూడదు అనే కదా.. అందుకే ఇలా చేసింది కదా
భవాని: పొరపాటు పడుతున్నావు రేవతి. తన జీవితం ఏమైపోతుంది అనే బాధలో తనువు చాలించడానికి సిద్ధపడిందే తప్ప మురారికి గతం గుర్తొచ్చినందుకు కాదు.. చూడు చేతనైతే జాలి చూపించు అంతే కాని ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇది కరెక్ట్ కాదు. 
రేవతి: మధు మురారి ఎక్కడున్నాను. 
భవాని: రేవతి నువ్వు ముకుంద దగ్గరే ఉండు నేను మురారితో మాట్లాడాలి. దేవుడి దయవల్ల ఏం కాలేదు. సరే సరే మధు వేణిని తన ఇంటి దగ్గర వదిలేసి రా 
కృష్ణ: పెద్దత్తయ్య ఇప్పుడు వేణి వెళ్లాల్సిన అవసరం ఏముంది
భవాని: ఎప్పటికి వేణిగానే ఉండాల్సి వస్తుంది. దీన్ని అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. 
మధు: అయిందా బాగా అయిందా అసలు నీకు ఎవరు ట్రీట్మెంట్ చేయమన్నారు. ఇంత చేశావ్ కనీసం ఒక్కరైనా నీకు థ్యాంక్స్ చెప్పారా
కృష్ణ: నేను ఈ ఇంటి మనిషిగా రాలేదు మధు ఒక డాక్టర్‌గా స్పందించాను అంతే
గౌతమ్: కృష్ణ అయిందేదో అయింది రేపటి నుంచి నువ్వు కాస్త నీ మంచితనాన్ని పక్కనపెడితే నువ్వు అనుకున్నది మేము అనుకున్నది జరుగుతుంది అర్థం చేసుకో..
రేవతి: గౌతమ్ నిన్ను ఆ దేవుడు పదికాలాల పాటు చల్లగా చూడాలయ్యా.. విన్నావు కదా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్తున్నాడు
కృష్ణ: నా భర్తే నాకు అండగా ఉంటే ఇక నా జీవితానికి ఏం కాదు అత్తయ్య
నందు: మురారి డ్రెస్‌ అయినా మార్చకుండా ఏం ఆలోచిస్తున్నావు?
మురారి: మీ అందరి గురించి ఆలోచిస్తున్నా
నందు: కృష్ణ గురించి ఆలోచించాలి కానీ.. మా అందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ్‌?
మురారి: అవును ఇప్పుడు మీ అందరి గురించే ఆలోచించాలి. ఎందుకంటే కృష్ణను ఒక్కదాన్నే చేసి అవుట్‌ హౌస్‌లో ఉంచితే మీరందరూ ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? నా భార్య కృష్ణే అని కనీసం నాకైనా చెప్పొచ్చు కదా? నేను వేణి గారు అంటుంటే మీకేం అనిపించలేదా? నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశారు కదా?
నందు: అయ్యో మురారి అలా మాట్లాడకురా..
మురారి: నీకు కృష్ణ ఎంత హెల్ప్‌ చేసిందో మర్చిపోయారా?
నందు: అమ్మ సంగతి నీకు తెలుసు కదా?
మురారి: తెలిస్తే.. ఇలాంటి సందర్భంలో నచ్చజెప్పాల్సిన బాధ్యత మీది కాదా? పోనీ నువ్వైతే చిన్న పిల్లవి. మా అమ్మకి ఏమైంది?
నందు: మేమైనా అప్పుడప్పుడూ అమ్మ మాటకి ఎదురు చెప్తాం కానీ.. పిన్ని ఎప్పుడైనా అమ్మ మాటకి ఎదురు చెప్పిందా? ఒక్క మాట అనడం నువ్వు  చూశావా? అందరం ఎంత బాధ పడ్డామో నీకు తెలియదు మురారి.
మురారి: ఉండి ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగింది కదా!
భవాని: ఇప్పుడెలా ఉంది నాన్నా? నీకు గతం గుర్తొచ్చి ఉంటుంది.. కానీ గుర్తు చేయడం నా బాధ్యత. ఒకసారి ఇది చూడు నాన్నా.. అని శుభలేఖ చేతికి ఇస్తుంది. వచ్చే శుక్రవారమే నీకు, ముకుందకు పెళ్లి. చూశావు కదా.. ఆ పిచ్చిది నీకోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంది. నాన్న నేను ఈ నిర్ణయం ఊరికే తీసుకోలేదు. పైగా ఎదుటి వారి దురదృష్టంలో అదృష్టం వెతుక్కునే రకమైన మనస్తత్వం కాదు నాది. నువ్వు ముకుంద ప్రేమించుకున్న మాట వాస్తవమా కాదా.. నిన్నే మురారి మాట్లాడు. నీ ప్రేమ నిజమా కాదా
మురారి: ఆ ప్రేమను మన కుటుంబ గౌరవం కోసం వదిలేసుకున్నాను. అందుకే ముకుందను ఆదర్శ్‌కి ఇచ్చి పెళ్లి చేశాను. 
భవాని: మరి ఆదర్శ్ ఎక్కడ.. పెళ్లి రోజే ముకుందను వదిలేసి వెళ్లిపోయాడు అని నీకు గుర్తుండొచ్చు. ఆ పెళ్లికి ముకుంద ఒప్పుకుంది కానీ తన మనసులో నువ్వే ఉన్నావు. 
మురారి: పెద్దమ్మ నేను కృష్ణని పెళ్లి చేసుకున్నాను ఆ సంగతి మీరు వదిలేసి
భవాని: అంత విచక్షణ లేని మనిషిని కాదు నేను. నువ్వు ఎలా అన్నా దాని అర్థమే అది నాన్న.  నేను కృష్ణను కోడలిగా స్వీకరించి తాను కష్టపడి చదివి చదువుకి సార్థకత ఉండేలా హాస్పిటల్‌ కూడా కట్టిద్దామనుకున్నా.. స్థలం కూడా చూశా. అది నీకు గుర్తుండి ఉండొచ్చు.
మురారి: ప్రతి సారీ నాకు గుర్తుండొచ్చు అనకండి. అన్నీ గుర్తున్నాయ్‌.. గుర్తుకొచ్చాయ్‌ కూడా. 
భవాని: సారీ నాన్నా.. అయినా హాస్పిటల్‌ కట్టించిన తర్వాత మీరంతా నన్ను మోసం చేశారని తెలిసింది.
మురారి: మోసమా? మోసమేంటి?
భవాని: మీరిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చారు. నాకది నచ్చలేదు. కనీసం అప్పుడైనా నువ్వు ముకుంద ప్రేమ గురించి చెప్పలేదు కాబట్టి ఊరుకున్నా.
తర్వాత రోజుల్లో కృష్ణ మంచిగా నటిస్తే నేను నిజమే అనుకున్నా.
కృష్ణ: అయ్యో పెద్దత్తయ్య నేను నటించడమేంటి? నాకు జీవితంలో రానిదే నటించడం.
భవాని: అలా నటించడం చేతకానప్పుడు ఆరోజు మీది అగ్రిమెంట్‌ మ్యారేజ్‌ అని ఎందుకు చెప్పలేదు?
మురారి: అగ్రిమెంట్‌మ్యారేజ్‌గానే ఇంట్లోకి అడుగుపెట్టాం. తర్వాత తర్వాత మీకు కృష్ణలో మంచితనం కనిపిస్తోంది. నాకు చెప్పలేనంత ప్రేమ కనిపించింది. కలిగించింది.. కదిలించింది కూడా
భవాని: గుడ్ మరి అప్పుడు నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు. నిన్ను అంతగా కదిలించే విషయం నాతో కూడా చెప్పి ఉండుంటే నేను కూడా కదిలిపోయి కరిగిపోయుండేదాన్నేమో. 
మురారి: సారీ పెద్దమ్మ నేను కృష్ణ అగ్రిమెంట్ పెళ్లిని పర్మినెంట్ పెళ్లిగా చేసుకుందాం అనుకున్నాం. చెప్పేలోపే ఇందంతా జరిగిపోయింది. 
భవాని: మీకు కన్వీనెంట్‌గా మార్చి నాకు చెప్పొద్దు మురారి. 
కృష్ణ:  అవును పెద్దత్తయ్య ఏసీపీ సార్ చెప్పింది అక్షరాలా నిజం.. 
భవాని: ఏ ఆరోజు మీది అగ్నిమెంట్ పెళ్లి అని నాకు తెలిసినప్పుడు ఈ మాటలు అన్నీ లేవెందుకు. మాట్లాడు కృష్ణ ఏడుస్తూ ఎందుకు వెళ్లిపోయావు. ఒక్క మాట కూడా ఆరోజు నువ్వు ఇలా మాట్లాడలేదు. మరెందుకు బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోయావ్. ఇవన్నీ అనవసరం మురారి బయటకు వెళ్లిన కృష్ణ విషయం వాళ్ల బాబాయ్‌కి చెప్పింది. వాళ్ల చిన్నాన్నకి చెప్పి నీ యాక్సిడెంట్‌కి కారణం అయ్యింది. 
కృష్ణ: అత్తయ్య నేను కూడా కారణం అవుతాను కదా.. మా చిన్నాన్న ఇదంతా నా కోసమే చేస్తే మరి నన్ను ఎందుకు చంపాలి అనుకుంటారు.
భవాని: బాగానే చెప్పావు కానీ కృష్ణకు చిన్న దెబ్బలు తగిలి ఎలా బయట పడింది. నీకు మాత్రం రూపం మార్చగలిగే అంత దెబ్బలు ఎలా తగిలాయి. ప్రొఫెషనల్ లారీ డ్రైవర్ అయిన ఆ పెద్దపల్లి ప్రభాకర్‌నే దీనికి కారణం. నిన్ను హాస్పిటల్‌లో చేర్పించి మళ్లీ నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నీ రూపం మార్చేశారు. వాళ్ల అదృష్టం కొద్దీ నువ్వు గతం మర్చిపోయావు
మురారి: లేదు పెద్దమ్మ నన్ను హాస్పిటల్‌లో చేర్పించింది వీళ్ల చిన్నాన్న కాదు. నాకు సరిగా కనపడలేదు కానీ అది వేరే వ్యక్తి. 
భవాని: ఎవరో అయితే అన్ని లక్షలు ఖర్చు పెట్టి నీకు వైద్యం ఎందుకు చేయిస్తారు మురారి. ఒక్క మాట చెప్తా.. నువ్వు చనిపోయావని ఫేక్ డెడ్ బాడీని ఇంటికి పంపించారు. అవును కృష్ణ వాళ్లు చేయలేదు అనడానికి ఒక్క ఆధారం కూడా లేదు. నీకు ఇలా జరిగిందని తెలిసి కూడా కృష్ణ ఇంటికి వచ్చి ఎందుకు చెప్పలేదు. 
కృష్ణ: నేను వచ్చాను పెద్దత్తయ్య కానీ మా చిన్నాన్న వచ్చి తీసుకెళ్లిపోయాడు. 
భవాని: విన్నావా మురారి అదీ విషయం వచ్చింది అంట వాళ్ల చిన్నాన్న తీసుకెళ్లిపోయాడు అంట. 
మురారి: సరే పెద్దమ్మ మీరు ఇన్ని చెప్తున్నారు కదా నేను వింటాను. కానీ వీళ్ల చిన్నాన్న ఈ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అసలైన వారిని పట్టుకొని కృష్ణ చిన్నాన్న ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. 
భవాని: గుడ్ నాన్న గుడ్.. అతన్ని నిర్దోషిలా బయటకు తీసుకురా.. కానీ ఒక కండీషన్.. వచ్చే శుక్రవారంలోపే నిరూపించు. నిరూపించలేకపోతే శుక్రవారమే నీకు ముకుందకు పెళ్లి జరుగుతుంది. నీకున్న టైం చాలా తక్కువ అని నాకు తెలుసు. ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదు. అందరికీ గుర్తుందిగా మళ్లీ చెప్తున్నా.. మురారి నిరూపిస్తా అంటున్నాడు. అదే జరిగితే సంతోషంగా నేను మీ ఇద్దరి పెళ్లిని అంగీకరిస్తాను. 
మురారి: పెద్దమ్మ అప్పటి వరకు వీళ్లు యాక్సిడెంట్ చేయించారు అనే పంతాన్ని వదిలేయండి.. ఈ సమస్య తేలే వరకు కృష్ణ ఇంటికి రావొచ్చు వెళ్లొచ్చు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.