Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇదే కుర్చీలో కూర్చుంటాను అని మొండిగా మాట్లాడుతున్న నిషికని అందరూ వింతగా చూస్తారు.


నిషి: అందరూ నేను ఏదో తప్పు చేసినట్లు అలా చూస్తారేంటి, అయినా ఈ కుర్చీలో ఏంటి అంత స్పెషల్ ఇది కూడా చెక్కతో చేసిందే కదా అంటుంది.


ధాత్రి: స్పెషాలిటీ కుర్చీలో కాదు కూర్చునే మనిషిలో ఉంటుంది ఇంతమంది పెద్దలు కూర్చోకుండా వదిన కోసం ఆ కుర్చీ ఉంచారంటే వదినకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకో అని నచ్చచెప్తుంది.


కౌషికి: నాతో నీకు పోటీ ఏమిటి, అయినా నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అయిన దానికి, కాని దానికి గొడవ పడుతున్నావు అంటుంది.


ధాత్రి ఏదో చెప్పబోతూ ఉంటే ఆమె మాటని పట్టించుకోకుండా కౌషికితో వాదనకి దిగుతుంది నిషిక. ఇంతలో కుర్చీ తూలి పడిపోతుంది.


అలా పడటంతో ఇన్సల్ట్ గా ఫీల్ అయిన నిషిక ఇప్పుడు మీ అందరికీ హాయిగా ఉంది కదా నేను ఇక్కడ కూర్చుంటానని ఇలాంటి కుర్చీ వేశారు నాకు ఎవరూ చెప్పలేదు అంటుంది.


కేదార్: ధాత్రి ఇందాకటి నుంచి చెప్పటానికి ప్రయత్నిస్తే నువ్వే పట్టించుకోలేదు అంటాడు.


నేనంటే ఈ ఇంట్లో ఎవరికీ విలువ లేదు అని విసురుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నిషిక. ఆమె వెనకే యువరాజ్ వెళతాడు.


నిషిక: ఈ ఇంట్లో నేనంటే ఎవరికీ ఖాతరలేదు అని ఏడుస్తుంటే భర్త వచ్చి ఓదారుస్తాడు.


యువరాజ్: నీదే తప్పు, ఆ కుర్చీలో ఎవరు కూర్చోరు, చెప్తే నువ్వే వినిపించుకోలేదు అంటాడు.


నిషిక: అవును తప్పు నాదే మీలాంటి చేతకాని వాడిని పెళ్లి చేసుకున్నాను కదా నాదే తప్పు.. మీ ఎవ్వరికి నా బాధ అక్కరలేదు.. నేను మా అమ్మకి నా బాధ చెప్పుకుంటాను అంటుంది.


అంతలోనే నిషిక వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నువ్వు చేసిన పిచ్చి పని ఏమిటి? ఏ కుర్చీ కోసం పోరాడాలి, నువ్వు ఏ కుర్చీ కోసం పాకులాడుతున్నావు బుర్ర పనిచేయడం మానేసిందా అంటూ చివాట్లు పెడుతుంది. కౌషికిని మంచి చేసుకుని అక్కడ కుర్చీ సంపాదించు అంటుంది. వాళ్ళ అత్త కూడా అదే చెప్తుంది.


నిషిక: నేను ఎక్కడ తప్పు చేసానో నాకు అర్థమైంది, నా తప్పుని సరిదిద్దుకుంటాను అయినా ఇంట్లో గొడవ జరిగినట్టు నీకు అప్పుడే ఎలా తెలిసిపోయింది అంటుంది.


అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి నేనే చెప్పాను అంటుంది. మీ అత్తగారితో మాట్లాడు అని ఫోన్ పెట్టేస్తుంది నిషిక తల్లి. తర్వాత వైజయంతి కూడా నిషికతో నువ్వు తెలివైన దానివి నీకు కావలసిన కుర్చీ ఇది కాదు.


నిషిక: క్షమించండి.. నేను చేసిన పొరపాటు నాకు అర్థమైంది ఇకమీదట చూడండి.. నేను ఎలాంటి ఎత్తులు వేస్తానో అంటూ భర్త దగ్గరికి వెళ్లి మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడాను అని క్షమాపణ కోరుకుంటుంది.


ఆ తరువాత డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కీర్తి. కానీ స్టెప్స్ వేయటం రాకపోవడంతో డల్ గా ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తుంది కౌషికి.


కౌషికి: ఎందుకు డల్ గా ఉన్నావు ఏమైంది అని అడుగుతుంది.


కీర్తి: డాన్స్ టీచర్ రాలేదు.. నాకేమో స్టెప్స్ వేయటం రావడం లేదు.


కౌషికి: మీ డాన్స్ టీచర్ రానని ఇప్పుడే ఫోన్ చేసింది. రేపు చేద్దువు గాని లే అంటుంది.


కీర్తి: ఎల్లుండి కాంపిటేషన్ రేపు ఒక్కరోజు డాన్స్ చేస్తే కాంపిటీషన్ కి సరిపోదు అంటుంది.


అప్పుడే అక్కడికి ధాత్రి దంపతులు వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. కౌషికి జరిగిందంతా చెప్తుంది.


కేదార్: ఇందులో అంత బాధ పడటానికి ఏముంది మీ ధాత్రి అత్తకి డాన్స్ బాగా వచ్చు అంటాడు.


కౌషికి: నిజమా అయితే పాపకి నేర్పించు.


ధాత్రి : నన్ను ఇరికించకు కేదార్.. ఆయన ఊరికే చెప్తున్నారు నాకు ఏ డాన్సు రాదు అని కీర్తి బుగ్గలు నిమురుతూ అంటుంది. అటుగా వెళుతున్న యువరాజ్ క్యాజువల్ గా చూసి అటువైపు చూస్తాడు. అప్పుడే అతని కంటికి ధాత్రి పెట్టుకున్న ఉంగరం కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు.


వైజయంతి: అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి ఏం జరిగింది అని అడుగుతుంది.


కౌషికి: జరిగిందంతా చెప్తుంది.


వైజయంతి : దానికి ఎందుకు అంత బాధ పడటం నిషిక చాలా బాగా డాన్స్ చేస్తుంది అంటూ ఆమెని పిలుస్తుంది.. ఆమెతో పాటు యువరాజ్ కూడా వస్తాడు.


యువరాజ్: మీ ఇద్దరి చేతులకి ఒకలాంటి ఉంగరాలే ఉన్నాయి ఏంటి అని అడుగుతాడు.


ధాత్రి: ఇవి పెట్టుకుంటే మంచిదని నాన్న ఇద్దరికీ ఒకలాంటివే చేయించారు. అయినా ఎందుకు అంతలా అడుగుతున్నారు అంటుంది.


యువరాజ్: ఇదేంటి ఉంగరం గురించి అడిగితే అంత కంగారు పడిపోతుంది.. అంటే వీళ్ళిద్దరిలో కచ్చితంగా ఎవరోఒకరు పోలీస్ అయి ఉంటారు అనుకుంటూ మొన్న మా ఫ్రెండ్ ని ఎవరో కొడితే ఉంగరం ముద్ర పడిందంట అని చెప్తాడు.


ధాత్రి : మనసులో వీడు నన్ను అనుమానిస్తున్నాడా అనుకుంటుంది.


ఆ తర్వాత వైజయంతి కీర్తికి డాన్స్ నేర్పమని నిషికని అడుగుతుంది.


నిషిక : ఫోజులు కొడుతూ కుర్చీ మీద కూర్చొని నా డిమాండ్ ఉన్నప్పుడు నన్ను బాగా బ్రతిమిలాడాలి అని పొగరుగా మాట్లాడుతుంది.


ఆపై అత్తగారు బ్రతిమాలడంతో కీర్తికి క్లాసికల్ డాన్స్ స్టెప్స్ నేర్పిస్తుంది. అయినా డాన్స్ నేర్చుకోకుండా ముభావంగా ఉన్న కీర్తిని చూసి ఏం జరిగింది అని అడుగుతుంది నిషిక.


కౌషికి: దానికి కావాల్సింది క్లాసికల్ డాన్స్ కాదు సినిమా డాన్స్ అంటుంది. నిషిక మొఖం వాలిపోవడంతో ఏం నీకు సినిమా డాన్సులు రావా అని అడుగుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.