మురారీ వాళ్ళు ఇంటికి వస్తారు. కృష్ణ డల్ గా ఉండటం చూసి ఏమైందని ప్రసాద్ తనని అడుగుతాడు.
ముకుంద: మేం షాపింగ్ కి వెళ్ళాక అటు నుంచి రెస్టారెంట్ కి వెళ్ళాం. అక్కడ ఒక ఫన్నీ విషయం జరిగింది
మురారీ: ఇప్పుడు అవి అవసరమా
ముకుంద: సరదా కోసం చెప్తున్నా అందులో తప్పేముంది. రెస్టారెంట్ లో మేం ముగ్గురం ట్రూత్ అండ్ డేర్ ఆడుకుంటున్నాం. పక్కన ఉన్న కొందరు మా ఇద్దరిలో మురారీ భార్య ఎవరని బెట్ కట్టారంట. అందులో అందరూ నేనే మురారీ భార్య అనుకున్నారట. కృష్ణ మురారీ భార్య అని ఒక్కడే బెట్ వేశాడు మిగిలిన పది మంది కూడా నేనే మురారీ భార్య అని బెట్ వేశారు
ప్రసాద్: అందుకేనా కృష్ణ అలిగినట్టు మొహం పెట్టింది
Also Read: కళావతి మీద రాజ్ దొంగ ప్రేమ - స్వప్న, రాహుల్ ఎక్కడికి వెళ్ళినట్టు!
ముకుంద: వాళ్ళందరూ నేనే మురారీ భార్యని అని అన్నారు అనగానే భవానీ గట్టిగా అరుస్తుంది
భవానీ: ఎవడో దారిన పోయే వాడు తెలియక తప్పుడు కూత కూస్తే అప్పుడే వాడికి చెప్పాలి. వినకపోతే చెంప పగలగొట్టి కృష్ణని చూపించి మురారీ భార్య తను. నేను తన భార్యని కాదు తన ప్రాణ స్నేహితుడు ఆదర్శ్ భార్యని అని తెలియజెప్పాలి. తెలియక వాళ్ళు చేసిన పొరపాటుని సరిదిద్ది అక్కడే మర్చిపోవాల్సింది పోయి నువ్వు ఇంటి దాకా మోసుకురావడమే కాకుండా కృష్ణ ముందు అందరిలో సిగ్గు పడుతూ నన్ను మురారీ భార్య అనుకున్నారని మురిసిపోతున్నావా? చీ సిగ్గుగా అనిపించడం లేదా నీకు అలా చెప్పుకోవడానికి. అందరిలో అలా చెప్పుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి? అందంగా ఉన్నావని మిడిసిపడుతున్నావా? కృష్ణని ఎగతాళి చేస్తున్నావా? ఏంటి నీ ఉద్దేశం
కృష్ణ: ఇందులో తన తప్పేమీ లేదు మురారీ భార్యగా ముకుంద ఫీల్ అవలేదు. వాళ్ళు ఎవరో సరదాగా అనుకున్నారని చెప్తుంది కానీ
భవానీ: నోర్ముయ్ కృష్ణ నువ్వు. తనని వెనకేసుకొస్తున్నావా? లేదంటే తప్పొప్పులు నాకు నేర్పిస్తున్నావా? ముకుంద నువ్వు మాట్లాడిన దాంట్లో ఎంత తప్పు ఉందో అర్థం అయ్యిందా? అలా మాట్లాడటం తప్పా కాదా?
ముకుంద: తప్పే అత్తయ్య
భవానీ: నీ భర్త ఎవరు?
ముకుంద: ఆదర్శ్..
భవానీ: మురారీ నీకు ఏమవుతాడు?
ముకుంద: నా భర్త ప్రాణ స్నేహితుడు
భవానీ: ఇది ఎప్పటికీ నీకు గుర్తుండాలి. ముకుందకే కాదు అందరికీ చెప్తున్నా మన సరదాలు ఎవరినీ కించపరిచేలా ఒకరిని హర్ట్ చేసేలా ఉండకూడదు. హెల్తీగా ఉండాలి అలాంటి సరదా కబుర్లు చెప్తే నవ్వుకుందాం. కానీ ఇలా సరదాకి కూడా వావి వరసలు మార్చకూడదు అర్థం అయ్యిందా
Also Read: 'నీ భర్త ఎవరంటూ' ముకుంద మీద భవానీ ఫైర్- మనసులో మాట చెప్పిన మురారి!
కృష్ణ అద్దం ముందు నిలబడి ఎందుకు ఏసీపీ సర్ భార్యగా కనిపించలేదా అని ఆలోచిస్తుంది. అటు మధుకర్ కృష్ణని సపోర్ట్ చేస్తూ ఇటు అలేఖ్య ముకుంద తరఫున మాట్లాడుతూ పోట్లాడుకుంటారు. కృష్ణ డైట్ పాటించాలంటే ఫ్రూట్స్ జ్యూస్ లు ముందు పెట్టుకుని కూర్చుంటుంది. మురారీ వచ్చి ఏంటి జ్యూస్ షాపు ఓపెన్ చేశావా అని అంటాడు. అందంగా ఉండనా అంటూ కృష్ణ అమాయకంగా అడుగుతుంది. ఎదురుగా పెట్టుకున్న జ్యూస్ లు అన్నీ తాగేస్తుంది. మళ్ళీ మనసు మార్చుకుని ఎవరికోసమో మనల్ని మార్చుకోకూడదని చెప్తుంది.
కృష్ణ: నేను మీకు నిజంగా నచ్చానా
మురారీ: నాకు నచ్చావు ఇంక ఏంటి
కృష్ణ: మీకు నచ్చితే చాలు మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను
ముకుంద తండ్రి దగ్గరకి వస్తుంది. కూతురు డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు.
ముకుంద: రోజురోజుకీ జీవితం మీద విరక్తి కలుగుతుంది. బతకాలని ఆశ చచ్చిపోతుంది. అన్ని తెలిసి నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నాకు మురారీ కావాలి. నా ప్రేమ బతకాలి. ఆ కృష్ణ చేతిలో నేను ఒడిపోకూడదు. నా ప్రేమని బతికించు నాన్న. నీ కూతుర్ని కాపాడుకోండి. నా ప్రేమ కోసం పోరాడి పోరాడి అలిసిపోయాను. నేనేమైనా కృష్ణ భర్తని ప్రేమించానా? నేను ప్రేమించిన వాడిని కృష్ణ పెళ్లి చేసుకుంది. తను పెళ్లి చేసుకుందని నేను తనని వదిలేసుకోవాలా? అలాంటి పరిస్థితి వస్తే నేను ప్రాణాలే వదిలేసుకుంటాను
శ్రీనివాస్: అలా మాట్లాడకు నీకు నేనున్నాను. నేను వచ్చి మీ ప్రేమ విషయం భవానీ దేవితో మాట్లాడతాను. నీ ప్రేమని నేను బతికిస్తాను
ముకుంద: నువ్వు బతికించకపోతే చచ్చేది నా ప్రేమ కాదు మీ కూతురు. మురారీని నేను ఎంతగా ప్రేమించానో అత్తయ్యకి అర్థం అయ్యేలా చెప్పండి. జరిగింది చెప్పండి ఆదర్శ్ తో పెళ్లి బలవంతం మీద ఒప్పుకున్నానని చెప్పండి. మిగతాది తనే చూసుకుంటుంది
శ్రీనివాస్: చెప్తాను
ముకుంద: భవానీకి భయపడి, రేవతి అత్తయ్య మాటలకి కరిగిపోయి నిజం దాస్తే మీకు మీ కూతురు దక్కదు
తరువాయి భాగంలో..
ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అందరూ ఎవరి భర్త దగ్గర వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు. ముకుంద మురారీ కాళ్ళ దగ్గర చెవి కమ్మ పడేసినట్టుగా పడేసి తన పాదాలు తాకుతుంది. అది చూసి కృష్ణ ఆశ్చర్యపోతుంది.