తాడో పేడో తేల్చుకునేందుకు మురారీ ముకుంద పిలిస్తే మాట్లాడేందుకు వెళతాడు. కృష్ణ అటుగా వెళ్తూ వాళ్ళ మాటలు విని ఆగిపోతుంది.


మురారీ: మన కథని మరొక విధంగా చెప్తాను. నేను మీ అక్కని పెళ్లి చేసుకుని ఉంటే ఇలాగే మా మధ్యలో దూరిపోయేదానివా? ఇప్పుడు కృష్ణని నన్ను వేరు చేస్తున్నట్టు మీ అక్కని నన్ను కూడా వేరు చేయాలని చూస్తావా? అసలు నువ్వు ఏం చేసే దానివి? అప్పుడు కూడా మా అక్క జీవితం ఏమైనా కానీ నాకు నా ప్రేమ ముఖ్యం అనుకునేదానివా? అలా కాకుండా మా అక్క జీవితం బాగుంటే చాలని అనుకుని నీ ప్రేమని చంపుకునే దానివా? చెప్పు ఏం చేసే దానివా?


అంటే ఒకప్పుడు ముకుందని ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కృష్ణ అనుకుంటుంది.


ముకుంద: నేను నా ప్రేమనే కోరుకునే దాన్ని.. మా అక్క కాళ్ళ మీద పడి అయినా సరే, మా అమ్మానాన్నలు వెలి వేసినా సరే నేను నా ప్రేమనే కోరుకునేదాన్ని. ఎవరో ఏదో అనుకుంటారని నేను నా జీవితాన్ని నాశనం చేసుకునే దాన్ని కాదు నా ప్రేమని గెలిపించుకుంటాను. నువ్వు ఇలాంటి పిట్ట కథలు చెప్పి నన్ను మార్చలేవు


Also Read: కృష్ణకి మొత్తం తెలిసిపోయింది - మురారీకి భార్యగా సేవలు చేస్తున్న ముకుంద!


మురారీ: నువ్వు మారతావు అనుకోవడం నా బుద్ధితక్కువతనం. నువ్వు ఇక ఈ జన్మలో మారవు. కానీ నేను నీలా కాదు. నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం ఆదర్శ్. వాడు తొలి చూపులోనే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నీ గురించి చాలా సార్లు ఫోన్ చేసి చెప్పాడు. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే. కానీ ఎప్పుడైతే ఆదర్శ్ నీ మెడలో తాళి కట్టాడో అప్పుడే నా ప్రేమకి గుండెల్లో సమాధి కట్టేశాను. ప్లీజ్ ముకుంద చావనైనా చస్తాను కానీ నా ప్రాణ స్నేహితుడి భార్యని ప్రేమించలేను. నువ్వు ఏ శిక్ష వేసినా నీ ఇష్టం


మురారీ మాటలు విని కృష్ణ చాలా సంతోషపడుతుంది. అంటే ఆదర్శ్ తో పెళ్లి కాగానే ఏసీపీ సర్ ముకుందని మర్చిపోయారని ఆనందపడుతుంది. అందుకే డైరీలో మళ్ళీ ముకుంద గురించి రాయలేదని అనుకుంటుంది.


ముకుంద: ఏం చేసినా సరే మన విషయం ఇంట్లో చెప్పేసి పెళ్లి చేయమని అడుగుదాం


మురారీ: అది నా వల్ల కాదు


ముకుంద: అలాంటప్పుడు కృష్ణని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్


మురారీ: మా గురువుగారికి ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకున్నా


ఈ మాటలన్నీ విన్న కృష్ణ మురారీ తప్పు లేదని అర్థం చేసుకుంటుంది. మీ తరఫున ముకుందకి తను బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. పొద్దున్నే లేచి నిద్రపోతున్న మురారీని చూస్తూ తనతో గడిపిన సంతోష క్షణాలన్నీ తలుచుకుని కృష్ణ మురిసిపోతుంది. ఆ డైరీ అమ్మాయి ముకుంద అని చెప్పి అది గతం వర్తమానం నువ్వే తింగరని చెప్తే అర్థం చేసుకునే దాన్ని కదా అనుకుంటుంది. స్కెచ్ పెన్ తీసుకుని నిద్రపోతున్న మురారీ మొహం బొట్టు పెడుతుంది. ముకుంద కంటే ముందుగా కృష్ణ లేచి ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంది. భవానీ మురారీ ఇంకా నిద్రలేవలేదా అంటే కృష్ణ చేసిన పని గుర్తుకు వచ్చి గదిలోకి పరుగులు పెడుతుంది. మురారీ లేచి కిందకి వస్తుంటే తన మొహం చూసి అందరూ నవ్వుతారు. చంటి పిల్లాడిలా బుగ్గన చుక్క మొహాన బొట్టు పెట్టుకుని కనిపిస్తాడు. కృష్ణ కంగారుగా గదిలోకి వెళ్ళమని చెప్తున్నా మురారీ వినిపించుకోకుండా అందరి ముందుకు అలాగే వచ్చేస్తాడు.


Also Read: ఏంజెల్ ఇంట్లోంచి వెళ్లిపోయిన రిషి పయనం ఎటు, వసుకి పెద్ద షాకే ఇది!


మధుకర్ మురారీని ఫోన్ తీసి చూపిస్తాడు. తన మీద ప్రయోగం చేస్తావా అని భార్య వెంట పడతాడు. ఇన్నాళ్ళూ ఏబీసీడీ అబ్బాయి అన్నది ఇప్పుడు చంటి పిల్లని చేసిందని తన వెంట పరుగులు పెడతాడు. వాళ్ళిద్దరూ ఇల్లంతా సందడిగా కలియతిరుగుతూ ఉంటారు. అది చూసి ముకుంద బాధపడుతుంది. దీంతో కోపంగా తన చేతిలో ఉన్న కాఫీ కప్పు నేలకేసి కొడుతుంది. ఆ పనికి అందరూ షాకింగ్ గా చూస్తారు. ఏమైందని భవానీ అడుగుతుంది. బాగా కాలినట్టు ఉందని రేవతి కౌంటర్ వేస్తుంది. కృష్ణ మెల్లగా గదిలోకి వెళ్ళి మురారీని పిలిస్తే భయపెడతాడు. నిద్రలేచేసరికి క్యూట్ గా కనిపించేసరికి బొట్టు పెట్టానని చెప్తుంది. ఇద్దరూ మళ్ళీ గదిలో ఆట మొదలుపెడతారు. కృష్ణ వెంట మురారీ లాఠీ పట్టుకుని శిక్షించాలని పరుగులు పెడతాడు. అలా ఇద్దరూ కాసేపు సరదాగా గడుపుతారు.


మధుకర్: కృష్ణ, మురారీ గురించి చాలా టెన్షన్ పడ్డారు కదా. చూశారా ఇప్పుడు ఎంత బాగా సెట్ అయ్యారో


రేవతి: అది తింగరిది


మధుకర్: కానీ కృష్ణ ఏం చేసినా అందరికీ నచ్చుతుంది. మీరేం భయపడొద్దు


రేవతి: నా భయం ముకుంద గురించి. చూశావుగా రోజురోజుకీ ఎలా చేస్తుందో. మనమే ముకుంద స్పీడు తగ్గించాలి


మధుకర్: మార్పు తనకి తానుగా రావాలి. ఆదర్శ్ వచ్చేవరకు ముకుంద వల్ల కృష్ణ సంసారంలో సమస్యలు రాకుండా చూసుకోవడం తప్ప ఏం చేయలేము