Krishna Mukunda Murari September 19th:  ఇంటి బాధ్యతలు తీసుకున్న తర్వాత ముకుందలో చాలా మార్పు వచ్చిందని భవానీ అంటే అవును స్పీడు పెంచిందని రేవతి వెటకారంగా అంటుంది. స్పీడు పెంచడం ఏంటని అడుగుతుంది. వేగంగా చేస్తోందని కవర్ చేస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ముకుంద చేసిన వంటలు ఏంటో కళ్ళు మూసుకుని స్మెల్ చూసి అవి ఏం కూరలో కృష్ణ చెప్తుంది. అన్నీ కరెక్ట్ గా సూపర్ గా చెప్పావని మధుకర్ అంటాడు. అందరినీ కూర్చోబెట్టి ముకుంద తనే వడ్డిస్తానని చెప్తుంది. మురారీకి వడ్డిస్తూ నీకు ఇష్టమని కూర చేశానని అనేసరికి కృష్ణ మొహం మాడిపోతుంది. ముకుంద ప్రవర్తనకి రేవతి చిటపటలాడుతూ మాట్లాడేసరికి భవానీ ఏమైందని అనుమానపడుతుంది. కావాలని ముకుంద మురారీ ఇష్టాయిష్టాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అది విని అందరూ షాక్ అవుతారు. కృష్ణ కావాలని ఇంకా మురారీకి ఏమేం ఇష్టమని అడుగుతుంది. తింటుంటే మురారీకి పొలమారుతుంది. కృష్ణ వెంటనే వాటర్ అందించబోతుంటే ముకుంద కూడా ఒకేసారి ఇస్తుంది. ఇద్దరి గ్లాసులు తగిలి వాటర్ మురారీ మీద పడతాయి. కృష్ణ ముకుంద పక్కనే ఉంది కదా నువ్వు ఎందుకు ఇవ్వడమని రేవతి సీరియస్ గా అంటుంది.


Also Read: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర!


ప్రతి విషయంలో మురారీ విషయంలో అతి చనువు తీసుకుంటూ మాట్లాడుతుంది. తన మాటలకి భవానీకి కోపం వస్తుంది. ఏసీపీ సర్ కి తను వడ్డిస్తానని చెప్పి ముకుందని పక్కకి వెళ్ళమని చెప్తుంది. అందరి ముందు నా మురారీకి సేవలు చేసుకుంటున్నానంటూ రేవతి వైపు పొగరుగా చూస్తుంది. ముకుంద మాత్రం మురారీ పక్కన నుంచి కదలకుండా అలాగే ఉంటుంది. కృష్ణకి ముకుంద మీద అనుమానం కలిగిందేమోనని రేవతికి అనుమానం వస్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత కృష్ణ ముకుంద గురించి ఆలోచిస్తుంది.


కృష్ణ: అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది. ముకుంద ఆదర్శ్ పేరు చెప్పి మురారీకి సేవలు చేస్తుంది. ఏసీపీ సర్ ఏమో ముకుందతో ప్రేమ గురించి నాతో ఇన్ డైరెక్ట్ గా చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి. ఆయన మనసులో నేను లేనని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలా? లేదంటే అబద్ధం చెప్పి ఎందుకు తీసుకొచ్చారని అత్తయ్యని నిలదీయాలా? ఏం చేయాలి అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడే మధుకర్ వచ్చి ఏమైందని ఎందుకు బాధపడుతున్నావని అడుగుతాడు. కానీ కృష్ణ మాత్రం తన మీద సీరియస్ అయిపోతుంది. అదంతా మురారీ గమనిస్తాడు. అప్పుడే మురారీకి ముకుంద కాల్ చేస్తుంది.


మధుకర్: నువ్వు నాకోసం చాలా చేశావ్. ఏమైందో చెప్పు


కృష్ణ: అవును చాలా బాధగా ఉంది. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో తెలియడం లేదు చచ్చిపోవాలని అనేంత బాధగా ఉంది. నువ్వు తీరుస్తావా? తీర్చలేవు కదా వెళ్ళు


మధుకర్: ముకుంద నీకేమైన వార్నింగ్ ఇచ్చిందా? అనేసరికి కృష్ణ షాక్ అవుతుంది. నీ బాధకి కారణం ముకుందనా? అన్నీ నీకు వివరంగా చెప్తాను


ముకుంద మళ్ళీ కాల్ చేసి రమ్మని పిలుస్తుంది. దీంతో మురారీ కోపంగా వస్తున్నా నీతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని వెళ్ళిపోతాడు. మధుకర్ కృష్ణని పక్కకి తీసుకెళ్ళి ముకుంద, మురారీ గురించి ఏదో  చెబుతాడు. గదిలో అలంకరించిన ముకుంద లవ్స్ మురారీ బెలూన్స్ తీసేసిన విషయం మొత్తం చెప్తాడు. ముకుందకి నువ్వే బుద్ధి చెప్పాలి. లేదంటే ఆదర్శ్ వచ్చే వరకు తనని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అత్తయ్యలాగే మధు కూడా అబద్ధం చెప్తున్నాడా? ఏదైనా నా కళ్ళతో నిజం తెలుసుకునే దాకా ఎవరిని నమ్మకూడదని అనుకుంటుంది.


కృష్ణ: నువ్వు చెప్పింది నిజమైతే ముకుందని నేనే సెట్ చేస్తాను. నిజం చెప్పినందుకు థాంక్స్


Also Read: కావ్య రాక్స్.. రుద్రాణి షాక్- తెలివిగా అత్త మనసు మార్చిన కళావతి


మురారీ: అసలు ఏంఅనుకుంటున్నావ్ ముకుంద నువ్వు ఏం చేసినా వీడు ఏం చేయలేడని అనుకుంటున్నావా? ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను. నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే నీకే మంచిది. నువ్వు పరిచయమైనప్పుడు మురారీ వేరు ఇప్పుడు వేరు. తన కోసం నా ఇష్టాలన్నీ మార్చుకున్నా.నీ సేవలు, ప్రేమ ఆదర్శ్ కి చూపించు నాకు అవసరం లేదు. ఇది రిక్వెస్ట్ కాదు వార్నింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్


ముకుంద: అయిపోయిందా నేను మాట్లాడొచ్చా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఎందుకు వచ్చి నామీద అరుస్తావ్. నేను నిన్నే ప్రేమిస్తా. అందరి ముందు నీకు భార్యలాగా సేవలు చేస్తా ఏం చేస్తావ్? కొడతావా? కొట్టు. నీ మనసులో నాకు తప్ప వేరేవరికి చోటు ఉండదని మాట ఇచ్చి మళ్ళీ అదే మాట నువ్వు తప్పి నాకు అన్యాయం చేశావ్. మాట నిలబెట్టుకోమంటే నామీద అరుస్తావ్ ఏంటి? అసలు కృష్ణని వదిలేయడానికి నీ ప్రాబ్లం ఏంటి?అప్పుడే కృష్ణ వచ్చి వాళ్ళ మాటలు చాటుగా వింటుంది.


మురారీ: అవును నాదే తప్పు నేనే మాట ఇచ్చాను తప్పాను. నేనే నిన్ను మోసం చేశాను ఒప్పుకుంటున్నా. ఒకప్పుడు నిన్ను ప్రేమించాను చాలా గొప్పగా ప్రేమించాను. నీకోసం గుండెల్లో గుడి కట్టుకున్న.. కానీ ఇప్పుడు కాదు. నువ్వు ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడు ఆదర్శ్ భార్యవి నిన్ను నేను ప్రేమించలేను.