మురారికి గతం గుర్తుకు వస్తుందా? భవాని, కృష్ణను ఔట్‌ హౌస్‌ నుంచి వెళ్లగొడుతుందా? లాంటి ఆసక్తికరమైన మలుపులతో ఇవాళ్టి ఏపిసోడ్‌ సాగింది. మురారి, ముకుంద కలిపి కృష్ణ ఉన్న ఇంటిని క్లీన్‌ చేస్తుంటారు. పైలు తీసుకుని ప్రసాద్‌, భవాని దగ్గరకు వస్తాడు.


భవాని : ఏంటి ప్రసాద్‌


ప్రసాద్‌ : అదే వదిన నిన్న అన్నయ్య దగ్గరకు ప్రాజెక్టు పని మీద వెళ్లాను కదా


భవాని : అవును నీతో సుమలత, అలేఖ్య కూడా వచ్చారు కదా..


ప్రసాద్‌ : అలేఖ్యను సుమలత వాళ్ల ఊరికి తీసుకెళ్లింది వదిన రెండు మూడు రోజుల్లో వస్తా అని చెప్పారు. మన పవర్‌ స్టేషన్‌ ప్రాజెక్టు గురించి డీటెయిల్స్‌ అన్ని అన్నయ్య మీకు చూపించమని చెప్పారు.


భవాని: ఆ ఫైల్‌ హాల్‌ లో పెట్టు నేను తర్వాత చూస్తాను.  ఈశ్వర్‌, మురారి గురించి ఏమన్నారు.


ప్రసాద్‌ : ఏం అనలేదు వదిన ప్రాణాలతో ఉన్నాడు అంతే చాలు అన్నారు. ఈ వార్త విని రెండు రోజులు భోజనం చేయలేదట. కానీ ఒక మాటన్నాడు వదిన అది నాకు నచ్చలేదు.


అనడంతో భవాని ఏంటో చెప్పమని అడిగితే ముకుందకు, మురారికి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నారు. అనగానే ఆయన అనడంలో తప్పేం లేదు కదా అనుకుంటారు భవాని, ప్రసాద్‌.


కృష్ణ ఇంటిని క్లీన్‌ చేసిన తర్వాత డాక్టర్‌ కు ఇంత చెత్త ఇంటిని ఎందుకు ఇచ్చారు అని మురారి మనసులో అనుకుంటాడు. అయినా ఈమె డాక్టర్‌ అయినా ఇంత సింపుల్‌గా ఉందేంటి? అయినా ఈ విషయాలన్నీ ముందే అడుగుతే బాగుండు అనుకుంటాడు మురారి. అటు ముకుంద కూడా కృష్ణ వచ్చి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే నాతో ఇంటిని క్లీన్ చేయించుకుంది. దీన్ని ఇక్కడ కూడా ఉండకుండా తరిమేయాలి అనుకుంటుంది. రూం క్లీన్‌ చేసినందుకు కృష్ణ ముకుందకు థాంక్స్‌ చెబుతుంది.


మురారి: అవును డాక్టర్‌ రూంనే కాదు మనుషులను కూడా అద్దంగా మార్చే గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్‌. మీ రూంను ఎలా క్లీన్‌ చేసిందో అలాగే గతం మర్చిపోయి తిరుగుతన్న నన్ను అందరితో ఇలా ఫ్రీగా తిరిగేలా చేసింది. ఐ లైక్‌ హర్‌. డాక్టర్‌గా మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా.. కానీ మీరు ఇంటి మనిషి కాదు కదా..


అనగానే ముకుంద చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కృష్ణ మాత్రం బాధపడుతుంది. తర్వాత ముకుంద, మురారి అక్కడి నుంచి వెళ్లిపోతారు. రేవతి అందరికీ టిఫిన్‌ రెడీ చేస్తూ ఉంటుంది.


మధు : ఏవమ్మా రేవతమ్మా ఇవాళ టిఫిన్‌ ఏం చేశారు.


రేవతి: రేయ్‌ ఇదేమన్నా రెస్టారెంటా.. ఇంటి పద్దతులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. పైగా పెద్దమ్మ అనడం మానేసి రేవతి అని పేరు పెట్టి పిలుస్తున్నావ్‌. ఎప్పుడురా నువ్వు బాగుపడేది.


 పెద్దమ్మా నవ్వేం బాధపడకు.. కృష్ణ ఒక్కడే లేడు మురారి కూడా ఉన్నాడని చెప్తాడు మధు. దీంతో కృష్ణ ఎప్పటికైనా తాను అనుకున్నది సాధిస్తుందని రేవతి చెప్పి కృష్ణకు టిఫిన్‌ పంపిస్తాను ఉండు అంటూ మధుకు చెప్తూ లోపలికి వెళ్తుంది రేవతి.


మురారి బాల్కనీలో నుంచుని ఎందుకో డాక్టర్‌ ను పదేపదే చూడాలనిపిస్తుంది. ఎందుకో హాస్పిటల్‌ లో కూడా ఇలాగే అనిపించింది అనుకుంటుండగా  కృష్ణ తులసి పూజ చేస్తూ కనిపిస్తుంది దీంతో కృష్ణను చూసి చూడ్డానికి డాక్టర్‌లా లేదు పక్క హౌస్‌ మేకర్‌ లా ఉంటుంది. అనుకుంటూ కృష్ణను చూస్తుండిపోతాడు. కృష్ణ తులసి పూజ చేసి మురారి చూసి హారతి తీసుకోమని సైగ చేస్తుంది. కిందకు వస్తానని మురారి పరుగెత్తుతాడు.


ముకుంద : ఏయ్‌ మురారి ఆగు మురారి జాగ్రత్త పడిపోతావ్‌..


మురారి పరిగెత్తడం చూసి కుటుంబ సభ్యులందరూ మురారి దగ్గరకు వస్తారు.. బయటి నుంచి కృష్ణ హారతి పట్టుకుని లోపలికి ఏమైందని అడుగుతుంది.


మురారి: ఏం లేదు హారతి తీసుకుందామని వస్తుంటే కాలు స్లిప్పైంది.


అని హారతి తీసుకున్నాక భవాని, మురారిని పైకి వెళ్లమని చెప్తుంది. ముకుంద, మురారిని పైకి తీసుకెళ్తుంది. పైకి వెళ్తున్న మురారి తదేకంగా కృష్ణ ను చూస్తూనే వెళ్తాడు. కృష్ణ కూడా మురారిని చూస్తూనే ఉంటుంది.


భవాని : ఏం చదివావు నువ్వు


కృష్ణ : మా ఏసీపీ సార్‌ డాక్టర్‌ చదివించారు.


భవాని : నోర్‌ మూయి మళ్లీ ఏసీపీ సార్‌ అనకు సిగ్గు లేదా నీకు ఎందుకు లోపలికి వచ్చావ్‌


కృష్ణ : నిజం ఎప్పుడూ అబద్దం కంటే నమ్మకంగా ఉంటుంది మేడం. అందుకే అందరూ అబద్దాన్నే నమ్ముతారు.


భవాని :  తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా?   


అని తనకు ఎదురు మాట్లాడితే ఔట్‌ హౌస్‌లో కూడా ఉండనివ్వనని కృష్ణను హెచ్చరిస్తుంది భవాని. మురారి బెడ్‌ రూంలో ఉన్న పాత ఫోటోలను, గుర్తులను లేకుండా చేస్తుంది. అయితే హాల్‌లో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చూసి మురారి ఆలోచిస్తుంటాడు. ఇంతలో మురారికి పాత విషయాలు గుర్తుకు వస్తుంటాయి. పైనుంచి వచ్చిన ముకుంద..మురారిని చూసి ఏమైందని అడగడంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ ముగుస్తుంది.