Krishna mukunda Murari November 23rd:  ఎలాంటి డౌట్లు, భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్లిరండి సార్‌ అంటూ కృష్ణ  చెప్పి వెళ్తుంది. కృష్ణకు అమెరికాలో కాంటాక్ట్‌ నెంబర్‌ భవాని ఇవ్వనందుకు మనసులో సంతోష పడుతుంది ముకుంద. రేవతి ఏదో ఆలోచిస్తూ ఉండగా మధు వస్తాడు.


మధు: వాట్‌ పెద్దమ్మ ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావ్‌..


రేవతి: ఏం లేదురా? మన తింగరి మీ పెద్ద పెద్దమ్మ ముందు ఎంత ధైర్యంగా మాట్లాడిందిరా..!


మధు: నీ కోడలు సూపర్‌ పెద్దమ్మా అందులో డౌటే లేదు.  కానీ మురారికి ఆ గతమేదో గుర్తుకు వస్తే బాగుండు. అసలు జేబులో నయా పైసా ఉండటం లేదు.


రేవతి: వాడికి గతం గుర్తుకు రావడానికి నీకు డబ్బులు రావడానికి ఎంట్రా సంబంధం.


మధు: అర్థం కాలేదా పెద్దమ్మా గతం గుర్తుకువస్తే కృష్ణ నా భార్య అంటాడు. ఇక కృష్ణకు అప్పుడు పనేం ఉంది. హ్యాపీగా కృష్ణతో రీల్స్‌ చేయిస్తా..  నాలుగు డబ్బులు సంపాదిస్తా..


అనగానే మధు చెవి పట్టుకుని రేవతి తిడుతుంటే.. కృష్ణ  అక్కడికి వస్తుంది. విషయం తెలుసుకుని ఏసీపీ సార్‌కు గతం గుర్తుకు వస్తే రీల్స్‌ ఏంటి మధు ఏకంగా సినిమాలే చేద్దాం అంటుంది. సంతోషంగా మధు..  పెద్దమ్మతో నువ్వు భలే మాట్లాడావు కృష్ణా అనగానే కృష్ణ భయంగా ముకుందతో చాలా డేంజర్‌ అంటూ బాంబ్‌ పేలుస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.


 కృష్ణ కిచెన్‌లో వంట చేస్తుండగా అక్కడికి మురారి వస్తాడు. ఏం చేస్తున్నారని కృష్ణని అడుగుతాడు. ఎగ్‌ఫ్రై చేస్తున్నానని కృష్ణ చెప్పడంతో మురారి హ్యాపీగా ఎగ్‌ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. కృష్ణ ఎగ్జైంటింగ్‌గా మురారిని చూస్తూ..


కృష్ణ: మీకు ఎగ్‌ ఫ్రై అంటే ఇష్టమని గుర్తొచ్చిందా?  పర్వాలేదు మీకు నిదానంగా అన్నీ గుర్తొస్తాయి. ఇంకా ఏమేమి ఇష్టం. చెప్పండి సార్‌ కొంచెం ఆలోచించండి. ఏమైనా గుర్తొస్తున్నాయా?


మురారి: ఏమీ గుర్తుకు రావడం లేదు.


అనగానే సరేలేండి మెల్లగా గుర్తుకు వస్తాయని కృష్ణ కర్రీ చేస్తుండగా ఆయిల్‌ కృష్ణ మీద పడబోతుంటే మురారి చేతులు అడ్డం పెడతాడు. దీంతో మురారి చేతులు కాలుతాయి.  మురారిని  హాల్లోకి తీసుకువచ్చి చేతులకు ఆయిట్‌మెంట్‌ పూస్తుంది కృష్ణ. మురారి ఆకలిగా ఉందనడంతో కర్రీ పూర్తి చేసి మురారికి భోజనం తీసుకువచ్చి తన చేతులతోనే కలిపి మురారికి తినిపిస్తుంది కృష్ణ.


మురారి బెడ్‌రూంలో కూర్చుని డాక్టర్‌ నెంబర్‌ ఎందుకు పెద్దమ్మ వేణికి ఇవ్వలేదని ఆలోచిస్తుంటాడు. ఇంతలో అక్కడికి ముకుంద వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావ్‌ అని అడుగుతుంది. వేణికి ఎందుకు డాక్టర్‌ నెంబర్‌ ఇవ్వలేదని అడుగుతాడు మురారి. అప్పుడు కోపంగా


ముకుంద: నీకు ఎప్పుడూ ఆ వేణి ద్యాస తప్పా వేరే లేదా? వాళ్లు ఎంత మోసం చేశారో మీ పెద్దమ్మ అంత క్లారిటీగా చెప్పినా కూడా నువ్వు వాళ్ల గురించి ఆలోచించడం మానవా? నీకు మా మీద ఎలాంటి గౌరవ మర్యాదలు లేవా?


మురారి: కాదు మీకు నా మీద జాలి తప్ప మరేం లేదు అనిపిస్తుంది. నేనేదో మానసిక రోగినైనట్లు మీరిద్దరూ నన్ను మనిషిలా కాదు గాజు బొమ్మలా చూస్తున్నారు. నన్ను మనిషిగా ఒక స్నేహితుడిలా చూస్తున్న ఆ వేణిగారంటే నాకు అభిమానం ఏర్పడదా? నేను చనిపోయానంటూ శవాన్ని పంపారంటారు. అసలు ఏ స్వార్థంతో ఆ పని చేశారో ఎవ్వరూ చెప్పడం లేదు. అంత అవసరం వాళ్లకు ఏముంది? అసలిప్పుడు అమెరికా ప్రయాణం ఎందుకు?  అదేంటో నేను తెలుసుకుందామనుకుంటున్నాను.


ముకుంద: ఆ పని చేయ్‌ మురారి. ఆ పని చేసి ఇంటి పరువుని బజారున పడేసేయ్‌. ఏంటి మురారి నేనే అంటున్నాను కదా ఎంక్వైరీ చేయమని. ఏం మాకు చేతకాదా? నోరు మూసుకుని కూర్చున్నది ఎందుకు? పెద్దత్తయ్య తలుచుకుంటే రెండే రెండు నిమిషాలు తెలుసా?      


అంటూ మురారి మనసు మార్చేందుకు ముకుంద ప్రయత్నిస్తుంది. ముకుంద ఎంత చెప్పినా మురారి మాత్రం ఎందుకో వేణి గారిని చూస్తుంటే అలా అనిపించడం లేదని మనసులో అనుకుంటాడు.


భవాని కోపంగా కృష్ణ ఇంట్లోకి వెళ్తుంటే లోపల కృష్ణ, నందినితో కూర్చుని బ్రెడ్‌ తింటుంది. భవాని గుమ్మం దగ్గరే ఆగి వాళ్ల మాటలు వింటుంది. నందిని బాధపడుతూ మురారికి ఎప్పుడు గతం గుర్తుకు వస్తుందోనని మేమంతా బాధపడుతుంటే నువ్వేంటి అంత హ్యాపీగా ఉన్నావ్‌ అంటుంది. ఏసీపీ సార్‌ను అమెరికా పంపిస్తే అన్ని గుర్తుకు వస్తాయి. దీంతో నన్ను కూడా గుర్తుపడతాడు. ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు. కానీ ముకుంద గురించే నా బాధంతా అంటుంది కృష్ణ. కృష్ణ మాటలు గుమ్మం దగ్గర నుంచి వింటున్న భవాని షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.