అగ్ని ప్రమాదంలో గాయపడిన మురారీని అతి కష్టం మీద కృష్ణ బతికించుకుంటుంది. తనకి దగ్గరుండి సేవలు చేసి మామూలు మనిషిని చేస్తుంది. కృష్ణ తన కోసం పడిన ఆరాటం గురించి పోలీస్ కానిస్టేబుల్స్ మురారీకి చెప్పి మెచ్చుకుంటారు. మీ కోసం తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా అగ్నికీలలోకి వెళ్తానని గొడవ చేసిందని చెప్తారు. అదంతా విని మురారీ సంతోషపడతాడు. ఇక మురారీ, కృష్ణ మధ్య ఉన్న అగ్రిమెంట్ గడువు ముగియడంతో తను వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..


రేవతి మురారీని చూసి బాధపడుతుంది. తన కొడుకుని ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నా అని అంటుంది. ఈరోజుతో మా అగ్రిమెంట్ అయిపోతుందని మీకు ఎలా చెప్పాలి అత్తయ్య అనుకుంటుంది. ఆ తర్వాత నిజంగానే చెప్పేస్తుంది.


Also Read: రౌడీల నుంచి కళావతిని కాపాడిన రాజ్- రుద్రాణి అవమానానికి కావ్య సమాధానం ఏంటి?


రేవతి: ఇంతేనా కృష్ణ నువ్వు వాడిని అర్థం చేసుకుంది. ఇలా అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోవడానికేనా వాడిని నువ్వు కాపాడింది


కృష్ణ: ప్లీజ్ అత్తయ్య నన్ను అర్థం చేసుకోండి. నన్ను వెళ్లనివ్వండి ఇప్పుడు మీకు నేను ఏమి చెప్పలేను


ఇక తెల్లారిన తర్వాత మురారీ కృష్ణ కోసం వెతుకుతూ తల్లి దగ్గరకి వస్తాడు. కృష్ణ ఎక్కడని అడుగుతాడు. అగ్రిమెంట్ అయిపోయింది కదా అందుకే వెళ్లిపోయిందని చెప్పేసరికి మురారీ షాక్ అవుతాడు.


నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..


క్యాంప్ దగ్గర జరిగిన అగ్నిప్రమాదంలో చిన్న పిల్లలు చిక్కుకున్నారని తెలిసి వాళ్ళని కాపాడేందుకు మురారీ రిస్క్ చేస్తాడు. మంటల్లోకి వెళ్ళి వాళ్ళని సురక్షితంగా బయటకి తీసుకొస్తాడు. ఈ క్రమంలో మురారీ గాయపడతాడు. బయటకి వచ్చిన తర్వాత మురారీ కళ్ళు తిరిగి అక్కడే ఉన్న రాయి మీద పడిపోతాడు. తలకి రాయి తగలడంతో బాగా రక్తం పోతుంది. తనని బతికించుకోవడానికి కృష్ణ శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి మురారీని బతికించుకుంటుంది. ఇక తనకి దగ్గరుండి సేవలు చేసి నయం అయ్యేలా చేస్తుంది. కాలికి గాయం అవడంతో నడవలేకపోతాడు. కృష్ణ తన చెయ్యి పట్టుకుని నడిచేలా చేస్తుంది.


అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ వచ్చి మురారీ దగ్గర కృష్ణ గురించి గొప్పగా చెప్తారు. మీరు మంటల్లో చిక్కుకున్నప్పుడు కృష్ణ మేడమ్ ఎంత చెప్పినా వినకుండా టెంట్ లోకి వెళ్తానని మిమ్మల్ని కాపాడుకుంటానని గొడవ చేశారు. మీకోసం చాలా తాపత్రాయపడ్డారు. మీరు కళ్ళు తెరిచే దాకా పక్కనే ఉండి సేవలు చేశారని చెప్తారు. అది విని మురారీ తన ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావ్ కృష్ణ అని బాధపడతాడు. భవానీ దేవి ముకుంద గదిలోకి వెళ్తుంది. ఆమె రాకముందే మురారీ ప్రేమకి సంబంధించినవన్నీ ముకుంద తీసి దాచి పెడుతుంది. గది చెక్ చేయడానికి వచ్చానని, ప్రేమ సంగతి దాచి తప్పు చేశావని అంటుంది. కానీ మళ్ళీ గది చూడకుండానే భవానీ వెళ్ళిపోతుంది. అనవసరంగా మా ప్రేమ జ్ఞాపకాలు దాచి పెట్టాను కనిపించేలా చేసినట్టయితే మురారితో నా పెళ్లి పెద్దత్తయ్య చేసే వాళ్ళు కదా అని ముకుంద అనుకుంటుంది.


Also Read: స్టైల్ మార్చి తల్లికి షాకిచ్చిన విక్రమ్- మాజీ భార్యకు ప్రపోజ్ చేయడానికి రెడీ అయిన నందు


ఇంట్లో రేవతి లేదని తెలుసుకున్న ముకుంద ఎక్కడికి వెళ్ళిందని అలేఖ్యని అడుగుతుంది. తనకి కూడా తెలియదని కానీ కంగారుగా బయటకి వెళ్ళిందని చెప్తుంది. ఇద్దరూ మురారీ గురించి మాట్లాడుకుంటారు. ఒక వేళ కృష్ణ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వెళ్లిపోకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తుందేమోనని అలేఖ్య అంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ రాదు మురారీ మనసులో కృష్ణ లేదని క=గట్టిగా నమ్మేలా చేశాను. కాబట్టి తను ఎప్పటికీ మురారీ జీవితంలోకి రాదని చెప్తుంది. మురారీ పక్కన కృష్ణ కంటే నువ్వే బాగుంటావని అలేఖ్య బిస్కెట్ వేస్తుంది. దీంతో ముకుంద తెగ సంతోషపడుతుంది.