Brahmamudi August 7th: తన పని వదిలేసుకొని వచ్చినందుకు చిరాకు పడుతుంది అప్పు. దాంతో కళ్యాణ్ అలా వెళ్ళిపోకు.. నాకు సహాయం చేయటానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారంటూ.. పేరు కనుక్కోమని సవాల్ విసిరిన ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవడానికి నువ్వే సహాయం చేయాలి అని తనను అడుగుతాడు. మరోవైపు కావ్య తండ్రి అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.


అప్పుడే అక్కడికి రాజ్ వచ్చి గుడ్ న్యూస్ చెప్పాలి అనడంతో.. నాకు గుడ్ న్యూస్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారా అని కాస్త నిరాశ పడుతూ మాట్లాడుతుంది. దాంతో రాజ్ నిన్ను డిజైనర్ పోస్ట్ కి తీసుకోవటానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇదే అని అనగా ఆ జాబ్ చేయలేను అని అంటుంది. వెంటనే రాజ్ కోపంతో..  కంపెనీకి నీ అవసరం ఉందని తెలిసి అలా కావాలని చేస్తున్నావా అని అంటాడు.


దానితో కావ్య కావాలంటే డిజైన్ చేసి ఇస్తాను కానీ డబ్బులు తీసుకోలేను అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ ధాన్య లక్ష్మీ వింటుంది. ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి రాజ్ వచ్చి కావ్య గురించి చెబుతాడు. దాంతో ధాన్య లక్ష్మి కూడా జరిగిన విషయం చెబుతుంది. ఆ తర్వాత కావ్య వినాయకుడికి  దండం పెట్టుకుంటూ వెంటనే మట్టి బొమ్మల ఆర్డర్ కోసం అందరికీ ఫోన్ చేస్తుంది.


ఇక రాజ్ తన తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఊరికే ఏమి ఇవ్వలేదు.. తన కష్టానికి ప్రతిఫలం ఇచ్చాను అని అంటాడు. అంతేకాకుండా కావ్య ఉద్యోగం చేయడానికి తన తల్లిని ఒప్పిస్తాడు. ఇక ఈ విషయం కావ్య దగ్గరికి వెళ్లి చెప్పిన కూడా తను అస్సలు ఒప్పుకోదు. ఇక మీ వల్లే మా కుటుంబం బ్రతికిందన్న మాటలు భరించలేను అని కావ్య అనటంతో తనకు ఒళ్లంతా పొగరే అని కోపంతో తిట్టుకుంటాడు.


ఆ తర్వాత కావ్యకి విగ్రహాల ఆర్డర్ వస్తుంది. ఇక స్వప్న తన ప్రెగ్నెంట్ విషయంలో అనుమానం వస్తుంది అని రాహుల్తో కమిట్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే రాహుల్ తాగి రావటంతో.. తిట్టించినందుకు ఆనందంగా ఉంది అని అంటాడు. ఇక రాహుల్ తన ప్రెగ్నెన్సీ మాటలు వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత మత్తులో ఉన్న రాహుల్ ని  లొంగ తీసుకోవాలని చూస్తుంది.


 ఇక తరువాయి భాగంలో పుట్టింటికి వెళ్ళిన కావ్య అవసరం కోసం బొమ్మలు చేయటానికి మట్టిని కలుపుతూ బొమ్మలు చేస్తూ ఉండగా దుగ్గిరాల కుటుంబం కావ్య బొమ్మలు తయారు చేస్తున్న దృశ్యం మీడియా కంట్ల పడటంతో అందులో చూసి దుగ్గిరాల కుటుంబం ఒకేసారి షాక్ అవుతారు. పైగా వార్తలలో డబ్బుల కోసం దుగ్గిరాల కోడలు రోజువారి కూలీగా చేస్తుందని.. ఆ ఇంట్లో వాళ్లకి అసలు మనసే లేదా అంటూ వార్తలు రావడంతో..  ఆ మాటలు విని రాజ్ షాక్ అయ్యి బాగా కోపంతో రగిలిపోతాడు.


also read it : Madhuranagarilo August 5th: తాగి రచ్చ రచ్చ చేసిన రాధ.. శ్యామ్ తో ప్రేమలో పడ్డ రాధ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial