బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్, క్రికెట్ ప్రియుల్ని ఊపేసిన ఐపీఎల్ కూడా ఈ రేటింగ్స్ ని దాటలేకపోయింది. అందుకే బుల్లితెర బాహుబలిగా స్థిరపడిపోయింది కార్తీకదీపం. అయితే కారుప్రమాదంతో దీప-కార్తీక్-మోనిక పాత్రలను ముగించి కొత్త జనరేషన్ తో సరికొత్తగా నడిపిస్తున్నారు నిర్వాహకులు. గత కొద్ది రోజులుగా పాత టీమ్ మొత్తం మళ్లీ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య శోభాశెట్టి కూడా వస్తే రావొచ్చని క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా వంటలక్క తన ఇన్ స్టా అకౌంట్లో 'దీప మేడం షాట్ రెడీ అంటే వస్తున్నా' అన్న వీడియో పోస్ట్ చేసింది. వచ్చెయ్ దీపక్కా డాక్టర్ బాబుని తీసుకుని అని అభిమానులు అన్నారు కూడా. తాజాగా శోభాశెట్టి మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది...
కార్తీకదీపం సీరియల్ లోకి వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత, హిమ, శౌర్య అందరం మళ్లీ వచ్చేస్తున్నాం అంది. ఏదో మాటల్లో చెప్పడం కాదు ఏకంగా కార్తీకదీపం కార్యాలయానికి వెళ్లి అక్కడ ప్రొడక్షన్ టీమ్ తో నేరుగా మాట్లాడించి చెప్పించింది మోనిత అలియాస్ శోభాశెట్టి. ఆయన కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు...దీప, కార్తీక, హిమ, శౌర్య అందరూ వస్తున్నారని చెప్పేశారు.దీంతో నిన్న మొన్నటి వరకూ ఉన్న డౌట్స్ అన్నీతీరిపోయాయి.
రీఎంట్రీ టీమ్ తో కథ ఏంటన్నది మాత్రం స్క్రీన్ మీదే చూడాలి అంటున్నారు నిర్వాహకులు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కథ ఉండబోతోందని చెబుతున్నారు. ఇప్పటికే పెద్దైన హిమ-శౌర్య ఉండగా చిన్నప్పటి హిమ-శౌర్యను తీసుకొస్తున్నారంటే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయా... కారు ప్రమాదంలోంచి హిమ బతికి వచ్చినట్టే వంటలక్క-డాక్టర్ బాబు కూడా బతికే ఉన్నారా. కొడుకును, ఆస్తిని వదిలేసి తెల్లచీర కట్టుకుని వెళ్లిపోయిన మోనిత...మళ్లీ ఎలాంటి గెటప్ లో తిరిగి రాబోతోంది? . వీళ్ల రాక ముందే ఫిక్సైందా లేదంటే టీఆర్పీ రేటింగ్స్ పడిపోతున్నాయని నిర్వాహకులు ఇలా ప్లాన్ చేశారా? ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ అండ్ సీ...
Also Read: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!
Also Read: శౌర్య ప్రేమని గెలిపించేందుకు హిమ గుళ్లో ప్రేమ్ ని పెళ్లిచేసేసుకుంటుందా!