డల్‌గా కూర్చున్న నిరుపమ్‌ను ఓదార్చే క్రమంలో హిమ పెళ్లి సంగతిని బయటపెడుతుంది స్వప్న. విజయవాడకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కొడుకుతో హిమ పెళ్లిని ఫిక్స్ చేస్తున్నారని వివరంగా చెబుతుంది. దాన్ని విన్న నిరుపమ్ మరింత కుంగిపోతాడు. నిన్ను కాదన్న హిమ వేరే డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటుందని నా ఆనందం కోసమైనా శోభను పెళ్లి చేసుకోమని కోరుతుంది స్వప్న. ఇంకా నమ్మకం కుదరక మరోసారి నిజామా అని అడుగుతాడు నిరుపమ్. వెళ్లి మీ అమ్మమ్మను అడగమంటుంది స్వప్న. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. 


ఇక్కడ తన రూమ్‌లో కూర్చొని నాన్నమ్మా అని పిలవాల్సిన నోటితో సౌందర్యను సీసీ అంటూ పిలవడమేంటో అనుకుంటుంది. మొత్తానికి ఆమె ఇంటికి రావడంపై చాలా ఆనందంగా ఉంటుంది. తనను పిలుస్తుంది... పోట్లాడుతుంది... మాట్లాడుతుంది.. ఎన్నిసార్లు కలిసినా అచ్చం ఇది నా సౌర్య అని అనుకోదేమిటో... ఎన్ని క్లూలు ఇస్తున్నా పట్టించుకోదు. నేనే సౌర్య అని అన్నా పట్టించుకోలేదేమో అని అనుకుంటుంది. ఇంకా హిమ మారలేదా అని అనుకుంటుంది జ్వాల. హాయిగా జల్సాగా బతికేస్తుందేమో.. అని అనుకుంటుంది. ఇంతోల సడెన్‌గా నిరుపమ్‌ టాపిక్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్ సాబ్ ఏం చేస్తున్నావ్ అంటుంది. ఎప్పుడు కలుస్తావ్ అంటుంది. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే కలుద్దామని హిమకు ఫోన్ చేస్తుంది. 


పెళ్లి సంగతి తెలుసుకున్న నిరుపమ్‌ కోపంతో రగిలిపోతూ రోడ్డుకు అడ్డంగా నిలబడతాడు. కారును పోనీయకుండా నీతో పని ఉందని చెప్తాడు నిరుపమ్. ఆమెను బలవంతంగా కారు దింపి ఎవర్నో పెళ్లి చేసుకుంటున్నావట అని అడుగుతాడు. ఎవర్నో పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా అంటూ రగిలిపోతాడు. నీకి పెళ్లి అంటూ జరిగితే నాతోనే జరగాల్సి అంటాడు. దేవుడు మనిద్దరికి రాసి పెట్టాడని... ఏదో దాస్తున్నావని... ఇవాళే తెలియాలని గట్టిగా పట్టుకుంటాడు. ఇంతలో జ్వాల అక్కడకు వస్తుంది. ఆమె వచ్చిన విషయాన్ని హిమ గమనిస్తుంది. కానీ నిరుపమ్‌కు తెలియదు. అల్లరి చేయొద్దని బతిమలాడుతుంది హిమ. జ్వాల చూస్తుందని చెబుతుంది.  అయినా టాపిక్‌ను వదలకుండా మాట్లాడుతూనే ఉంటాడు నిరుపమ్. ఈ టాపిక్ వద్దనే చెబుతున్నా వినిపించుకోడు. టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ఆపరేషన్ అంటు హిమ కవర్ చేస్తుంది. నువ్వు చేయాల్సిన ఆపరేషన్ గురించి నేను మాట్లాడను... నేను చేయాల్సిన ఆపరేషన్ గురించి నువ్వు మాట్లాడకు అంటుంది హిమ. 
మాట దాటవేయొద్దని కచ్చితంగా నీ మనసులో ఏముందో నాకు తెలియాలి అంటాడు నిరుపమ్. నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తే ఊరుకోనంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో హలో హలో ఏంటింది.. ఎప్పుడూ లేని విధంగా అరుస్తున్నారంటూ అడుగుతుంది జ్వాల. ఈ గొడవేంటి.. ఆపరేషన్ ఏంటి... ఈ టైంలో ఏంటిదని ఆరా తీస్తుంది. జ్వాలా నేను వెళ్తున్నాను.. నేనేం మాట్లాడలేనని చెప్పి వెళ్లిపోతాడు నిరుపమ్. నాకు నచ్చిన పని చేయడం లేదని అందుకే వెళ్లిపోతున్నానని చెప్తాడు నిరుపమ్. జ్వాల కలుగుజేసుకొని... డాక్టర్ సాబ్‌కు నచ్చన పని ఎందుకు చేస్తున్నావ్‌.. ఆయనికి ఎదురెళ్తున్నావేంటని ఆయనకు నచ్చినట్టు చేయవచ్చు కదా అని సలహా ఇస్తుంది. నీకు ఏమీ తెలియదని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని అంటుంది హిమ. ఏంటీ ఇవాళ నా మాటకు ఎదురు చెబుతున్నావ్... డాక్టర్ సాబ్ ఏం చెప్పినా చాలా అలోచించి చెప్తారని.. ఆ మాట వినాలని హిమను రిక్వస్ట్ చేస్తుంది జ్వాల. ఇంతలో వెళ్లిపోతానన్న నిరుపమ్‌ తిరిగి వచ్చి అసలేం జరిగిందో నేను చెబుతానంటూ జ్వాలను తీసుకెళ్లబోతుంటాడు. హిమ కలుగజేసుకొని నిరుపమ్‌ను పంపించేస్తుంది. జ్వాలను కూడా అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. 


ఆనందరావు వద్దకు వచ్చిన సౌందర్య... విజయవాడ సంబంధం నిరుపమ్ తప్పించినట్టు చెబుతుంది. వాళ్లకు ఫోన్ చేసి సంబంధం క్యాన్సిల్ చేసుకోమని వార్నింగ్ ఇచ్చినట్టు వివరిస్తుంది. అక్కడే ఉన్న హిమ ఇదంతా వింటుంది. ఇంకా నిరుపమ్‌ నన్ను మర్చిపోలేదా అని అనుకుంటాడు. 
హిమపై నిరుపమ్‌కు ఉన్న ప్రేమను చూసి సంతోష పడాలో  బాధపడాలో తెలియడం లేదని అనుకుంటారు సౌందర్య, ఆనందరావు. అటు స్వప్న మాట వినదు... ఇటు హిమ తన మనసులో ఏముందో చెప్పదు.. కష్టాలన్నీ మన ఫ్యామిలీని వెంటాడుతున్నాయని అనుకుంటారు. స్వప్న ఎవరో ముక్కూమొహం తెలియన వ్యక్తితో నిరుపమ్ పెళ్లి చేస్తానంటూ రెడీ అవుతుందని.. ఇక్కడ హిమ ఏమో ఏమీ మాట్లాడుకుండా సైలెంట్‌గా ఉంటుందని అంటాడు ఆనందరావు. స్వప్న అనవసరంగా నిరుపమ్‌ జీవితాన్ని నాశనం చేస్తుందని అంటాడు. దీనికి అంతో ఇంతో మన ఇద్దరం కూడా కారణం అంటాడు. 
ఈ సమస్యలకు నేనే కారణమని ఏడుస్తుంది హిమ. జ్వాల నిరుపమ్‌ను ప్రేమిస్తుందని చెప్పలేకపోతున్నాను అనుకుంటుంది జ్వాల. 


హాస్పిటల్‌కు వచ్చిన హిమ.. అదే విషయాన్ని ఆలోచిస్తుంది. తనపై నిరుపమ్‌కు మరింత కోపం రావాలని.. ప్రేమ కరగాలని దాని కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఇంతలో తన క్యాబిన్‌లోకి వచ్చిన నిరుపమ్.. ఈ దాడుగు మూతలు ఇప్పటికైనా ఆపుతావా అంటాడు. నిశ్చితార్థం రోజును పెళ్లి ఇష్టం లేదన్నావని... బావ ఇష్టం లేదని చెప్పదని లాజిక్‌తో అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని... ఎందుకే భయపడుతున్నావని అది చెప్పాల్సిందేనంటాడు. అయినా హిమలో ఎలాంటి రియాక్షన్ ఉండదు. 


రేపటి భాగం
జ్వాలతో కలిసి అనాథశరణాలయానికి వస్తాడు నిరుపమ్. ఇంతలో వాళ్ల అమ్మ స్వప్న ఫోన్ చేసి.. ఎక్కడున్నావని అడుగుతుంది. అనాథాశ్రమం అని చెప్తాడు. నీతో ఎవరు ఉన్నారని నిలదీస్తుంది. ఆటోది కదా అంటుంది. అవును నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాన... ఆటో అంటే ఇష్టమని సమాధానం చెప్తాడు నిరుపమ్. ఆ సమాధానం విని ఒక్కసారి షాక్ అవుతుంది స్వప్న.