Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode స్వప్న రోడ్డు మీద తన తండ్రిని చూసి దగ్గరకు వెళ్లాలి అనుకుంటుంది. శ్రీధర్ కారులో ఉన్న కాంచనకు కొబ్బరి బొండాం ఇస్తాడు. స్వప్న చూసి పక్కన ఎవరో బిజినెస్ పార్టనర్ ఉన్నారు అనుకుంటుంది. వెళ్లి సర్‌ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటుంది. డాడీ డాడీ అని పిలుచుకుంటూ దగ్గరకు వెళ్తుంటుంది. ఇంతలో కాళ్లు బెనికి వెళ్లలేకపోతుంది. ఈలోపు శ్రీధర్ కారు వెళ్లిపోతుంది. 


స్వప్న: డాడీ పక్కన ఉన్న ఆ మనిషి ఎవరు. డాడీ ఆఫీస్‌లో బిజీగా ఉన్నారు అని అమ్మ చెప్పింది. మరి ఇక్కడ ఉన్నారేంటి. అదేంటో వెంటనే తెలుసుకోవాలి అని కాల్ చేస్తుంది.
దీప: కార్తీక్ హోటల్ దగ్గరకు రావడంతో మనసులో.. స్కూల్‌కి ఈయన అవసరం లేదు అని జ్యోత్స్న చెప్పింది మళ్లీ ఈయన వెళ్లారు అని జ్యోత్స్నకు తెలిస్తే ఏం అవుతుందో. ఇప్పుడు మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చారు. 
కార్తీక్: ఇప్పుడు దీప చూస్తే మళ్లీ తన కోసమే వచ్చాను అనుకుంటుందేమో. 
కడియం: దీపమ్మ బాబు గారు ఎందుకో బయటే తిరుగుతున్నారు అమ్మా. 
దీప: కార్తీక్ బాబు ఎందుకు వచ్చారు. మీరు వచ్చింది నా కోసం కాదా.
కార్తీక్: కాదు. 
దీప: మరి ఎవరి కోసం.
స్వప్న: సారీ బాస్ లేట్ అయింది.
కార్తీక్: అర్థమైందా దీప ఎవరి కోసం వెయిట్ చేస్తున్నానో.
దీప: హాయి స్వప్న ఇప్పుడు ఎలా ఉంది.
స్వప్న: ఓకే.. నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేశానో తెలుసా బాస్. ఘోరం జరిగిపోయింది బాస్. మా డాడీ మా మమ్మీని మోసం చేస్తున్నాడు. నేను లైవ్‌లో చూశాను. నేను రోడ్డులో వస్తుంటే డాడీని చూశాను. ఆ రోడ్డుకు ఆపోజిట్‌లో డాడీ కారులో ఉన్న ఓ ఆవిడకు కొబ్బరి బొండం ఇవ్వడం నేను చూశాను. డాడీ వర్క్ ఫినిష్ చేసి వస్తారు అనుకుంటే ఇలా చేస్తారు అనుకోలేదు. 
దీప: మనసులో.. మొత్తానికి మీరు మీ కూతురి కంట్లోనే పడ్డారు. ఇప్పుడు కాంచన గారి పరిస్థితి ఏంటో. 
కార్తీక్: ఆవిడ ఎవరో నీకు తెలుసా. 
స్వప్న: తెలీదు బాస్ ఫేస్ చూడలేదు. చేతులు మాత్రమే చూశా. 
కార్తీక్: డైరెక్ట్‌గా మీ డాడీకి కాల్ చేసి విషయం అడుగు. బయట పరిస్థితులు ఏం బాలేవు స్వప్న ఎవర్నీ నమ్మలేకపోతున్నాం. జాగ్రత్త పడకుండే మనమే పోతాం. నువ్వు మీ డాడీని మీ మమ్మీ ముందే నిలదీయు. 
స్వప్న: సరే బాస్ నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి మమ్మీతో చెప్తా. మమ్మీతో అడిగిస్తాను.
దీప: స్వప్న నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమైందా. మీరు నన్ను కూడా కారులో తీసుకెళ్లారు కదా బాబు. అది చూసిన వాళ్లు స్వప్నలానే అనుకుంటే మీరు ఊరుకుంటారా. ఆవిడ వాళ్ల నాన్న గారికి తెలిసిన మనిషి అయిండొచ్చు కదా. నిజం తెలుసుకోకుండా తొందర పడితే అది మంచిది కాదు బాబు. 
కార్తీక్: ఇలా మాట్లాడుతావ్ ఏంటి దీప.
స్వప్న: నేను చూసింది నిజం బాస్. కానీ దీప చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. అమ్మకి చెప్తే డిస్ట్రబ్ అవుతుంది. అందుకు నేనే ఏంటా అని ఆలోచిస్తా. బాయ్ బాస్.. బాయ్ దీప.
కార్తీక్: నీలా ఇంకెవరూ బాధ పడకూడదు దీప. నీ కష్టం కళ్లారా చూశాను. నాకు ఓ అమ్మ ఉంది కదా. మా అమ్మ  అయితే ఏంటి. శౌర్య అమ్మ అయితే ఏంటి. స్వప్న అమ్మ అయితే ఏంటి. ఏ అమ్మకి ఇలాంటి పరిస్థితి రాకూడదు దీప. ఉంటాను.
దీప: అన్యాయం జరుగుతుంది మీ అమ్మకే బాబు. 


దీప పాపకు లంచ్ బాక్స్ తీసుకుంటుంది. ఇంతలో ఫ్యూన్ ఎదురై దీపని ప్రిన్సిపల్ గారి దగ్గరకు వెళ్లమంటారు. ఎందుకు అని దీప అడిగితే పాప తండ్రి వచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్నాడని చెప్తాడు. దీప షాక్ అవుతుంది. హడావుడిగా పరుగులు తీస్తుంది. నర్శింహ శౌర్యని కలవకూడదు అని అనుకుంటుంది. ఇంతలో దీపకు నర్శింహ క్లాప్స్ కొట్టి పిలుస్తాడు. దీప షాక్ అవుతుంది. 


నర్శింహ: ఏంటి దీప పాప వాళ్ల నాన్న వచ్చాడు అంటే అంత ఆత్రంగా పరుగు పెట్టావ్ ఏంటి కార్తీక్ వచ్చాడు అనుకున్నావా. అటెండర్‌తో నేనే అలా చెప్పమన్నా. నేను వచ్చింది నిన్ను కలవడానికే.
దీప: ముందు నువ్వు నా కోసం ఎందుకు వచ్చావో చెప్పు.
నర్శింహ: దేవుడి గట్టిగా పగ పట్టాడు. అసలు నీ జోలికి వెళ్లకూడదు అనుకున్న ప్రతీ సారి పగతోనే అవసరంతోనో నీ దగ్గరకు వస్తున్నా. ఈ సారి అవసరంతో వచ్చాను. శోభ గర్భవతి అని త్వరలో మనవడు రాబోతున్నాడు అని నిన్న మా అమ్మ వీరంగం చేసింది కదా. మా అమ్మ ఓవర్ యాక్షన్‌కి అంతా రివర్స్ అయింది. శోభ ప్రెగ్నెంట్ కాదు. దాని గర్భ సంచిలో ఏదో ప్రాబ్లమే అంట. ఇక జీవితంలో దానికి పిల్లలు పుట్టరంట. అది తిండి నిద్ర మానేసి తల బాదుకొని ఏడుస్తుంటే మా అమ్మ అద్భుతమైనా సలహా ఇచ్చింది. పిల్లలు లేనిది దానికి నీకు కాదురా. దానికి పుట్టరనుకో కానీ నాకు కూతురు పుట్టింది కదా. నా కూతురు నీ దగ్గర ఉంటే అది శోభకి కూడా కూతురు అవుతుంది కదా అందుకే నా కూతురిని నాకు ఇచ్చేయ్ దీప. నువ్వు ఇస్తావా నన్ను తసుకోమంటావా.
దీప: నీకు ప్రాణాల మీద తీపి లేకపోతే నా కూతురి జోలికి రా.
నర్శింహ: ఏం లేదు దీప శౌర్య నాకు పుట్టిన కూతురు అయితే నాకు ఇచ్చేయ్. నాకు పుట్టలేదు అంటావా అది నాకు వద్దు. ఇదిగో దాని గురించి మన మధ్య గొడవలు కొట్లాటలు వద్దు. పాపని నాకు ఇచ్చేస్తే నా ముఖం మళ్లీ నీకు చూపించను. నువ్వు ఎలా ఇష్టం వస్తే అలా బతకొచ్చు. బలవంతం ఏం లేదు దీప పాప నాకు పుట్టిన కూతురు అయితేనే నాకు ఇవ్వు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సత్య కోసం బుక్స్ తెచ్చి అడ్డంగా బుక్ అయిపోయిన క్రిష్.. తండ్రిని చంపడమే తన టార్గెట్ అంటోన్న రుద్ర!