Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శోభని నర్శింహ, అనసూయ హాస్పిటల్‌కి తీసుకొస్తారు. దీప ఎదురు పడటంతో అనసూయ వెటకారంగా దీపతో శోభ తల్లి అయిందని చెప్తుంది. తాను నానమ్మ కాబోతున్నాను అని ఇంకో తొమ్మిది నెలల్లో తన కొడుకుకి అసలైన వారసుడు రాబోతున్నాడని అంటుంది. శోభకు పుట్టబోయే బిడ్డకు మాత్రమే తన కొడుకుని తండ్రి అని చెప్పుకునే హక్కు ఉందని.. అయినా నీకు నా కొడుకుతో పని ఏముందిలే నీ కూతురికి తండ్రిగా ఎవరైనా సంతకం చేస్తారు అని అంటుంది. దానికి దీప అత్తయ్య అని పెద్దగా అరుస్తుంది. తన జోలికి తన కూతురి జోలికి రావొద్దని అంటుంది. ఇక దీప, నర్శింహలు గొడవ పెట్టుకోబోతే అనసూయ ఆపేస్తుంది. దీపని పొమ్మంటుంది. శోభకి మాతృత్వం ప్రకృతి ఇచ్చిన వరం అని జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక శోభని తీసుకొని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుంది. 


మరోవైపు జ్యోత్స్న తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. స్కూల్‌ దగ్గరకు కార్తీక్‌ వచ్చి ఏం చేసినా తను చెప్తాను అని హోటల్ దగ్గరకు వెళ్తే ఎవరు చెప్తారు అని జ్యోత్స్నని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. కార్తీక్ విషయంలో జాగ్రత్తగా ఉండమని జ్యోత్స్నకి చెప్తుంది. దీంతో జ్యోత్స్న ఆలోచనలో పడుతూ హోటల్ దగ్గరకు వెళ్తుంది. దీప అనసూయ మాటలు తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. తల్లి లాంటి అత్త కూడా తనని నిందిస్తుందని అనుకుంటుంది. 


దీప: ఏం కావాలి జ్యోత్స్న.
జ్యోత్స్న: ఓ ప్రశ్నకు సమాధానం కావాలి. శౌర్యని మా బావకి ఎందుకు దగ్గర చేస్తున్నావ్. నీకు చెప్పకుండా శౌర్య ఏ పని చేయదు. నువ్వు చేయనివ్వవు కూడా. అలాంటి శౌర్య మా బావకి దగ్గర అవుతుందా. అది సరే ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పు. పేరెంట్స్ మీటింగ్ నేనే వెళ్తాను అని నాతో గంట కొట్టినట్లు చెప్పావు కదా. మరి అక్కడికి మా బావ ఎలా వచ్చాడు. నేను విన్న నిజాల వెనక ఎన్ని అబద్ధాలు ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. సరే ఈ విషయం కూడా పక్కన పెట్టు ఇంకో ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు. మా బావే నాకు కాబోయే భర్త అని నీకు తెలుసు కదా. ఇప్పుడు సడెన్‌గా మీరు ఇద్దరు పేరెంట్స్ మీటింగ్‌లో ఉండగా బయట నుంచి ఎవరైనా వచ్చి చూసి శౌర్యకి మీరే తల్లిదండ్రులు అనుకుంటారు కదా.. 
దీప: జ్యోత్స్న.. 
జ్యోత్స్న: ఎందుకు దీప కోపం. ఎవరికో అనిపించేది నీకు ఎందుకు అనిపించలేదు అని ఆలోచించు. అలా అనిపించింది అంటే ఆ మనిషికి కాబోయే భార్యని నాకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు.  
దీప: జ్యోత్స్న నువ్వు అడిగితే సమాధానం చెప్పుకోలేని స్థితిలో నేను లేను.
జ్యోత్స్న: నాకు తెలుసు దీప నీ గురించి అందుకే ఆ విషయం కూడా పక్కన పెట్టి నిన్ను ఇంకో ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు. మా బావ నీకు రోజూ ఫోన్ చేస్తుంటాడా. చెప్పు దీప.. ఏ టైంలో చేస్తుంటాడు.
దీప: జ్యోత్స్న నేను నీకు ఇచ్చే మర్యాదకు కూడా ఓ హద్దు అంటుంది. అది దాటొద్దు.
జ్యోత్స్న: హద్దులు నువ్వు దాటితే స్వతంత్రం నేను దాటితే తిరుగుబాటా. 
దీప: చిన్నప్పటి నుంచి మీ బావని చూస్తున్నదానివి నమ్మకం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నావా. నాకు ఫోన్ ఇచ్చింది కార్తీక్ బాబే. కానీ నేను ఊరికే తీసుకోలేదు. డబ్బులు ఇస్తాను అని అన్నాను.
జ్యోత్స్న: సరే దీప ఈ విషయం కూడా పక్కన పెట్టు ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పు.
దీప: నువ్వు దయచేసి వెళ్లిపో జ్యోత్స్న.
జ్యోత్స్న: నా దగ్గర ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి దీప. శౌర్య స్కూల్ ఫీజు నువ్వు కట్టలేనంత. అయినా శౌర్య పెద్ద స్కూల్‌లో చదువుకుంటుంది ఎలా. ఆటో ఛార్జీలకు నీ దగ్గర డబ్బులు ఉండవు అంటున్నావు కానీ నువ్వు ఫోన్ కొన్నావు ఎలా.. మా బావ నీకు ఫోన్ చేయడు అంటావు. శౌర్యతో నువ్వు చేయనివ్వవు అంటావు. మరి మీరు భలే కలుసుకుంటారు. కారులో తిరుగుతుంటారు ఎలా. నువ్వు ఉన్నది మా ఇంట్లో కానీ నీ విషయాలు మా కంటే ముందే మా బావకి తెలుస్తాయి. కానీ నువ్వు చెప్పవు ఎలా..


ఇంతలో కడియం రావడంతో జ్యోత్స్న వెళ్లిపోతుంది. దీప మనసులో ముందు కార్తీక్‌కు, జ్యోత్స్నకు పెళ్లి జరగాలి అని తర్వాత తను అందరికీ దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటుంది. మరోవైపు శోభ రిపోర్ట్స్‌ చూసి శోభ ప్రెగ్నెంట్ కాదు అని చెప్తుంది. శోభతో పాటు అనసూయ, నర్శింహ షాక్ అయిపోతారు. శోభకు ఫుడ్ పాయిజిన్ అయిందని చెప్తుంది. అంతే కాదు అని శోభకు పుట్టుకతోనే గర్భసంచి బాలేదు అని జీవితంతో శోభకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్తుంది. ఇక శోభ, అనసూయలు ఏడుస్తారు. ఇంతలో నర్శింహకు పోలీస్‌ కాల్ చేసి రమ్మని చెప్తాడు. మరోవైపు కార్తీక్ శౌర్య, జ్యోత్స్నల మాటలు తలచుకొని ఆలోచిస్తుంటాడు. శౌర్యకి బాగా దగ్గర అయిపోయాను అనుకుంటాడు. నర్శింహని పోలీసులు తీసుకెళ్లడం చూసి ఏమైందని కంగారుగా దీపని అడగాలి అని వెళ్తాడు. నర్శింహ వచ్చాడా ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. దానికి దీప కోపంగా నర్శింహ వస్తే మీకేంటి వాడి మీద కోపంగా ఉంటే మీకేంటి ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: మగాడిలా మాట్లాడి బెంబేలెత్తించిన తిలోత్తమ.. దిష్టి తీయడంతో బయటపడ్డ అసలు రంగు!