Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప అంటే నీకు ఇష్టమని అందుకే ముందే పరిచయం ఉన్నా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అని తన భర్త ఇబ్బంది పెడుతుంటే తనకి కూడా తెలీకుండా జైలులో పెట్టావని కార్తీక్‌ని పారిజాతం నిలదీస్తుంది. కార్తీక్ పారు మీద సీరియస్ అవుతుంటే తనకు మొత్తం తెలుసని ఈ దబాయింపు ఏంటి అని అడుగుతుంది.  


కార్తీక్: నువ్వు లేని పోని ఆలోచనలు మనసులో పెట్టుకొని దీపని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి అని చూస్తున్నావ్. ఈ రోజు పాయసంలో  మందు కలిపినట్లు ఆ రోజు దీప బ్యాగ్‌లో నువ్వే నెక్లెస్ పెట్టించావ్. మరీ ఆలోచిస్తుంటే జ్యోత్స్న మనసుని చెడగొట్టింది కూడా నువ్వే.
పారిజాతం: దాని మనసుని చెడగొట్టింది నేను కాదురా నువ్వు. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఏం జరిగినా సరే నా మనవడికి మనవరాలికి పెళ్లి జరగాలి అనుకున్నాను. మీ ఇద్దరి జీవితాలు కాపాడాలి అనుకున్నాను. 
కార్తీక్: ఈ పెళ్లి జరిగితే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. నా మరదలి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు.
పారిజాతం: నా మనవడి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. 
కార్తీక్: నువ్వు ఇలాగే చేస్తే జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అందరికీ చెప్పేస్తా.
పారిజాతం: నువ్వు అలా చెప్తే ఎవర్ని మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావో నేను అది అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఎంత మొండి వాడివో నేను అంత మొండిదాన్ని. సుమిత్ర కూతురికి, కాంచన కొడుకుకి పెళ్లి జరుగుతుంది. ఇది ఆ దేవుడు రాసిన రాత గుర్తుపెట్టుకో.


దీప హోటల్‌ దగ్గర అనసూయ ఆగి కడుపునిండా తినేసి వెళ్తాను అని దీప చేసిన పనికి శోభ తినడం లేదు ఎవరికీ తిండి పెట్టడం లేదు అని ఆకలితో ఉండటం నా వల్ల కాదు అనుకొని లోపలికి వస్తుంది. కడియం ఏం కావాలని అడుగుతాడు. ఇక ఉప్మా తీసుకొని వచ్చి ఇస్తాడు. అనసూయ తిని అది దీప చేసిన ఉప్మాలా ఉంది అనుకుంటుంది. కడియాన్ని ఎవరు చేశారు అని అడిగితే దీపని చూపిస్తాడు. దీప దగ్గరకు రావడంతో అనసూయ భయంతో వెళ్లిపోతుంటే దీప ఆపి టిఫిన్ చేయమని అంటుంది. మనుషుల్ని వదిలేసిని టేస్ట్ గుర్తు పట్టి పేరు పలికారు. దీన్నే అప్యాయత, బంధాలు అంటారని అవి మీరు వదిలేసినా నేను ఇంకా పట్టుకొని తిరుగుతున్నానని అత్తకు చురకలు వేస్తుంది. ఇకపై మీరు ప్రశాంతంగా ఉండండి.. నన్ను కూడా ప్రశాంతంగా ఉంచండి అని చెప్తుంది. 


జ్యోత్స్న: బావ నీకు ఏం చెప్పాడు. నువ్వు చెప్తావా నేనే అడిగి తెలుసుకోవాలా. నేను అంటే ఇష్టం లేదా అని నేను గట్టిగా నిలదీస్తే బావ నాతో ఏదో చెప్పాలి అనుకున్నాడు. సరిగ్గా టైంకి వచ్చి నన్ను పంపేశావ్.
పారిజాతం: చెప్పాడే పెళ్లి ఇప్పుడే వద్దు రెస్టారెంట్ ఓపెనింగ్ తర్వాత చేసుకుంటా అన్నాడు. 
జ్యోత్స్న: నువ్వు అబద్ధం చెప్తున్నావ్ గ్రానీ. లేదంటే బావ ప్రమాణం చేసినప్పుడు ఎందుకు అంత ఆలోచిస్తాడు. కనీసం నవ్వలేదు కూడా. 
పారిజాతం: ఒక్కటి మాత్రం నిజం వాడికి నువ్వంటే ఇష్టం. నీ అనుమానం ఏంటి తర్వాత మాట మార్చుతాడు అనే భయం కదా. అలా మార్చితే మీ అమ్మ ఊరుకుంటుందా.. మీ అత్త ఊరుకుంటుందా. లేక నేను ఊరుకుంటానా. పారిజాతం ఏం చేసిన మనవరాలి పెళ్లి కోసమేనే. ఇదే నా జీవిత లక్ష్యం. ఎందుకు అంటే ఈ ఇంట్లో నీది నాది ఓ ప్రత్యేకమైన బంధం. నువ్వు నా సొంతం. 
జ్యోత్స్న: ఈ పెళ్లి నాకు కూడా జీవిత లక్ష్యమే. దీప రావడానికి కంటే ముందు ఉన్న బావ వేరు. దీప వచ్చిన తర్వాత బావ వేరు. నర్శింహ ఇంటికి రాక ముందు నాకు బావ మీద అనుమానం ఓ మొక్కలా ఉండేది. దానికి నీళ్లు పోసి పోసి నువ్వే దానిని చెట్టుని చేశావ్. ఇప్పటి వరకు నేను బాలేను ఇకపై బాగుంటాను. ఈ రోజు నాకు ఓ క్లారిటీ వచ్చింది. ఏం జరిగినా బావే నా మొగుడు.. ఏ చేయి నా చేతిలో వేయడానికి ఇబ్బంది పడ్డాడో అదే చేతితో నా మెడలో తాళి కట్టించుకుంటా. 


కార్తీక్ జరిగిదంతా తలచుకొని నన్ను చీట్‌ చేశావ్ అని పారిజాతం మీద కోపంతో ఆవేశంగా కారు డ్రైవ్ చేస్తాడు. ఎదురుగా ఓ అమ్మాయి(స్వప్న) స్యూటీ మీద వెళ్తూ ఓ అబ్బాయిని ఢీ కొట్టేస్తుంది. ఇక ఆ వ్యక్తి రెండు వేలు ఇవ్వమని స్వప్నని ఇబ్బంది పెడతాడు. దీంతో కార్తీక్ డబ్బులు ఇస్తాడు. ఇక స్వప్నని దగ్గరుండి కార్తీక్ హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. స్వప్న కార్తీక్‌ని పొగిడేస్తుంది. ఇక కార్తీక్ స్వప్నతో ఇంటికి ఫోన్ చేసి జరిగింది మీ డాడీతో చెప్పు హాస్పిటల్‌కి రమ్మని చెప్తాడు. తన తండ్రి చాలా బిజీ అని తనకే అప్పుడప్పుడు కనిపిస్తారు అని చెప్తుంది. తన తల్లికి ఫోన్ చేస్తా అంటుంది. ఇక ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్తారు. మరోవైపు దీప ఇంటికి వస్తుంది. దీప ఫోన్ నుంచి కార్తీక్‌కి శౌర్య కాల్ చేస్తుంది. ఇక శౌర్య ఫోన్‌లో మాట్లాడటం జ్యోత్స్న చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తకి వీడియో చూపించి చెమటలు పట్టించేసిన సీత.. జీవితంలో తనకి కాల్ చేయొద్దని మహాకి చెప్పేసిన మధు!