Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : తాను చెప్పిన నిజం పారిజాతం మాటలన్ని తలచుకొని దీప బాధ పడుతుంది. అసలు తాను పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఉండుంటే బాగున్ను అనుకుంటూ ఏడుస్తుంది. దీప కన్నీళ్లు తన ఒడిలో పడుకొని ఉన్న సౌర్య మీద పడటంతో సౌర్య లేచి అమ్మా ఏడుస్తున్నావా అని అడుగుతుంది. దీంతో దీప కవర్ చేస్తుంది.


ఉదయం బంటు హడావుడిగా పరుగున వచ్చి అందర్ని పిలుస్తాడు. ఘోరం జరిగిపోయిందని టీవీ ఆన్ చేసి చూడమని అంటాడు. పారిజాతం టీవీ ఆన్ చేస్తుంది. అందులో జ్యోత్స్న యాక్సిడెంట్ చేయడం వల్ల తన మిస్ హైదరాబాద్ కిరీటం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటిస్తారు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం ఇది తన మనవరాలికి తెలీకూడదు అని గట్టిగా అరుస్తుంది. వెనకే ఉన్న జ్యోత్స్న నో అంటూ గట్టిగా అరుస్తుంది. కోపంతో ఫ్లవర్‌వాజ్ విసిరేస్తుంది. ఎవరు ఎంత పిలిచినా వినకుండా ఏడుస్తూ వెళ్లిపోతుంది. సుమతి ఒప్పించడానికి జ్యోత్స్న గదికి వెళ్తుంది.


జ్యోత్స్న: దీప చెప్పకపోయి ఉంటే అసలు ప్రాబ్లమే వచ్చి ఉండేది కాదు కదా మమ్మీ. 


సుమిత్ర: నిజం చెప్పడం తప్పు ఎలా అవుతుంది.


జ్యోత్స్న: ప్లీజ్ లీవ్ ఇట్ మమ్మీ. ఇంతకు ముందు మనకు దీని మీద ఆర్గ్యూ జరిగింది. మీరు దీపకే సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా క్రౌన్ పోయింది. 


సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ దగ్గర తన పరువు పోయిందని.. అందరూ ప్రశ్నిస్తున్నారు అని నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు అని జ్యోత్స్న తన తల్లికి చెప్పుకొని ఏడుస్తుంది. ఇక పారిజాతం మాటలు తలచుకొని దీనంతటికి కారణం దీప అని రగిలిపోతుంది. ఒక్క సాక్ష్యం తన జీవితాన్ని మార్చేసిందని అనుకుంటుంది.


మరోవైపు దీప తన కూతురికి టిఫిన్ తినిపిస్తుంటుంది. ఇంతలో పారిజాతం వచ్చి కోప్పడుతుంది. నీ కారణంగా నా మనవరాలికి అన్యాయం జరిగిందని అంటుంది. ఏం జరిగిందని దీప అడుగుతుంది.


పారిజాతం: నా మనవరాలు మిస్ హైదరాబాద్. అయినా నీకు ఇవన్నీ ఎలా అర్థమై చస్తాయిలే. నా మనవరాలు అందాల పోటీలో ఫస్ట్ వచ్చి కిరీటం దక్కించుకుంది. అది పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందని కిరీటం వెనక్కి తీసుకున్నామని ఇప్పుడే చెప్పారు. ఏ టీవీలో దాని గురించి గొప్పగా చెప్తే పొంగిపోయామో ఇప్పుడు అదే టీవీలో దాని పరువు పోతుంటే గుండెలు బాదుకుంటున్నాం. మాకే ఇలా ఉంటే ఇంక దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు.


 నా మనవరాలి పరువు తీసిన మనిషి నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ దీప బ్యాగ్ విసిరేస్తుంది. తర్వాత పారిజాతం దీపని తోసేస్తుంది. దీంతో సుమిత్ర వచ్చి దీపని పట్టుకుంటుంది.


పారిజాతం: సుమిత్రా నువ్వు అడ్డురాకు. ఇది నా మనవరాలిని తలెత్తుకోకుండా చేసింది. ఈ దరిద్రాన్ని బయటకు పంపేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పోయిన నీ కూతురు పరువు చాలదా.. ఇది ఇక్కడే ఉంటే దాని ప్రాణాలు కూడా పోతాయి.


సుమత్రి: అత్తయ్య మీరు ఇంక మాట్లాడటం ఆపుతారా..


పారిజాతం: ముందు దీన్ని బయటకు గెంటేయ్. ఆ తర్వాత నువ్వేం చెప్పినా వింటాను.


సుమిత్ర: దీప ఎక్కడికీ వెళ్లదు.


పారిజాతం: ఇంత చేసినా దీన్ని ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేమైనా నీ కూతురా..


సుమిత్ర: అవును దీప నా కూతురు. తప్పు చేసింది జ్యోత్స్న. దాని అర్థం లేని ఆవేశమే దాని పరువు తీసింది. ఒక తల్లిగా నేను కూడా అందుకు బాధపడుతున్నాను. కానీ మన అదృష్టం బాగుండి యాక్సిడెంట్ జరిగిన వాళ్లకి ఏం కాలేదు. ఇంకా ఈ విషయంలో దీపని ఏమైనా అంటే నేను ఊరుకోను. మామయ్య మిమల్ని పిలుస్తున్నారు వెళ్లండి. 


పారిజాతం: కూతురు కూతురు అని నెత్తిన పట్టుకుంటున్నావ్ కదా ఇది అదృష్టం కాదు అరిష్టం అని తెలిసే రోజు తొందర్లోనే వస్తుంది చూడు. ఛీ..


సుమిత్ర: అత్తయ్య మాటలు నువ్వు పట్టించుకోకు దీప.


దీప: ఇదంతా నా వల్లే జరిగింది కదా నేను ఒకసారి జ్యోత్స్నని కలిసి వస్తానమ్మా.


సుమిత్ర: వద్దు దీప అది గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. తర్వాత మాట్లాడుదువుగానీ.. అత్తయ్య అక్కడ ఏం చెప్తుందో ఏంటో నేను అక్కడికి వెళ్తాను. చూడు నువ్వు అయితే ఎక్కడికి వెళ్లడం లేదు గుర్తుపెట్టుకో. 


దీప: మనసులో.. రాత్రే అనుకున్నాను ఇది ఇక్కడితో ఆగిపోయింది పర్వాలేదులే అని ఇంత జరిగిన తర్వాత జ్యోత్స్న నా ముఖం కూడా చూడదు. నేనేం చేయాలి. ఉండాలా వెళ్లిపోవాలా.


పారిజాతం బయటకు వస్తే బంటు ఏమైందని అడుగుతాడు. ఎంత ప్రయత్నించినా దీప వెళ్లడం లేదు అని చివరకు బ్యాగ్ కూడా విసిరేశాను అని చెప్తుంది. దీంతో బంటు తన ఐడియా ఫాలో అవ్వమని చెప్పి దీపకు డబ్బు ఇమ్మంటాడు. తను తీసుకోదు అని పారిజాతం అంటే సుమిత్ర ఇచ్చిందని చెప్పమంటాడు. దీప నమ్మేలా చెప్పాలని బంటు అంటాడు. 


దీప: ఈసారి ఏం విసిరేయడానికి వచ్చారు.


పారిజాతం: నిన్ను.. అదే నిన్ను ఒకసారి చూద్దాం అని వచ్చాను దీప.


దీప: మీరు అన్న మాటలకు ఎలా ఏడుస్తున్నాను అని చూడటానికి వచ్చారా. 


పారిజాతం: నువ్వు అంత తేలికగా ఏడ్చే ముఖం కాదులే.. నువ్వు ఇంత లౌక్యం తెలిసిన మనిషివి అని వాళ్లు నన్ను పంపించారు.


దీప: దేనికి..


పారిజాతం: ఇది నీకు ఇవ్వడానికి..అని డబ్బు కట్ట చూపించి దీప బ్యాగ్ మీద వేస్తుంది. నువ్వు సుమిత్ర ప్రాణాలు కాపాడిన దానికి చిన్న బహుమతి.


దీప: నాకు ఏ బహుమతి అవసరం లేదు. మీరే తీసుకెళ్లండి.


పారిజాతం: సరిపోలేదా.. చూడు దీప నీకున్న అనుభవానికి నీకున్న జ్ఞానానికి నీకు కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థమైపోవాలి. 


దీప: పోనీ మీరు చెప్పండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. 


పారిజాతం: నీరాజనాలు అందుకోవడానికి నువ్వు ఇంకా ఈ ఇంటి దేవతవి కాదు. నా మనవరాలి పరువు తీసిన దానివి. ఇప్పుడు నా మనవరాలు ఇంక నీ ముఖం కూడా చూడదు. నిన్ను ఇష్టంలా తీసుకొచ్చిన వాళ్లే ఇంతలా ద్వేషిస్తుంటే వాళ్ల ముందు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.. నేను ఇప్పుడు మా జ్యోత్స్న దగ్గర నుంచే వస్తున్నా. దీప ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని ఇంట్లో అందరికీ చెప్పింది. వాళ్లేమో కూతురి మాట కాదు అనలేరు. నీకు చెప్పలేరు. అందుకే నన్ను పంపారు. లేదు సుమిత్ర వచ్చి చెప్తే గానీ వెళ్లను అంటావ్. నీ మీద ఉన్న అభిమానంతో నిన్ను పొమ్మనలేదు. నీ వల్ల ఇప్పుడు సుమిత్ర కూడా బాధపడుతుంది. తల్లిలేని దానివి కదా ఆ బాధ ఏంటో తెలియకపోవచ్చు కదా.. నీకు తల్లి లేకపోతే ఏంటి నువ్వు ఓ బిడ్డకు తల్లివి కదా ఆ బాధ అర్థం చేసుకోగలవు. ఇప్పటి వరకు జరిగింది చాలు. నీకు మా సుమిత్ర మీద అభిమానం ఉంటే ఆ డబ్బు తీసుకొని వెళ్లిపో. ఇంకెప్పుడూ ఈ ఛాయలకు కూడా రాకు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ : తిలోత్తమ గుండెల మీద గుర్రం కాలితో తన్నిన విశాలాక్షి.. పున్నమి వెన్నెల్లో గాయత్రీ దేవి ఛాయ కనిపిస్తుందా..!