Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న, కార్తీక్‌ల పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మారదని, కాంచన కొడుకుతోనే సుమిత్ర కూతురి పెళ్లి అని శివనారాయణ చెప్తాడు. మరోవైపు కార్తీక్‌ దీపను తీసుకొని ఇంటికి వస్తాడు. అది చూసిన పారు రగిలిపోతుంది. ఇక కార్తీక్ ఇంట్లోకి రావడంతో పెళ్లి ఎప్పుడు చేయాలా అని మాట్లాడుకుంటున్నాం అని శివనారాయణ అంటాడు.


సుమిత్ర: నువ్వు ఇలా ఉన్నావు కానీ మీ అమ్మ అయితే పెళ్లికి తెగ తొందర పెడుతుందిరా. ఇక వచ్చే ముహూర్తాల్లో పెళ్లి చేయాల్సిందే.


పారు: దీప దగ్గరకు వచ్చి.. నువ్వేమైనా కారు ఓనర్ అనుకుంటున్నావా. నా మనవడు ఏమైనా డ్రైవర్ అనుకుంటున్నావా.. నీలాంటి దానికి కారు ఎక్కించడమే ఎక్కువ అనుకుంటే మేడంగారు డోర్ తీస్తే కానీ దిగరేమో. 
దీప: ఇంతకు ముందు కూడా మీరు ఇలా అర్థం చేసుకోకుండా మాట్లాడారు. డోర్ రాకపోతే ఆయన తీశారు.
పారిజాతం: అసలు నా మనవడి కారు నువ్వు ఎందుకు ఎక్కావ్. వస్తుంటే దారిలో కనిపించి ఉంటావ్ వాడు కారు ఎక్కమని చెప్పి ఉంటాడు. ఎక్కడానికి నీకు సిగ్గు ఉండాలి కదా. 
దీప: మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెళ్లి ఆ మనిషినే అడగండి. 
పారిజాతం: అయినా తప్పు నా మనవడిదే కుక్కను సింహాసనం మీద కూర్చొమన్నంత మాత్రానా బుద్ధి ఎక్కడకు పోతుంది. 
దీప: నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు తిప్పకండిగ. నేను చేయి తీప్పాల్సి వస్తుంది. నేను తప్పు చేసే మనిషిని కాదు అని మీకు అర్థం కావాలి అని ఆ మాట అన్నారు. నాకు హద్దులు తెలుసమ్మ. వాటిని నేను దాటను. ఎవరైనా దాటి లోపలికి వస్తే అప్పుడు మాటలు కాదు చేతులు సమాధానం చెప్తాయి. దీంతో పారు దీనితో తన్నులు తినడం కంటే వెళ్లిపోతే మంచిది అని వెళ్లిపోతుంది. 
దీప: మనసులో.. నేను వదిలేసిన విషయాలు ఈయన జ్యోక్యం చేసుకొని దాన్ని గొడవ చేశాడు. ఇప్పుడు ఆ మనిషికి నిజం తెలిసింది. ఇది ఇక్కడితో ఆగుతుందా..


మరోవైపు కార్తీక్ సౌర్యకు పెద్ద లాలీపాప్ తీసుకొని వచ్చి ఇస్తాడు. సౌర్యను చూసి నర్శింహతో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటాడు. సౌర్యకు తన ఫ్యామిలీ విషయాలు అడుగుతాడు. దీంతో సౌర్య తన తండ్రిని వెతుకుతున్నామని చెప్తుంది. దీంతో సౌర్య తన తండ్రి ఎలా ఉంటాడో కూడా తనకు తెలీదు అని ఒక్కసారి కూడా చూడలేదు అని చెప్తుంది. తన తండ్రిని వెతకడానికే వచ్చామని చెప్తుంది. సౌర్యకు కనీసం తన తండ్రి పేరు కూడా తెలియపోవడంతో కార్తీక్ వాళ్ల పరిస్థితికి చాలా బాధ పడతాడు. 


కార్తీక్: మనసులో.. ఏంటిది పుట్టినప్పటి నుంచి పాపం తండ్రి చూడలేదా.. పేరు కూడా తెలీదా.. అసలు వాడు వీళ్ల జీవితాన్ని ఏం చేశాడు.
సౌర్య: కార్తీక్ మనం ఫ్రెండ్స్ కదా నాకు ఓ సాయం చేస్తావా.. నేను మా అమ్మ ఎంత వెతికినా మాకు నాన్న దొరకడం లేదు. నువ్వు మా నాన్నని వెతుకుతావా ప్లీజ్. నాన్నతోనే ఉండిపోవాలి. చెప్పు కార్తీక్ వెతుకుతావా.  
కార్తీక్: వెతుకుతాను.. 
సౌర్య: నువ్వు చాలా మంచి వాడివి కార్తీక్. మా నాన్న కూడా నీలాగే ఉంటాడా. చెప్పు కార్తీక్..
దీప: సౌర్య.. పద..
కార్తీక్: నా వల్ల నీ జీవితానికి కొంతే అన్యాయం జరిగింది అనుకున్నా దీప కానీ ఇప్పుడు అర్థమైంది పూర్తి నాశనం అయిందని. నాన్న ఇలా ఉంటాడు అని పాప మనసులో చాలా మంచిగా ఊహించుకుంది కానీ వాడు అలా లేడు. అసలేం జరిగింది దీప కూతురికి తండ్రి పేరు కూడా చెప్పుకునే స్థితిలో నువ్వు లేవు. నిజంగానే నువ్వు భర్తని వెతుక్కొని వస్తే వాడు నిన్ను ఎందుకు భయపెడుతున్నాడు. ఎందుకు బెదిరిస్తున్నాడు. ఎవర్ని అడగాలి. 


దీప సౌర్యని  ఇంటికి తీసుకొని వచ్చి కార్తీక్‌తో మాట్లాడిన మాటలకు తిడుతుంది. దీంతో సౌర్య అయితే నాన్న ఎలా ఉంటాడో చెప్పు అని అడుగుతుంది. దానికి దీప నీలాగే మీ నాన్న ఉంటాడు కదా అంటుంది. దానికి కార్తీక్‌ కూడా నాలాగే ఉన్నాడని అంటుంది. దీంతో అలా అనకూడదు అని దీప కూతురుకి చెప్తుంది. అమ్మ నీలా ఉంటే నాన్న ఎలా ఉంటాడు అని అడుగుతుంది. ఊరిలో ప్రేమగా చూపించుకున్నదానివి అని ఇప్పుడు ఎందుకు ప్రతీ దానికి తిడుతున్నావని అంటుంది. సౌర్య అలిగిపోతుంది. ఇక దీప పరిస్థితులు చూసి ఊరు వెళ్లిపోవడమే మంచిది అని అనుకుంటుంది. 


ఇక దీప సుమిత్ర దగ్గరకు రావడంతో ముత్యాలమ్మ గూడ అన్నపూర్ణాదేవి అని సుమిత్ర అంటుంది. ఇక సుమిత్ర దీపతో రేపు జ్యోత్స్న పుట్టినరోజు అని వంటలు చేయమని అడుగుతారు. దీప సరే అంటుంది. ఇక జ్యోత్స్న తన బావని తీసుకొని షాపింగ్‌కు వెళ్తా అంటుంది. దీప బయటకు వస్తుండగా బంటు కనిపిస్తాడు. బంటుతో దీప ఏదో తప్పు చేశావని లేదంటే దొంగతనం చేశావా అని ఇంటరాగేషన్ చేస్తుంది. దీంతో బంటు కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి మెడలో గాయత్రీదేవి వజ్రాల మంగళ సూత్రం.. బతికుండగానే విశాల్‌ తల్లికి చితి పెట్టారా..!