Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీపని ఏమనొద్దని కార్తీక్ పారిజాతం, జ్యోత్స్నలతో చెప్తాడు. ఇక పారిజాతం పనులన్నీ జ్యోత్స్న చేస్తుంది దీపని పంపేయ్‌ అని చెప్తుంది. శ్రీధర్ మంచి మాట చెప్పారని పారిజాతంతో అంటాడు. దానికి కాంచన పారిజాతాన్ని తప్పు పడుతుంది. తన మేనకోడలు జ్యోత్స్నకి వంటావార్పు రాదు అని కనీసం స్టవ్ వెలిగించడం కూడా రాదని అంత గారాభంగా తన అన్నయ్య పెంచాడని దీప వచ్చి మంచి పని చేసిందని అంటుంది.  


కాంచన: డాక్టర్ గారు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోమన్నారు. నా వల్ల అవుతుందా పోనీ మీ అల్లుడు సాయం చేస్తారు అనుకుంటే ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. ఇలాంటి టైంలో మన అనుకున్న ఓ మనిషి మనకు తోడుగా ఉండాలి.
పారిజాతం: జ్యోత్స్నకి పనులు ఏమీ రావు అనుకుంటే జ్యోత్స్నతో పాటు నేను ఉంటాను.
కాంచన: సరే పిన్ని నాకు కాఫీ తాగాలని ఉంది కాఫీ పెట్టి బాత్‌రూంల్‌ రెండు చీరలు ఉన్నాయి ఉతికి ఆరేయ్. ఏంటి పిన్ని నేను అన్న మాటలు నీకు ఇబ్బందిగా ఉన్నాయి కదా. చేయించుకోవడం అలవాటు అయిన వారికి చేయడం చాలా ఇబ్బంది పిన్ని. జ్యోత్స్న ఫిడ్జ్‌లో జూస్ ఉంది తీసుకెళ్లి మీ బావకి ఇవ్వు. ఇప్పుడు వాడికి రెస్ట్ అవసరం వాడి చుట్టూ నోళ్లతో పని చేసేవాళ్ల కంటే చేతులతో పని చేసే వాళ్లు అవసరం.
పారిజాతం: మనసులో ఎంత మాట అన్నావే నీకు కాళ్లు కాదు నోరు పడిపోవాల్సింది. మాకు ప్రశాంతంగా ఉండేది.
శ్రీధర్: మనసులో కొడుకు ప్రశాంతంగా ఉండాలి అంటే పక్కన ఎవరు ఉండాలని కాంచన ఉద్దేశం.


శౌర్య కార్తీక్‌కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి మాటలు విని ఇంట్లో దీప ఉంది ఫోన్‌లో దాని కూతురు ఉంది మరి నేను ఎక్కడు ఉన్నాను అని అనుకుంటూ ఫీలవుతుంది. పక్కనున్న నన్ను వదిలేసి ఫోన్లో తనతో మాట్లడుతున్నాడని అనుకుంటుంది. ఇక కార్తీక్ తనని చూడటానికి ఎందుకు రాలేదని పాపని అడుగుతాడు. దాంతో శౌర్య అమ్మ అక్కడికి వచ్చిందా అని అడుగుతుంది. ఫోన్ ఇవ్వమని చెప్తుంది.


కార్తీక్: జ్యోత్స్న దీపని పిలువు.
జ్యోత్స్న: నేనేనా బావ.
కార్తీక్: సరే మా అమ్మకి చెప్పు అమ్మ పిలుస్తుంది.
జ్యోత్స్న: అంత ప్రోటోకాల్ వద్దులే. నేనే పిలుస్తానులే బావ. మనసులో మీ ఇద్దరి మధ్య రాయబారానికి నేను తగలడ్డాను కదా. దీప నిన్ను మా బావ పిలుస్తున్నాడు. శౌర్య ఫోన్ చేసింది.
పారిజాతం: నా మనవరాలికి కార్తీక్ చివరకు ఫోస్ట్ మాన్ జాబ్ ఇచ్చాడన్నమాట.
దీప: దానికి చెప్పకుండా వచ్చాను బాబుగారు మీరు ఎందుకు ఫోన్ చేశారు. 
జ్యోత్స్న: ఇదంతా చూస్తూ నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అంటే నాకు బుద్ధి లేనట్లే. గ్రానీ వెళ్దాం పద. బావకి రెస్ట్ ఇవ్వాలి కదా పద. అత్త మేం బయల్దేరుతాం.
పారిజాతం: ఏమైంది దీనికి సరే కాంచన వస్తాను.


దాసు కొడుకు కాశీ బట్టలు ఇస్త్రీ చేస్తాడు. కాశీ తన బట్టలు ఎందుకు ఇస్త్రీ చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఇక కొత్త ఇళ్లు ఎలా ఉంది అని ముగ్గురు ఉండటానికి సరిపోయేలా ఇది తీసుకున్నానని అంటాడు కాశీ. మనం ఇద్దరమే కదా ముగ్గురేంటి అని అడిగితే మీ కోడలు వస్తే ముగ్గురం కదా అని తన ప్రేమ గురించి చెప్తాడు. అమ్మాయిని తనకి చూపించమని కాశీ అంటే బయటే ఉందని కాశీ చెప్తాడు. దాంతో దాసు ఇంటికి కాబోయే మహాలక్ష్మీని బయటే నిల్చొపెట్టావా అని స్వప్న దగ్గరకు పరుగులు తీస్తాడు దాసు. ఇక స్వప్నని మహాలక్ష్మీ అని పిలుస్తాడు. స్వప్న దాసు కాళ్లకి దండం పెడితే దాసు మురిసిపోతాడు. జ్యోత్స్న ఇలా లేదు అని ఫీలవుతాడు. ఇక తనకి ప్రేమకి అభ్యంతరం లేదని దాసు చెప్తాడు. ఇక స్వప్న తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు అని అంటే దాసు మీరే ప్రేమగా అందర్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఇక తనకు తన కోడలు బాగా నచ్చిందని కాశీతో చెప్తాడు. స్వప్న ఇంట్లో ఒప్పుకుంటే చెప్పు వెళ్లి మాట్లాడుతా అని అంటాడు.


జ్యోత్స్న, పారిజాతం కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. మధ్యలో జ్యోత్స్న కారు ఆపి ఏం మాట్లాడటం లేదు ఎందుకు గ్రానీ అని అంటే ఎవరినీ ఇంటికి రానివ్వని వాడు దీపని ఎందుకు రానిచ్చాడని దీప కోసమే ఎవరినీ రావొద్దని కార్తీక్ చెప్పినట్లు ఉందని అంటుంది. బావకి దూరంగా ఉండొద్దని ఏదో ఒకలా దగ్గరే ఉండు అని త్వరగా కార్తీక్ ఇంటికి వెళ్లు అని చెప్తుంది పారిజాతం. ఇక తను ఆటోలో వెళ్లిపోతానని చెప్పి జ్యోత్స్నని వెళ్లమని చెప్తుంది. దీపని ఎలా అయినా అక్కడి నుంచి వెళ్లగొట్టాలని అనుకుంటుంది. ఇంతలో నర్శింహ వచ్చి పది వేలు అడుగుతాడు. తన బావని పొడిచావని జ్యోత్స్న నర్శింహ మీద ఫుల్ ఫైర్ అవుతుంది. పోలీసులు నీ కోసం వెతుకుతున్నారని ఈలోపు నువ్వు అనుకున్న పని పూర్తి చేయ్ అని అంటుంది. నర్శింహకి తినడానికి డబ్బు కావాలని అడిగితే జ్యోత్స్న ఇస్తుంది. నా పెళ్లాం ఎక్కడుందని నర్శింహ అడిగితే నాకు కాబోయే భర్త దగ్గర ఉందని జ్యోత్స్న అంటుంది. దీప కార్తీక్ కోసం భోజనం తీసుకొని వస్తుంది. ఇక కార్తీక్ దీపని మన రెస్టారెంట్‌లో ఛెప్‌గా నియమించబోతున్నానని కాంచనతో చెప్తాడు. ఇక కాంచన భోజనం చేయడానికి వెళ్తుంది. దీప ఛెప్‌గా చేయను అని అనేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: విశాల్‌ని చంపడానికి డాక్టర్‌ అవతారం ఎత్తిన గజగండ, గంటలమ్మ.. పాప ఐడియా సూపర్!