Trinayani Serial Today Episode పాయసం గిన్నెను వినాయకుడి దగ్గర ఉన్న ఎలుక తన్నేస్తుంది. దాంతో గాయత్రీ పాప విషం కలిపిన పాయసం తినకుండా అయింది. దీంతో తిలోత్తమ డిస్సప్పాయింట్ అయిపోతుంది. విక్రాంత్ భోజనం సిద్ధం చేసి సుమనకు పిలిచి ప్లేట్ గ్లాస్ పట్టుకొని రమ్మంటే సుమన పట్టుకొని ఎవరికి అని అడుగుతుంది. విశాల్ బ్రోకి అని చెప్పడంతో సుమన చేయనని పక్కన పెట్టేస్తుంది. అంతే కాకుండా విశాల్ వెక్కిరిస్తుంది.
విక్రాంత్: ఏయ్ నోర్ముయ్ క్యారేజీతో కొట్టానంటే వారం రోజులు తినలేకుండా అయిపోతావ్. ఈ ఇంట్లో కుక్కలా పడిండేది నువ్వే అలాంటిది విశాల్ బ్రోని వెక్కిరిస్తావా. ఇంకోసారి అలా అంటే నీ రెండు చేతులు విరిచేసి నువ్వు బొచ్చలో ఇందాక నువ్వు చెప్పినట్లే నువ్వు తినేలా చేస్తా. దరిద్రపు ముఖం పెట్టుకొని అడ్డులే.
సుమన: తిన్నా కూడా విశాల్ బావగారికి అరగదు చెప్తున్నా.
విక్రాంత్: దగ్గరకు రా.
సుమన: నేను రాను.
విక్రాంత్: ఎందుకు రావు.
సుమన: మీరు కొడతారు
విక్రాంత్: అంత భయం ఉన్నదానివి నన్ను ఎందుకు విసిగిస్తావ్.
రాత్రి హాసిని, నయని, పావనా, దరుంధర ఆరు బయట కూర్చొంటారు. హాసిని అందరికీ స్ప్రే కొడుతూ విసిగిస్తుంది. ఇంతలో వల్లభ అక్కడికి వస్తాడు. ఇంట్లో ఎలుక చనిపోయిన వాసన వచ్చిందని అందుకే ఇలా స్ఫ్రే కొడుకుతున్నా అని అంటుంది. పాయసం గిన్నె తన్నేసిన ఎలుక చనిపోయిందా అని నయని అంటుంది. వల్లభ మనసులో ఎలుక చచ్చి మమ్మీని పట్టిచ్చేలా ఉందే అనుకుంటాడు. వాసన ఏంటా అని అందరూ అనుకుంటే వల్లభ స్నానం చేయలేదని కవర్ చేస్తాడు.
విశాల్‌ని చూపించాలి అని కెనడా నుంచి డాక్టర్‌ని రప్పిస్తున్నాని తిలోత్తమ చెప్తుంది. తనకు పంచకమణి తప్ప ఇంకేదీ నయనం చయదని ఎందుకు అని అంటాడు విశాల్. దానికి తిలోత్తమ ఒకసారి ప్రయత్నిద్దామని అంటుంది. ఇక ముసలయ్య, పండుగా గజగండ, గంటలమ్మ డాక్టర్, నర్సుగా వస్తారు. తేలు కుట్టి విశాల్ చేయి అలా అయిపోయిందని తిలోత్తమ చెప్తుంది.
విశాల్ని చంపడానికి గజగండ, గంటలమ్మ ప్లాన్ చేస్తారు. అందుకు ఓ స్పెషల్ ఇంజక్షన్ ఉందని అది వేస్తే చేయి తగ్గిపోతుందని విశాల్‌కి ఇవ్వబోతారు. ఇంతలో గాయత్రీ పాప వాళ్ల బ్యాగ్ నుంచి ఇంజక్షన్ తీసుకొంటుంది. హాసిని అది గమనిస్తుంది. గాయత్రీ అత్తయ్య ఇంజక్షన్ తీసుకుంది అంటే తిలోత్తమ అత్తయ్య పిలిచిన డాక్టర్లకు బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. దాంతో హాసిని పాప దగ్గర ఇంజక్షన్ తీసుకొని నర్సు కూర్చొబోయే ప్లేస్‌లో పెడుతుంది. ఇక హాసిని గంటలమ్మని బలవంతంగా ఆ ఇంజక్షన్ మీద కూర్చొపెడుతుంది. అందరూ ఆమె అరుపులకు షాక్ అయిపోతారు. అందరూ ఏం గుచ్చుకుందా అని అడుగుతారు. ఇంజక్షన్ అని చెప్పడంతో డాక్టర్‌గా వచ్చిన గజగండ తిలోత్తమ షాక్ అయిపోతారు. ఆమె నొప్పితో విలవిల్లాడిపోతుంది మరి నాకు ఆ ఇంజక్షన్ వేయించాలని చూశావని అడుగుతాడు విశాల్. ఇక గంటలమ్మ తనకు ఏదో ఒకటి చేయమని లేకపోతే చచ్చిపోయేలా ఉన్నానని అంటుంది. ఆ ఇంజక్షన్ వేస్తే చచ్చిపోతారా అని వల్లభ అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.