Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప వల్లే కార్తీక్‌కి ఈ పరిస్థితి వచ్చిందని జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ సుమిత్ర, దశరథ్‌లను నిలదీస్తారు. దీపని ఇంటి నుంచి పంపేయమని చెప్తారు. పారిజాతాన్ని శివనారాయణ తిడుతుంటే జ్యోత్స్న గ్రానీ ఏం తప్పు మాట్లాడిందని అడుగుతుంది.
శివనారాయణ: విధి విచిత్రమైంది దాన్ని మనం అదుపు చేయాలి అనుకోవడం తప్పు. ఏదో వంటలు చేసుకొని బతుకుతాను అని వెళ్లిన దీపని నర్శింహ చంపుడానికి వెళ్లడం ఏంటి. బ్యాచిలర్ పార్టీకి వెళ్లాల్సిన కార్తీక్ దీపని కాపాడబోయి గాయపడటం ఏంటి.
సుమిత్ర: కార్తీక్ అడ్డుపడకపోతే దీపని నర్శింహ చంపేసేవాడు.
శౌర్య అనాథ అయిపోయేది.
పారిజాతం: దీప చనిపోతే మనకేంటి. శౌర్య అనాథ అయితే మనకేంటి. బయటోళ్ల గురించి ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి.
సుమిత్ర: దీప కూడా ఇలా అనుకొని ఉంటే ఈ పాటికి నా ఫొటో గోడ మీద ఉండేది. నా ప్రాణాలు దీప కాపాడటం కరెక్ట్ అని మీరు అనుకున్నప్పుడు దీప ప్రాణాలు కార్తీక్ కాపాడటం కరెక్టే అని అనుకోవాలి కదా. విధి ఎంత విచిత్రమైంది అంటే రక్త సంబంధాలు, ప్రేమ బంధాలు పిలిచినా చలనం లేని కార్తీక్ ఒక చిన్న పిల్ల పిలిస్తే లేచాడు. దాదాపు అందనంత దూరం వెళ్లిక కార్తీక్ ప్రాణాలను ఒక్క పిలుపుతో తీసుకొచ్చింది. అంటే శౌర్య కార్తీక్ ప్రాణాలు కాపాడింది కదా. ఏ బంధం ఉందని కార్తీక్ శౌర్య మీద అంత ప్రేమ పెంచుకున్నాడు.
పారిజాతం: ఏమో కావాలనే అంత దగ్గర చేసుండొచ్చు కదా.
శివనారాయణ: ఇలా చెప్పుతో కొట్టించుకునే మాటలు మాట్లాడొద్దు పారిజాతం.
పారిజాతం: నా నోరు మూయించడం తప్పు వాస్తవం అర్థం చేసుకునేవాళ్లు ఒక్కరు లేరు.
దశరథ్: చూడు పిన్ని ఆగిపోయింది నా కూతురి పెళ్లి. గాయపడింది నా మేనల్లుడు. నీ కంటే వంద రెట్ల బాధ నాకు ఉంది. చిన్న పిల్ల దాని వయసుకి అది లోతుగా ఆలోచించి అర్థం చేసుకునే తెలివి దానికి లేకపోవచ్చు మనం అయినా అర్థం చేసుకోవాలి కదా.
పారిజాతం: దీపది ఏ తప్పు లేదు అంటారు అంతేకదా. ఏదో ఒక రోజు ఇప్పుడు జాగ్రత్త పడనందుకు బాధపడతారు ఈ మాట గుర్తుంచుకోండి. జ్యోత్స్న పదమ్మా కార్తీక్ దగ్గరకు వెళ్దాం.
శివనారాయణ: ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నువ్వు జ్యోత్స్నతో మాట్లాడమ్మా. ఎందుకో అర్థమైంది కదా.
జ్యోత్స్న: దాని బాధ కూడా మనం అర్ధం చేసుకోవాలి కదా. నిజానికి చిన్నప్పటి నుంచి దానికి అలాంటి ఆలోచనలు కలిగించింది మనమే కదా. కార్తీక్‌ని నర్శింహ ఒక తప్పుడు మాట అన్నది అనే భరించలేకపోయింది అలాంటిది నర్శింహ కత్తితో పొడిచేస్తే తట్టుకుంటుందా. కార్తీక్‌కి తగ్గేవరకు మనం దీన్ని భరించాల్సిందే. ఆ విషయానికి వస్తే దీప వాళ్ల అత్తగారు కూడా చాలా బాధ పడుతూ ఉంటారు.
అనసూయ: ఏడుస్తూ.. నా కడుపున పశువు ఎలా పుట్టాడు దీప. చిన్నప్పుడు నన్ను ఏడిపించాడు. పెళ్లి చేసుకొని నిన్ను ఏడిపించాడు. ఇప్పుడు ఇళ్లు నీ పేరున రాశానని ఎర్రెత్తిపోయి నిన్ను చంపాలని చూశాడు కార్తీక్ బాబు కాపాడకపోయి ఉంటే చంటి పిల్ల తల్లి లేనిది అయ్యేది కదా. కార్తీక్ బాబుకి నువ్వు నీ కూతురు అంత రుణ పడిపోయారు. నర్శిని వీలైనంత త్వరగా పోలీసులు పట్టుకుంటే బాగున్న వాడు బయట తిరుగుతున్నాడు అంటే భయంగా ఉంది. వాళ్లింట్లో పెళ్లి ఆగిపోయింది. కార్తీక్ బాబు గాయాలతో మంచం మీద ఉన్నాడు. భాజాభజంత్రీలతో ఉండాల్సిన ఇళ్లు ఇలా మారిపోయింది. ఆ పాపాత్ముడి తల్లి నేనే కాబట్టి వాళ్లు ఎదురు పడినప్పుడల్లా నా వల్లే ఇలా జరిగిందని బాధ తప్పుదు.
దీప: ఇప్పుడు నీకు నర్శింహకు ఏం సంబంధం లేదు అత్తయ్య. నిన్ను నా మేనత్తలా చూస్తున్నాను.
ఇక అనసూయ ఇంటి నుంచి వెళ్లిపోతాను అని తన తండ్రే కార్తీక్‌ని పొడిచాడు అని తెలిస్తే పాప తట్టుకోలేదని అంటుంది. ఇంతలో శౌర్య వస్తుంది. కార్తీక్ కోసం దేవుడికి దండం పెట్టమని నానమ్మ, అమ్మకి చెప్తుంది. కార్తీక్‌ని చూడాలని తన దగ్గరకు తీసుకెళ్లమని అంటుంది. ఇక దీప శౌర్యకి ఎప్పటికీ నిజం చెప్పకూడదని అనుకుంటుంది. ఇక దీప కార్తీక్ వాళ్ల ఇంటికి సాయంగా వెళ్లాలని అనుకుంటుంది. కార్తీక్‌కి డాక్టర్ ఇంజక్షన్ వేస్తారు. బాగా రెస్ట్ తీసుకోమని తర్వాత ఎవరి సాయం తీసుకొని మెల్లగా నడవమని అంటారు. శ్రీధర్ కార్తీక్‌ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన నర్శింహని దీపని వదలని మన రెండు కుటుంబాల నుంచి దీపని తరిమేస్తే కానీ మనస్శాంతి ఉండదని అంటాడు. దాంతో కార్తీక్ నాన్న అని ఆవేశంగా తిరగబోయి నొప్పితో కదలలేకపోతాడు. ఆ దీప మళ్లీ కనపడితే అప్పుడు చెప్తా అనేలోపు దీప అక్కడికి వస్తుంది.
శ్రీధర్: మళ్లీ ఎందుకు వచ్చావ్.
దీప: సాయం చేయడానికి.
శ్రీధర్: నువ్వు నీ మొగుడు కలిసి పెద్ద సాయం చేశారు కదా కనపడటం లేదా.
దీప: మీరు ఏమన్నా పర్లేదండి నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది కదా.
కాంచన: మీ వల్లే బతికాడు కదా. రక్తం ఇచ్చింది నువ్వే కదా సమయానికి శౌర్య పిలవకపోతే కార్తీక్ బతకడు కదా. ఆయన మాటలు ఏం పట్టించుకోకు అమ్మా.
దీప: ఆయన మాటల్లోనూ అర్థం ఉంది కదా.
ఇంతలో జ్యోత్స్న, పారిజాతం వస్తారు. జ్యోత్స్న శ్రీధర్‌ని పలకరిస్తే శ్రీధర్ బాడ్ మార్నింగ్ అని విజిటర్స్ వచ్చారని దీప మీద కోపం ప్రదర్శిస్తాడు. జ్యోత్స్న, పారిజాతం దీపని చూసి షాక్ అయిపోతారు. ఇక కోపం అనుచుకొని దీప నువ్వు వస్తా అంటే నేనే తీసుకొని వచ్చేదాన్ని కదా అని అంటుంది. ఇక కార్తీక్‌తో బావ షరతులు మాకేనా దీపకి లేవా అని అంటాడు. దీపకి బావ చెప్పడులే అని జ్యోత్స్న అంటే రావొద్దని కార్తీక్ బాబు చెప్పినా నేను వినను అని దీప అంటుంది. దీప ఇలా అనేసింది అని కార్తీక్ అనుకుంటాడు. ఇక దీప కార్తీక్ బాబుని చూడటానికి రాలేదని సాయం చేయడానికి వచ్చానని అంటుంది. ఇళ్లు శుభ్రం చేయడానికి, వంటావార్పు చేయడానికి వచ్చానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీని చంపడానికి పాయసంలో విషం కలిపిన తిలోత్తమ.. ఎలుక ఏం చేసిందంటే!