Karthika Deepam Idi Nava Vasantham Serial Episode జ్యోత్స్న కార్తీక్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. జ్యోత్స్నని చూసి కాంచన రా జ్యోత్స్న అని అంటే దానికి జ్యోత్స్న మనుషులే దూరం అనుకున్నా పిలుపు కూడా దూరమైందన్న మాట అని అంటుంది. కనపడగానే రా మేనకోడలు అని పిలిచేదానివి ఇప్పుడు రా జ్యోత్స్న అంటున్నావ్ ఏమైంది అత్త నీకు అని అడుగుతుంది. 


జ్యోత్స్న: నువ్వేందుకు నన్ను వద్దు అనుకున్నావ్.
కాంచన: వద్దు అనుకున్నది మీరు.
జ్యోత్స్న: మరి నువ్వెందుకు అడ్డుకోలేదు. నన్ను నీ కోడలిని చేసుకుంటా అని మీ అన్నయ్య దగ్గర మాట తీసుకుంది నువ్వే కదా అత్త. ఎవరో తప్పు చేశారని ఇచ్చిన మాట కాదు అనుకుంటే నువ్వే గట్టిగా నిలదీసి ప్రశ్నించాలి కదా. మామయ్యతో పాటు మమల్ని కూడా నువ్వు వద్దు అనుకున్నావా.
కార్తీక్: జ్యోత్స్న.
కాంచన: నువ్వు ఆగరా అది అడిగింది నన్ను నేనే సమాధానం చెప్పాలి.
జ్యోత్స్న: చెప్పు అత్త. నువ్వు చెప్పే సమాధానం కోసమే వచ్చాను. నువ్వు ఎందుకు నన్ను కాదు అనుకున్నావో నీతోనే తేల్చుకోవాలి అని వచ్చా. ఎవరికైనా మాటలు నేర్చుకునే వయసులో అమ్మ అనో అత్త అనో నేర్పిస్తారు. కానీ నువ్వు మాత్రం నాకు బావ బావ అని నేర్పించావట. నీ పెళ్లాం ఇదేరా అని బావకి నీ మొగుడు వీడేనే అని నాకు ఒక వంద సార్లు చెప్పి నా బుర్రలో బావ గురించి తప్ప వేరే ఆలోచన లేనట్లు చేసింది నువ్వే. ఇప్పుడు మామయ్య రెండో పెళ్లి గురించి బయట పడిందని మీరు మీరు కొట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసే హక్కు మీరు ఎవరు ఇచ్చారు. నా పెళ్లి ఆపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. చేయాలి అనుకోవడం మీ ఇష్టమే వద్దు అనుకోవడమే మా ఇష్టమే. మీరు పెళ్లి ఎందుకు ఆపారో మేనకోడలిగా ప్రశ్నించే హక్కు నాకు ఉంది. నవ్వు కూడా నన్ను కోడలిగా వద్దు అనుకున్నావా అత్త.
కాంచన: వద్దు అనుకున్నది మీ తాత, మీనాన్న. నేను కాదే. నాన్నతో కానీ అన్నయ్యతో కానీ మీ పెళ్లికి ఏ అడ్డూ లేదని చెప్పించు. తాంబూలం పెళ్లెంతో మీ బావని తీసుకొని మీ గుమ్మం ముందు నిలబడకపోతే అప్పుడు అడుగు. 
జ్యోత్స్న: నీకు ఏ అభ్యంతరం లేదు కదా నువ్వు వచ్చి ఒప్పించొచ్చు కదా. పుట్టింటి మీద నీకు అంత గౌరవం ఉంటే అక్రమ సంతానం ఇంటికి ఎందుకు వెళ్లావ్. స్వప్న నీ సవతి కూతురు అని మర్చిపోయావా. వాళ్ల అమ్మ వల్లే కదా నీ సంసారం నాశనం అయింది అది కూడా మర్చిపోయావా. 
కార్తీక్: జ్యోత్స్న లిమిట్ దాటి మాట్లాడుతున్నావ్.
జ్యోత్స్న: మాట్లాడుతా బావ ఎందుకంటే నా మనసులో ఉన్న బాధ అలాంటిది. తండ్రి గౌరవం కోసం మాట వెనక్కి తీసుకున్న ది గ్రేట్ కాంచన గారు అలియాస్ అత్తగారు సవతి కూతురికి అక్షింతలు వేయడానికి వెళ్లడం దిగజారిపోవడం కాదా. ఇది పరువు తక్కువ పని కాదా? నాకు ఎందుకు ఈ శిక్ష.
కార్తీక్: శిక్ష వేసింది మీ తాత ఆయన్ని వెళ్లి అడుగు. వెళ్లి మీ వాళ్లని అడుగు. 
జ్యోత్స్న: మీ వాళ్లు ఏంటి అంటే మీరు నా వాళ్లు కాదా.
కార్తీక్: కాదు అని మీ తాత చెప్పాడు కదా ఆయనకు పంతాలు పట్టింపులు తప్ప బంధాలు బంధుత్వాలు వద్దంట
జ్యోత్స్న: మీరు నాతో రండి బావ వెళ్లి మనందరం మాట్లాడుదాం.
కార్తీక్: మాట్లాడాను. మర్యాదగా పొమ్మన్నాడు. మరోసారి మా గుమ్మం తొక్కద్దని అన్నాడు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్.
జ్యోత్స్న: ఇది నా అత్తిళ్లు నాకు నచ్చినప్పుడు వస్తా.
కార్తీక్: ఇంతకీ మీ తాత పర్మిషన్ తీసుకొనే వచ్చావా మళ్లీ మేమే ఇదంతా చేశామని అంటాడు. 
జ్యోత్స్న: నేను రావడం మీకు ఇష్టం లేదు. లేదులే బావ నన్ను చూడటమే నీకు ఇష్టం ఉండదు. అదే దీపతో అయితే మీ ఇద్దరూ చక్కగా షికార్లు చేస్తారు. 
కార్తీక్: జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు.
జ్యోత్స్న: ఏ అబద్ధం చెప్పినట్లు అంత అరుస్తావే దీప మీ ఇంటికి రాలేదా. మీరు స్వప్న ఇంటికి వెళ్లలేదా. తనని నువ్వు గేటు బయట దింపి వెళ్లలేదా
కాంచన: అందులో తప్పేముందే
జ్యోత్స్న: ఏముందా ఇప్పుడు నీకు దీప తప్ప జ్యోత్స్న కనిపించదు. అది చెప్తే నువ్వు ఎక్కడికి అయినా వెళ్తావ్ ఆవిడ గారు మీ ఇద్దరినీ అలా మార్చేసింది. మీ ఇంటి ముందు దీప విగ్రహం కట్టుకో. లేదంటే తన జీవిత చరిత్ర బుక్ ప్రింట్ వేయించుకో అంతే కానీ మన కుటుంబాల్ని విడదీసిన దాన్ని నా ముందు పొగడకు. 
కాంచన: కార్తీక్ నువ్వు ఆగరా. జ్యోత్స్న మిగతా అందరి గురించి వద్దే నా మనసు మారదే నువ్వే నా కోడలివి మీ నాన్న తాతల చేత సరే అనిపించు.
జ్యోత్స్న: ఆ దీప కూడా కాస్త అటూ ఇటూగా ఇదే మాట అంటోంది అత్త నువ్వు ఇదే మాట మీద ఉంటే నేను తాతల్ని ఒప్పిస్తా. వస్తా అత్తా
కార్తీక్: అలా ఎందుకు అన్నావమ్మా మళ్లీ అక్కడ జ్యోత్స్న ఏం గొడవ చేస్తుందో.
కాంచన: ఈ రకంగా అయినా మనం కలుస్తామేమో కదరా. చూద్దం ఏం జరుగుతుందో.


దీప ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటే అనసూయ దీపతో మాట్లాడే చనువు ఇచ్చారని మాట్లాడే అధికారం మనం తీసుకోకూడదని అంటుంది. ఇంతలో కాంచన దీపకి కాల్ చేసి శౌర్యని రెండు రోజులు మా ఇంటి దగ్గర ఉంచమని అంటుంది. దీప సరే అంటుంది. ఈ రోజే వచ్చేయండని అంటుంది. కాంచనను ఈ ఒంటరి తనం నుంచి బయట పడేయాలి అంటే రెండు కుటుంబాలు ఒక్కటి చేయాలని అంటుంది అనసూయ. మరోవైపు ఇంట్లో అందరికీ సుమిత్ర వడ్డిస్తుంది. శివనారాయణ జ్యోత్స్న గురించి అడుగుతాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్లిందని సుమిత్ర చెప్తుంది. ఇంతలో జ్యోత్స్న వస్తుంది. తాను అత్త ఇంటికి వెళ్లానని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఎవర్ని అడిగి వెళ్లావని తండ్రి అడిగితే జ్యోత్స్న ఇంతకు ముందు అడిగి వెళ్లలేదని అంటుంది. ఇక ముందు తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లొద్దని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న తాతని ఎదురిస్తే  దశరథ్ జ్యోత్స్నని తిడతాడు. 


జ్యోత్స్న: నేను పెళ్లి గురించి అత్త దగ్గర మాట్లాడాను. నాకు ఏం అభ్యంతరం లేదు మీ తాత సరే అంటే తాంబూలం పట్టుకొని వస్తా అంది. జ్యోత్స్న మాటలకు సుమిత్ర మామకి క్షమాపణ చెప్తుంది. ఇక శివన్నారాయణ దశరథ్తో నీ కూతురు విషయంలో నేను జోక్యం చేసుకోవాలా వద్దా అని అడుగుతాడు. దశరథ్ తండ్రి మాటే అందరూ మనసా వాచా ఆచరిస్తామని అంటాడు. దానికి శివన్నారాయణ తన తప్పు సరిదిద్దుకోవడానికి తన ఫ్రెండ్ కొడుకుతో జ్యోత్స్నకి పెళ్లి చేద్దామని రేపే సంబంధం మాట్లాడుదామని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. నాకు వేరే సంబంధం ఏంటి బావే నా భర్త అని జ్యోత్స్న అంటుంది. బావని కాదని ఈ ప్రపంచంలో ఎవర్ని తీసుకొచ్చినా నేను పెళ్లి చేసుకోనని అంతగా మీరు బలవంతం చేస్తే మీకు మీ కూతురు ఉండదని చెప్పి వెళ్లిపోతుంది. ఈ విషయం అంతా దీపతో సుమిత్ర చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: ట్విస్ట్ ఇచ్చిన మైత్రి.. హర్షని దక్కించుకోవడానికే ఇదంతా.. రూం నెంబర్ కనిపెట్టేసిన క్రిష్ ఇక ఫస్ట్‌ నైటే!