Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపని రిసెప్షన్‌కి ఒప్పించమని అందరూ శౌర్యకి చెప్తారు. శౌర్య ఐడియా రావడం లేదు అని అంటే కాంచన శౌర్యకి చాక్లెట్స్ ఇస్తుంది దాంతో శౌర్య దీప దగ్గరకు వెళ్తుంది. దీప చాక్లెట్స్ చూడకుండా అనసూయ కొంగులో ముడి వేయమని చెప్పి దీప దగ్గరకు వెళ్తుంది. దీప దగ్గరకు వెళ్లి అది అది అని అంటూ అందరూ తండ్రి గురించి అడుగుతున్నారని నాన్న లేరా అని అడుగుతున్నారని చెప్తుంది. ఏదో ఒక రోజు మా నాన్నని మీ అందరికీ నాన్నని చూపిస్తాని చెప్పానమ్మా వాళ్లకి నాకు మంచి నాన్న ఉన్నారు అని తెలియాలి అంటే మీరు రిసెప్షన్ చేసుకోవాలి అమ్మ అని శౌర్య అంటుంది.
దీప: శౌర్య ఇలా అడగమని నీతో ఎవరు చెప్పారు.
కాంచన: దాని చిన్న మనసుకి అనిపించింది చెప్పింది దాని బాధ తీర్చాల్సింది తల్లిదండ్రులుగా మీరే.
అనసూయ: ఆ బిడ్డ కోసమే కదా నువ్వు కార్తీక్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఆ బిడ్డ కోసమే ఈ రిసెప్షన్ చేసుకోవా.
దీప: కార్తీక్ బాబుని అవమానించడానికి మీరే వేదిక ఏర్పాటు చేస్తానంటే దానికి నేను ఒప్పుకోను.
కాంచన: కార్తీక్ ఫ్రెండ్స్ అన్ని మాటలు అంటే బయట వాళ్లు ఇంకెన్ని అంటారో అని దీప ఒప్పుకోవడం లేదు అనసూయ.
కార్తీక్ జాగింగ్ వెళ్లి డాక్టర్‌తో మాట్లాడుతాడు. పాపని ఇబ్బంది ఉంది అనిపిస్తుందని ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉందని చెప్తాడు. పాపని వీలైనంత ఆనందంగా ఉంచమని తన సంతోషమే తన ఆయుష్షు అని అంటాడు. ఇక ఆ పాప నా కూతురు అని కార్తీక్ చెప్తే డాక్టర్ షాక్ అయిపోతాడు. మరోవైపు జ్యోత్స్న దీప దగ్గరకు వెళ్లి గొడవ పెట్టుకోవడానికి వెళ్తుంటే పారిజాతం వెనకాలే వెళ్లి జ్యోత్స్నని ఆపుతుంది. దీపతో మాట్లాడటానికి ఇంటిలోపలకి వెళ్లాల్సిన అవసరం లేదు దీపనే బయటకు రప్పిస్తానని పారిజాతం చెప్తుంది. ఇక పారిజాతం దీప ఫోన్‌కి కాల్ చేస్తే శౌర్య లిఫ్ట్ చేస్తుంది.
దీపకి ఫోన్ ఇవ్వమని పారిజాతం చెప్తుంది. దీపతో నీతో మాట్లాడాలి బయటకు రా అనిపిలుస్తుంది. మీ ఇంటి బయటే ఉన్నాం అని అంటుంది. దీంతో దీప బయటకు వస్తుంది. మెడలో తాళి పడగానే వంట మనిషి యజమాని అయిపోయింది అని జ్యోత్స్న అనగానే కొడితే మీ ఇంటి గేటు ముందు పడతావ్ అని దీప అంటుంది. పారిజాతం ముందుకు వెళ్లి నా మనవరాలిని కొడతావా అంటే నిన్ను కూడా కొడతా అంటుంది. దాంతో జ్యోత్స్న ఇది దీప అసలు రూపం అని అంటుంది.
జ్యోత్స్న: రిసెప్షన్ చేసుకుంటున్నారు అంట కదా నీ ప్రమేయమే లేకుండా తాళి కట్టారన్నావ్ నీ ప్రమేయం లేకుండానే వ్రతం అయింది అన్నావ్ ఇప్పుడు నీ ప్రమేయం లేకుండానే రిసెప్షన్ చేస్తున్నారా. చూస్తుంటే నీ ప్రమేయం లేకుండానే కాపురం చేసేలా ఉన్నావ్.
దీప: జ్యోత్స్న
జ్యోత్స్న: కొట్టవే..నిన్ను నమ్మిన పాపానికి నాకు నువ్వు కొడితే కానీ బుద్ధి రాదు. అయితే రిసెప్షన్ చేసుకోకు. మా బావ కట్టిన తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీకు నరకం చూపిస్తా.
దీప: అయితే వెళ్లి ఈ తాళి తీసేయమని మీ బావకి చెప్పు.
జ్యోత్స్న: మా గ్రానీ అప్పుడప్పుడు చెప్తుంది దీప దగ్గర ఉన్నది నీ దగ్గర లేదే అని అదేంటో తెలుసా నీకు లౌక్యం. నేను ఓ పూలకుండీ తీసుకొని అందులో ఓ గులాబి మొక్కని తీసుకొని దాన్ని జాగ్రత్త చూసుకుంటూ గులాబి పూస్తుందని ఆశగా చూస్తూ ఉంటే ఓ రోజు దానికి పువ్వు పూస్తే ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తుంటే నా తలలో పెట్టుకోవాలి అని నేను అనుకుంటే నువ్వు కుండీని నాశనం చేసి నా తలలో పెట్టుకోవాల్సిన పువ్వులు నువ్వు పెట్టుకున్నావ్. నా తాళి నాకు కావాలి. నా బావ నాకు కావాలి. ఈ ఇంట్లో కోడలి స్థానం నాకు కావాలి. నేను ఏం చెప్పాలి అనుకున్నానో చెప్పొచ్చు అన్నావ్ కదా చెప్పేశా. కూతుర్ని అడ్డు పెట్టుకొని నా బావని సొంతం చేసుకున్నావ్ కదే వెళ్లిపోవే అందరికీ దూరంగా వెళ్లిపో.
దీప: అది నా చేతిలో లేదు. నా కూతురి సంతోషమే నాకు ముఖ్యం. నన్ను ఇలా ఉండనివ్వకుపోతే ఇన్నాళ్లు బాధతో కొట్టా ఇప్పుడు కోపంతో కొడితే నీ పని అయిపోతుంది. ఈ సారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకొని రా.
జ్యోత్స్నని పారిజాతం తీసుకొని వెళ్లిపోతుంది. దీపకి కార్తీక్‌కి రిసెప్షన్ జరగదు అని పారిజాతం అంటుంది. ఇక దీపని ప్రశాంతంగా ఉండనివ్వను అని పారిజాతం అంటే సుమిత్ర వస్తుంది. దీప ఏం అన్యాయం చేసిందని ప్రశాంతంగా ఉంచనంటున్నారు అంటే నీకు పదే పదే చెప్పడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఇక దీప దగ్గరకు ఎందుకు వెళ్లావ్ అంటే నేను కార్తీక్ భార్యని నేను బావని వదలను అంటుంది జ్యోత్స్న. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.