Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని కార్తీక్ చెప్తుంది. దానికి జ్యోత్స్న ఏం చూసి దాన్ని ఇష్టపడ్డావ్? ఆ దీప నా కంటే ఎందులో ఎక్కువో చెప్పు అని అడుగుతుంది. దానికి కార్తీక్ దీపకి అందం లేకపోయినా మనసు అందం అని, పద్ధతి ఉందని నీకు లేదని, ఒకర్ని బాధ పడకుండా మాట్లాడగలదని దీపకు ఉన్న జ్ఞానం నీకు లేదని నీకు లేదని దీప గుణం నీకంటే నీకు లేదని అందుకే దీప అంటే ఇష్టంతో ప్రతీ ముడీ నాకు నచ్చే దీప మెడలో తాళి కట్టానని చెప్తాడు.
జ్యోత్స్న: నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావు బావ. నీ కోసం నేను చాలా త్యాగాలు చేశాను. నువ్వు మాటల్లో దీపని నా కంటే గొప్పదాన్ని చేసినంత మాత్రాన అది గొప్పది అయిపోదు. నీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను ఆ దీప ఇస్తుందా.
కార్తీక్: నవ్వుతూ జోకులు వేస్తా నవ్వు రాదా జ్యోత్స్న. చిన్నప్పుడు నీ కోసం కలువ పువ్వు కావాలంటే నేను నీ కోసం ప్రాణాలకు తెగించి కోనేటిలో దూకాను అప్పుడు నువ్వు ఏం చేశావ్ నన్ను వదిలేశావ్ కానీ నీ వయసున్న అమ్మాయే నన్ను కాపాడింది. సొంత బావ నీ కళ్ల ముందు పడిపోతే నువ్వు చేయి కూడా అందించలేదు. చెయ్యి అందించలేని నువ్వు ప్రాణం ఇస్తానని అంటే ఎలా. రక్తం ఇచ్చి నాకు దీప కాపాడింది ఇది నాకు దీప ఇచ్చిన ప్రాణం తనకే సొంతం.
జ్యోత్స్న: నా రాత నేనే రాసుకుంటాను. ఆ దీపని అడ్డు తొలగించుకొని నా రాతలో నిన్ను చేర్చుకుంటాను.
అనసూయ దాసుకి నిజం చెప్పిసినందుకు దాసు ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. తమ్ముడు క్షమించురా అని ఏడుస్తుంది. తొందర పడి నోరు జారానని అనుకుంటుంది. ఈ విషయం దీపక తెలీకూడదని అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి తెలిస్తే అని అడుగుతాడు. ఏ విషయం తెలీకూడదు అని కార్తీక్ అంటే అనసూయ కార్తీక్ తన మాటలు వినలేదని అనుకుంటుంది. ఇక కాంచన, దీపలు అక్కడికి వస్తారు. కాంచన కుభేర గురించి తమకు తెలీదు మీరు చెప్తే తెలుస్తుంది అంటే కార్తీక్ నాకు ముందే తెలుసని అంటాడు. మా తమ్ముడు మీకు ముందే తెలుసా అని అనసూయ అడుగుతుంది. తెలుసని కార్తీక్ అంటాడు. ఇక దీప తండ్రి చనిపోవడానికి కారణం నేను అని కార్తీక్ చెప్తాడు.
కాంచన, అనసూయ షాక్ అయిపోతారు. ఆ రోజు కార్తీక్ వాళ్ల కార్‌ని కుభేర్ గుద్దేసి చనిపోవడం గురించి చెప్తాడు. నా చేతుల్లోనే దీప దీప అని చెప్పి చనిపోయాడని చెప్తాడు. అనసూయ ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు దీప తను అపార్థం చేసుకుందని అంటాడు. దీపకి ఎవరూ లేకుండా పోయారని కార్తీక్ అంటే లేకపోవడం ఏంటి బాబు అసలైన అమ్మానాన్నలు బతికే ఉన్నారని అనసూయ నోరు జారుతుంది. దాంతో కాంచన అంటే కుభేర్ దీప తండ్రి కాదా అని అడుగుతుంది. నోరు జారిపోయానని ఏం చెప్పాలా అని అనసూయ కంగారు పడుతుంది. దీప కూడా ప్రశ్నిస్తే దానికి అనసూయ అసలు అమ్మానాన్న బతికి ఉంటే అనేలోపు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అంటుంది.
మరోవైపు జ్యోత్స్న ఆవేశంగా ఇంటికి వెళ్లి పారిజాతంతో కార్తీక్‌తో జరిగిన గొడవ చెప్తుంది. దీపలో ఉన్న సుగుణాలు నా దగ్గర లేవని తిట్టాడని అంటుంది. దీప ఉండగా బావకి నేను కనిపించనని నా స్థానంలో దీప ఉందని ఏదో ఒకటి చేయాలని ఏడుస్తుంది. ఇంతలో దాసు ఇంటికి వస్తాడు. పారిజాతం దాసుని చూసి ఎవరైనా చూస్తారేమో అని కంగారు పడుతుంది. దాసు వచ్చి సుమిత్రా, దశరథ్‌ల గురించి అడుగుతాడు. కోపంగా శివనారాయణ వచ్చి వాళ్లు లేరు రారు అని చెప్తాడు. దాసుని నీకు డబ్బు కావాలి అంటే గేటు బయట నుంచి అడుగుఅని బయటకు వెళ్లు అని గసిరేస్తాడు. ఇక జ్యోత్స్న దాసు ఎందుకు వచ్చాడో తెలుసుకోలని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: కబడ్డీ ఆడుతూ మిత్ర, లక్ష్మీల రొమాన్స్.. కుళ్లుకున్న మనీషా.. లక్కీ తల్లి ఎంట్రీ ఎప్పుడో?