Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప కూర్చొని ఉంటే సుమిత్ర ధైర్యం చెప్తుంది. దీప సుమిత్రతో మీరు పెద్ద మనసు చేసుకొని నా కూతుర్ని చూడటానికి వచ్చినా నాకు మాత్రం మీతో మాట్లాడటానికి ధైర్యం సరిపోవడం లేదమ్మ అని అంటుంది. ఇప్పుడేమైందని సుమిత్ర అడుగుతుంది. దీప క్షమాపణలు చెప్తుంది.
దీప: జ్యోత్స్న నిశ్చితార్థం అని మీరు నాతో ఎంతో సంతోషంతో పిలిచారు. నా కూతురికి ఇలా జరిగిందని నేను ఎంత బాధ పడుతున్నానో మీ కూతురి నిశ్చితార్థం నా వల్ల ఆగిపోయిందని మీరు అంతే బాధపడుతున్నానమ్మా. అందుకే మీరు నన్ను క్షమించాలి.
సుమిత్ర: ఇప్పుడు ఎందుకు సంజాయిషీ చెప్తున్నావ్. నేను నిన్ను ఏమైనా అడిగానా. నేను చాలా జీవితం చూశా ఆ అనుభవంతో నీకు ఓ మాట చెప్తున్నా. ఉన్న కొద్ది పాటి జీవితాన్ని కష్టాలు కనీళ్లతో పాడు చేసుకోకు. నిశ్చితార్థం ఆగిపోతే నా కూతురికి పెళ్లి జరగదా. ఇంకో మంచి మూహూర్తం పెట్టి నిశ్చితార్థం జరిపిస్తాం. ఒకవేళ జ్యోత్స్న నిన్ను ఏమన్నా పట్టించుకోకు. ఇంటి దగ్గర గొడవ జరిగిన తర్వాత నర్శింహ ఇక్కడికి రాలేదు కదా.
దీప: రాలేదమ్మా.
సుమిత్ర: వస్తాడు దీప వాడు నీ కూతురి కోసం కచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వాడు వస్తే నువ్వు అడ్డుపడినా శౌర్య ఏ పరిస్థితుల్లో ఉన్నా వదిలిపెట్టడు. పాప జాగ్రత్త. ఇప్పుడు నీకు అర్థమవుతుందా నీ కూతురు ఎంత ప్రమాదంలో ఉందో. దీనికి కారణం నువ్వే. వాడిని వదిలించుకోకపోతే జీవితాంతం నువ్వు భయంతోనే బతకాలి.
దీప: నన్నేం చేయమంటారమ్మా. నా కూతురి జోలికి రావొద్దని చెప్పాను అయినా వినలేదు. చంపేస్తా అని బెదిరించా అయినా వినలేదు. చివరకు నా కూతుర్ని కాపాడటానికి కార్తీక్ బాబు ఏం చేశారో కూడా మీకు తెలుసు.. అయినా సరే వాడు వదిలి పెట్టడమ్మా. వాడు ఇంక మారడు.
సుమిత్ర: అయితే నువ్వే మారాలి. కూతుర్ని వాడికి ఇచ్చేయ్. నిజంగానే నీ కూతుర్ని వాడికి ఇచ్చేయ్.
దీప: ఏం మాట్లాడుతున్నారమ్మ అదే చేతనైతే ఇంత వరకు ఎందుకు తెచ్చుకుంటాను. నా కూతురికి ఈ పరిస్థితి ఎందుకు తెస్తాను.
సుమిత్ర: అయితే విడాకులు ఇవ్వు. కూతుర్ని ఇవ్వడం చేతకానప్పుడు విడాకులు ఇవ్వడం అవుతుంది కదా. ఇందులో నువ్వు ఎంత గింజుకున్నా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను వదులుకోమన్నోడు మంచోడు కాదు పరమ దరిద్రుడు. నువ్వు సరే అని ఒక్కమాట అను లాయర్‌తో నేను మాట్లాడుతాను.
దీప: వద్దమ్మా ఇంక ఆ విషయం వదిలేయండి. ఇవన్నీ నాకు వద్దమ్మా నా కూతురికి నయం అయితే దాన్ని తీసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లిపోతా.
సుమిత్ర: సొంత ఊరిలోనో తెలిసిన వారి దగ్గర తప్ప నువ్వు ఇంకెక్కడా ఉండాలేవు దీప. ఎందుకు అంటే నీకు అక్కడ కూడా కష్టాలు ఉంటాయి. శౌర్య కోలుకున్న తర్వాత నేను నిన్ను తీసుకెళ్లడానికి వస్తాను జాగ్రత్త.
డాక్టర్ శౌర్య రిపోర్ట్స్ చూసి శౌర్య గుండె చాలా వీక్‌గా ఉందని ఏ విషయానికి అయినా ఎక్కువ భయపడితే గుండె తట్టుకోలేదని తాను భయపడుతున్న విషయానికి దూరంగా ఉంచాలని కార్తీక్‌కి డాక్టర్ చెప్తాడు. శౌర్యని తన తండ్రికే దూరంగా ఉంచాలని కార్తీక్ అనుకుంటాడు. మరోవైపు కాంచన తన అన్నయ్య దశరథ్‌తో మరో మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం చేద్దామని అంటుంది.
పారిజాతం: అప్పుడైనా జరుగుతుందని నీకు నమ్మకం ఉందా కాంచన. జరిగిన అంతా చూసిన తర్వాత నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా. దీప ఉండగా నా మనవరాలికి నిశ్చితార్థం జరగదు.
శివనారాయణ పారిజాతాన్ని తిడతాడు. ఇంతలో సుమిత్ర ఇంటికి వస్తుంది. నీతో పాటు కార్తీక్ ఎందుకు రాలేదని పారిజాతం అడిగితే శౌర్యకి ఇంకా టెస్ట్‌లు జరుగుతున్నాయని ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి కార్తీక్ ఉన్నాడని చెప్తుంది. కార్తీకే ఎందుకు ఉండాలని పారు అడిగితే కార్తీక్ మంచోడని వాడికి శౌర్య అంటే చాలా ఇష్టమని అందుకే ఇంతలా తాపత్రయ పడుతున్నాడని అంటుంది. ఇక కార్తీక్‌కి జ్యోత్స్న అంటే ఇష్టమని అందుకే మంగళవాయిద్యాలతో వచ్చి విషయం చెప్పాడని అంటుంది. దీప శౌర్య కోసం నర్శింహ వస్తాడేమో అని టెన్షన్‌తో బయటకి వెళ్లి చూస్తుంది. ఇక కార్తీక్ లోపలికి వచ్చి శౌర్యని ఒంటరిగా వదిలేసి దీప ఎక్కడికి వెళ్లిందని అనుకుంటాడు. ఇక దూరంగా నర్శింహ ఫోన్‌లో మాట్లాడటం దీప చూస్తుంది. కంగారుగా శౌర్య దగ్గరకు పరుగులు పెడుతుంది. అక్కడ కార్తీక్‌ని చూసి నర్శింహ వచ్చాడని చెప్తుంది. ఇద్దరూ బయటకు వెళ్లి చూస్తారు. అక్కడ నర్శింహ కనిపించడు. ఇక డాక్టర్ ఏమన్నారని దీప అడిగితే కార్తీక్ ఏం ప్రాబ్లమ్ లేదని చెప్తాడు. ఇక దీప ఏ నిజం పాపకు తెలీకూడదని అనుకున్నానో ఇప్పుడు అదే నిజం తెలిసిపోయిందని ఏడుస్తుంది. కార్తీక్ దీపకు ధైర్యం చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.