Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప తన హోటల్ దగ్గరకు వచ్చిన ఒక పాపకి టిఫెన్ ఇచ్చి పంపిస్తుంది. ఇక రౌడీని దీప డబ్బులు ఇవ్వమంటే ఆ రౌడీ డబ్బేంటి నేను ఎవరో తెలుసా ఈ ఏరియా నాదే అని డబ్బు అడిగితే పగిలిపోద్దీ అని అంటాడు. కావాల్సినంతా తిన్నారు డబ్బులు ఇవ్వ అని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి బాసు డబ్బులు ఇచ్చేయ్ అంటే దానికి ఆ రౌడీ ఎవరిని అడిగి టిఫెన్ కొట్టు పెట్టారని కుర్చీ తంతే దానికి దీప కుర్చీ నీటిగా పెట్టేసి డబ్బు ఇచ్చి వెళ్లు అంటుంది. ఆ రౌడీ దీప టిఫెన్ బండి తోసేస్తా అంటే దీప వాడి చేయి పట్టుకొని అడ్డుకొని ఆపుతుంది.
దీప ఆ రౌడీని చితక్కొడుతుంది. రౌడీ సారీ చెప్తాడు. డబ్బు లేవు అంటే దీప వాచ్ తీసుకొని డబ్బు ఇచ్చి తీసుకెళ్లమని అంటుంది. కాంచన మనసులో దీపకి కోపం వస్తే ఇంత వైల్డ్‌గా ఉంటుందా అని అనుకుంటుంది. దీపతో కార్తీక్ నువ్వు ఇలా ఉంటే నాకు ఇంకా ఇంకా నచ్చేస్తావ్ అని అంటాడు. మరోవైపు జ్యోత్స్న ఆఫీస్‌కి వెళ్తుంది. మ్యానేజర్ వచ్చి శాలరీ అడుగుతున్నారని కొంతమందికి శాలరీ వచ్చిందని మిగతా వాళ్లకి లేదని చెప్తాడు. బిజినెస్ కూడా తగ్గిపోతుందని అంటాడు. ఇక కాంచన టిఫెన్ బండి మీద లాభాన్ని దీపకి ఇస్తుంటే కార్తీక్ వచ్చి సగం ఇవ్వమని అంటాడు. దీప మొత్తం ఇస్తే నాకు సగం కావాలి సగం కావాలి అని అంటాడు. దాంతో కాంచనతో దీప వాటిని సగం చేసి ఇవ్వమని అంటుంది. కాంచన సగం చేస్తుంది. దీప ఆ సగాన్ని ఇస్తుంది. కార్తీక్ వెళ్లిపోతాడు. ప్రతీ రోజు తనకు లాభంలో సగం కావాలి అని అంటాడు. ఇక ఆ డబ్బుని ఓ డబ్బాలో పెట్టి పాప ఆరోగ్యం కోసం కావాలని అందుకే డబ్బుని దాస్తున్నాను అని అనుకుంటాడు. ఇక కార్తీక్ బట్టల దగ్గర బాక్స్ పెట్టినప్పుడు కార్తీక్ లాకెట్ పడిపోతుంది. శౌర్య అది చూస్తుంది నాన్న పడేసుకున్నాడు కాబట్టి అది నాదే అనుకుంటుంది. ఇంతలో దీప అటుగా వస్తుంది. దీపని చూసి శౌర్య లాకెట్ దాచేస్తుంది. దీప లాకెట్ లాక్కొని ఒకరు ఇష్టంగా దాచుకున్నది మనం తీసుకోకూడదు అని చెప్తుంది.
దీప ఆ లాకెట్‌ని చూసి ఇది ఎక్కడో చూసినట్లు ఉందని అనుకుంటుంది. లాకెట్ పూర్తిగా చూసి అది తన తల్లి జ్ఞాపకంగా తండ్రి మెడలో వేయడం గుర్తు చేసుకుంటుంది. చిన్నతనంలో దీప కార్తీక్‌ని కాపాడటం గుర్తు చేసుకుంటుంది. ఇక రాత్రి కార్తీక్ ఆ లాకెట్ కోసం వెతుకుతూ ఉంటాడు. దీప అక్కడికి వస్తుంది. ఆ లాకెట్ తీసి దీని కోసమే వెతుకుతున్నారా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ లాకెట్ చూస్తాడు. అది నా ఫ్రెండ్‌ది అని కార్తీక్ చెప్తాడు. ఎవరు ఆ ఫ్రెండ్ అని దీప అడుగుతుంది. అది పెద్ద కథ అని కార్తీక్ అంటే చెప్పమని దీప అంటుంది. దానికి కార్తీక్ మన ఇద్దరి మధ్య కొంత దూరం ఉంది ఆ దూరం తగ్గించడానికి నేను ఎంత ప్రయత్నించినా నువ్వు రెడీగా లేవు అని అంటాడు. అందుకే నీతో ఏం చెప్పుకోవాలి అనుకున్నా చెప్పుకోలేకపోతున్నాను అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు చెప్పుకోవాలని అనుకున్నానని చెప్తాను అని జ్యోత్స్నని నన్ను అత్త తీసుకెళ్లిందని జ్యోత్స్న కోసం కోనేటిలో దిగి కలువ పువ్వులు కోస్తుంటే కొలనులో పడిపోయానని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రోహిణిలకు పెళ్లైందని కుప్పకూలిపోయిన రూప.. మళ్లీ గొడవ అవుతుందా!