Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీపలు తులసి కోటకి దీపం పెట్టి దండం పెట్టుకుంటారు. త్వరగా కార్తీక్ సక్సెస్ అవ్వాలని దీప కోరుకుంటుంది. కార్తీక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలని అనుకుంటాడు. దీనికి టైం పడుతుందని కార్తీక్ అంటే కొత్తగా ట్రై చేయమని దీప అంటుంది. దానికి దేవుడు అవకాశం ఇవ్వాలని కార్తీక్ అంటాడు. అవకాశం ఇచ్చాడు సార్ అంటూ జ్యోత్స్న కంపెనీ మేనేజర్ ప్రభాకర్ వస్తాడు.
జ్యోత్స్న కంపెనీకి పోటీగా ఉండే సత్యరాజ్ కంపెనీని మీరు ఉన్నప్పుడే తొక్కేసారు ఇప్పుడు వాళ్లు పూర్తిగా రెస్టారెంట్ మూతపడే పరిస్థితి వచ్చిందని మీరు వెళ్లి దాన్ని తీసుకుంటే రెండు నెలల్లో దాన్ని గట్టేక్కిస్తారని ఒకసారి వాళ్లతో మాట్లాడమని చెప్తాడు. మేం కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అండగా ఉన్నారు ఇప్పుడు అక్కడ కూడా మాలాంటి వర్కర్స్ ఇబ్బంది పడతారని మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానని ఈ రోజే వెళ్లి సత్యరాజుని కలవమని చెప్తాడు.
దీప, కాంచనలు కార్తీక్‌కి వెళ్లి మాట్లాడమని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని చెప్తారు. దాంతో కార్తీక్ బయల్దేరుతాడు. కార్తీక్ తనతో పాటు దీపని రమ్మని చెప్తాడు. మరోవైపు జ్యోత్స్న కూడా తాతయ్యతో సత్యరాజ్ కంపెనీ మనమే కొనేద్దామని అప్పుడు మనకు బిజినెస్‌లో తిరుగు ఉండదని చెప్తుంది. శివన్నారాయణ సరే అని వెళ్దామంటే దానికి జ్యోత్స్న వెళ్లి నేను కొనుకొస్తా అని అంటుంది. నువ్వు వెళ్తే కొనే రావాలి లేదంటే నా పరువు పోతుందని అంటాడు. జ్యోత్స్న గుడ్ న్యూస్‌తో వస్తానని వెళ్తుంది. కార్తీక్, దీపలు సత్యరాజ్ ఆఫీస్‌కి వెళ్తారు. మీరు బిజినెస్ గురించి మాట్లాడటానికి వచ్చారా అని వెటకారంగా మాట్లాడుతాడు. బాయ్ వచ్చి ఏం కావాలని అడిగితే ఆయన్ను పీఏ పిలిచి ఎవరికి మర్యాద చేయాలో నేర్చుకో అని అంటాడు. దీప కార్తీక్‌తో నేను మీ పక్కనుంటే అందరూ ఇలాగే అనుకుంటారని అంటుంది. ఏమీ పట్టించుకోవద్దని కార్తీక్ అంటాడు.
ఇక జ్యోత్స్న అక్కడికి వస్తుంది. పీఏ జ్యోత్స్నకి మర్యాదలు చేస్తాడు. దీప ముఖం మాడ్చేస్తుంది. ఇక జ్యోత్స్న బావని పలకరిస్తే కార్తీక్, దీపలు మాట్లాడరు. మీరు ఎందుకు వచ్చారని అడిగితే రెస్టారెంట్ కోసం వచ్చామని దీప అంటే జ్యోత్స్న నవ్వుతూ రెస్టారెంట్ కొనేస్తావా దీప అని అడుగుతుంది. పీఏ వచ్చి పిలిస్తే దీప, కార్తీక్‌లు వెళ్లబోతే పిలిచింది మిమల్ని కాదు మేడంని అని అంటాడు. జ్యోత్స్న కార్తీక్‌తో మీకు దక్కాల్సిన గౌరవం ఆమె పక్కన ఉంటే దక్కదని అంటుంది. జ్యోత్స్న సత్యరాజ్‌ని కలుస్తుంది. ఎంత డబ్బు కావాలో అంతకి కొంటానని అంటుంది. ఓకే అంటే సింగిల్ పే మెంట్ చేసేస్తానని అంటుంది. వయసులో చిన్న దానివి అయినా మీ తాత కంటే ముక్కు సూటిగా మాట్లాడుతున్నావని అంటుంది. కాదనలేని ఆఫర్ ఇస్తున్నావ్ వద్దనలేనని కానీ బయట వాళ్లుతో మాట్లాడి నిర్ణయం చెప్తానని అంటారు. జ్యోత్స్న బయటకు వెళ్లి మీరు ఇక బయటకు వెళ్లొచ్చు రెస్టారెంట్ నేను కొనేశానని అంటుంది. ఇక కార్తీక్, దీపలు సత్యరాజ్‌ని కలుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!