Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ ఇచ్చిన బాండ్ పేపర్ల కోసం శ్రీధర్ తెగ వెతుకుతూ ఉంటాడు. కావేరి వచ్చి మీరు వెతకొద్దు మీకు అవి దొరకవు అని చెప్తుంది. దానికి శ్రీధర్ వాళ్లు నిన్ను తమలో కలుపుకున్నారని మురిసి పోవద్దు నేను లేకపోతే మీరంతా ఎలా వచ్చారే నేను రెండు పెళ్లిళ్లు చేసి ఉద్దరించాను అన్నట్లు మాట్లాడుతాడు. ఒకరిని పెళ్లి చేసుకున్న వాడికే మంచి మనసు ఉంటే ఇద్దరిని చేసుకున్న నాకు ఇంకెంత మనసు ఉంటుందో అని అంటాడు. దాంతో కావేరి ఇంకెప్పుడూ అలా మాట్లాడకు ఆడవాళ్లు అంతా కొడతారని అంటుంది.
ఇంతలో శ్రీధర్‌కి గంగాధర్ ఫోన్ చేసి తన మనవడి పుట్టిన రోజు వేడుక ఉందని సతీసమేతంగా రమ్మని చెప్తాడు. దాంతో శ్రీధర్ కావేరికి వెళ్దామని అంటే సతీ సమేతంగా అన్నారు కదా అక్కని తీసుకెళ్లండి అని చెప్తుంది. దాంతో శ్రీధర్ ఈ దరిద్రాలన్నింటికీ దీపే కారణం దీప పోతే అన్ని దరిద్రాలు పోతాయని అనుకుంటాడు.
శౌర్య చదువుకుంటుంటే దీప పక్కనే కూర్చొని ఏవో లెక్కలేసుకొని రాసుకుంటుంటుంది. కార్తీక్ ఇద్దరి వెనాకలే ఉంటాడు. శౌర్య దీపతో ఏం రాసుకుంటున్నావ్ అంటే నీకు ఎందుకు నీ పని చూసుకో అని దీప అంటుంది.దాంతో శౌర్య ఏవో పరీక్షలకు ప్రిపేర్ అయిపోతున్నట్లుందని తల్లి మీద సెటైర్లు వేస్తుంది. ఇక కార్తీక్ దీప ఏం రాస్తుందని వచ్చి చూస్తాడు.
శౌర్య: నేను అడిగాను నేను నాకు చెప్పలేదు. చదువుకోమన్నాది.
కార్తీక్: నువ్వు నేను ఒకటేనా. నేను నీ కంటే పెద్దొడిని.
శౌర్య: అయితే నాకు సగం చెప్పు నాన్న.
కార్తీక్: నువ్వు లోపలికి వెళ్లి చదువుకో.
శౌర్య: నీ కంటే అమ్మే బెటర్.
కార్తీక్: శౌర్య వెళ్లిపోయింది చెప్పు. ఇవేవో వడ్డీ లెక్కల్లా ఉన్నాయే.
దీప: కాదు మన లెక్కలే మన ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఏం చేయాలి అన్నా మనకు ఓ ప్రణాళిక ఉండాలి కదా. అందుకే చిట్టీలు కట్టి ఆ అప్పులు తీర్చేయాలి.
ఇంతలో గంగాధర్ ఇంటి ఫంక్షన్‌కి టిఫెన్స్ కావాలని వంద మందికి టిఫెన్లు చేయాలని అంటాడు. దీప ఆలోచిస్తే కార్తీక్ ఓకే చెప్పేస్తాడు. ఇక అడ్వాన్స్‌గా 10 వేలు ఇచ్చి వెళ్తాడు. పెద్ద ఆర్డర్ వచ్చిందని కార్తీక్ అంటే ఎందుకు ఆర్డర్ ఒప్పుకున్నారని దీప అంటుంది. నలుగురి పని కదా అంటే పాపని ఇంటి దగ్గర టిఫెన్స్ నేను చూసుకుంటానని అనసూయ అంటుంది. ఆ క్యాటరింగ్ పని మీరు చూసుకోండి అంటుంది. అందరం కలిసి కష్టపడదామని కాంచన అంటుంది. కార్తీక్ చెప్పడంతో దీప ఒప్పుకుంటుంది. దీప కార్తీక్‌లు క్యాటరింగ్ గురించి మాట్లాడి సరుకులు తీసుకొస్తామని వెళ్తారు. కాంచన, అనసూయలు కొత్త రోజులు వచ్చినట్లున్నాయని అంతా మంచే జరుగుతుందని అనుకుంటారు. తర్వాత అన్ని టిఫెన్లు చేయించి అన్నీ ఆటోలో పెడతారు.
దీప నేను వెళ్లి ఇచ్చి వస్తానంటే కార్తీక్ తాను కూడా వస్తానని ఆటోలో వెనక్కి కూర్చొంటాడు. దీప కూడా కూర్చొంటుంది. కార్తీక్‌ని అలా చూసి కాంచన ఏడుస్తుంది. గంగాధర్ మనవడి ఫంక్షన్‌కి శ్రీధర్ వెళ్తాడు. గంగాధర్ శ్రీధర్ గురించి అడిగితే శ్రీధర్ అతనికి నిజం తెలీదు కదా అని గొప్పలు చెప్తాడు. ఇంతలో కార్తీక్, దీపలు అక్కడికి వచ్చి కేటరింగ్ పనులు చేస్తారు. ఇక గంగాధర్ కోడలు దీప వాళ్లతో మీరే వడ్డించండి ఎక్కువ డబ్బులు ఇస్తానని అంటుంది. కార్తీక్ ఒకే చెప్పేస్తాడు. కార్తీక్, దీపలు అందరికీ వడ్డిస్తారు. పారిజాతం, జ్యోత్స్నలు కూడా అదే ఫంక్షన్‌కి వస్తారు. శ్రీధర్‌ని చూసి మాట్లాడుతారు. గంగాధర్ శ్రీధర్‌ని నీ కొడుకు నీ మేన కోడలిని కాకుండా ఇంకెవరినో చేసుకున్నాడన్నావు ఆ కథ ఏమైందని అడుగుతాడు. దాంతో శ్రీధర్ పొలమారుతాడు. గంగాధర్ కార్తీక్‌ని పిలిచి నీరు తీసుకురమ్మని చెప్తాడు. కార్తీక్‌ని చూసి శ్రీధర్ వాళ్లు చూసి షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది కదా కావాల్సింది.. కావేరిని చిన్నమ్మా అని పిలిచిన కార్తీక్.. ఏకాకైపోయిన శ్రీధర్!