Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న దీపనే వారసురాలు అని దాసు వల్ల తెలుసుకుంటుంది. నాన్న అని ఎమోషనల్‌గా మాట్లాడి దాసు దీప గురించి చెప్పకుండా ఆపుతుంది. దీపకి నువ్వు న్యాయం చేయాలి అంటే దీప బతికుండాలి కదా అని అనుకుంటుంది. ఇక శౌర్య స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తుంది. కార్తీక్ వస్తే దీప కార్తీక్‌కి విషయం చెప్తుంది. దాంతో కార్తీక్ తిడతాడు. దాంతో శౌర్య నాన్న నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటుంది.
కార్తీక్ శౌర్యతో చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఊరుకోనని అవసరం అయితే కొడతా అని నువ్వు బెత్తం వాడు అని దీపకి చెప్తాడు. నేను ఒక్కసారి కూడా స్కూల్ మానలేదు నా కూతురిగా నువ్వు ట్రాక్ రికార్డ్ బ్రేక్ చేయాలి అంటాడు. ఇంతలో కార్తీక్‌కి డాక్టర్ కాల్ చేస్తాడు. శౌర్య రిపోర్ట్ వచ్చాయని చెప్తాడు. పాపని తీసుకొని హాస్పిటల్‌కి రమ్మని అంటాడు. అప్పటి వరకు చదువడం లేదని ఎగిరిన కార్తీక్ వెంటనే ప్లేట్ తిప్పేస్తాడు. ఇక సరదాగా హాస్పిటల్‌కి వెళ్దామని అంటాడు. దాంతో సరదాగా హాస్పిటల్ ఏంటి అని దీప, శౌర్య అడుగుతారు. దాంతో నాకు తలనొప్పి ఉందని చెప్పి కార్తీక్ అంటాడు. శౌర్యని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తానని కార్తీక్ అంటే దీప కూడా వస్తానని అంటుంది.
జ్యోత్స్న దాసు దీప గురించి చెప్పిన విషయాలు తలచు కొని ఆలోచిస్తుంది. ఇంతలో పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వెళ్లి మీ అమ్మానాన్న పర్సనల్ పని మీద వెళ్లలేదు నీకు సంబంధాలు చూడటానికి వెళ్లారని చెప్తుంది. దానికి జ్యోత్స్న ఏం రెస్పాండ్ అవ్వదు. ఏమైందని పారిజాతం అడిగితే ఒకడు చెంప దెబ్బ కొట్టాడు.. మరొకడు కత్తితో పొడిచాడు దేనికి బాధ పడాలి అని అడుగుతుంది. దానికి పారు కత్తితో పొడిచిన దానికే అని చెప్తుంది. దానికి నువ్వు చెప్పింది చెంప దెబ్బ అయితే నీ కొడుకు నన్ను కత్తితో పొడిచాడని అంటుంది.
జ్యోత్స్న: బిడ్డను చంపాడో లేదో తెలుసుకోకుండా సైధుల్ని ఎందుకు చంపావ్.
పారు: నువ్వేంటి ఇలాంటి మాటలు గట్టిగా మాట్లాడుతున్నావ్ మీ తాత వింటే నన్ను చంపేస్తాడు.
జ్యోత్స్న: ఆ బిడ్డను నువ్వు లేకుండా చేసుంటే బాగుండేది. అసలైన వారసురాలు తిరిగి వస్తే ఏం చేస్తావ్.
పారు: అలాంటి మాటలు మాట్లాడకే. వాడు ఆవేశంలో అసలు వారసురాలిని కనిపెడతాను అన్నాడు అది జరగదులే.
జ్యోత్స్న: మనసులో జరిగింది గ్రానీ కానీ నేను చెప్పలేను చెప్పినా వేస్ట్.
పారు: చెప్పాను కదా నువ్వే అసలైన వారసురాలివి అని ఇది అర్థం అయిందా.
జ్యోత్స్న: ఇది అందరికీ అర్థం కావాలి.
శివనారాయణ: ఏంటి అది రాత్రంతా నిద్ర పోలేదా అమ్మ.
జ్యోత్స్న: కొన్ని విషయాలు తెలిశాక నిద్ర పోవడం లేదు తాతయ్య సీఈఓ పదవి నుంచి తీసేశాక బావ సరిగా పని చేయడం లేదు.
శివనారాయణ: అది నేను చూసుకుంటాలే.
కార్తీక్ దీపకి తెలీకుండా శౌర్యని తీసుకెళ్తుంటే కార్తీక్ కంటే ముందే దీప కారులో కూర్చొని ఉంటుంది. కార్తీక్ దీపని చూసి షాక్ అయిపోతాడు. నువ్వు ఎందుకు అని కార్తీక్ అడిగితే దానికి దీప మీ కోసమే వస్తున్నాను అంటుంది. ఇక దీప ఉంటే ఎలా మ్యానేజ్ చేయాలి అనుకుంటాడు కార్తీక్. జ్యోత్స్న అటుగా వెళ్తూ కార్తీక్ వాళ్లని చూస్తుంది. కార్తీకవాళ్లు హాస్పిటల్‌కి వెళ్లడం ఏంటి అనుకొని ఫాలోఅవుతాడు. దీప కూడా రావడంతో షాక్ అయిపోతుంది. అసలైన వారసురాలు చనిపోవాలని అనుకుంటుంది. ఇక కార్తీక్ డాక్టర్‌ని కలుస్తా అంటే దీప కూడా వస్తా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: డీఎన్ఏ రిపోర్ట్ మార్చిన జీవన్‌కి దిమ్మ తిరిగే షాక్.. జీవనే హారతి భర్త అని తెలిసిపోయిందా!