Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీపలు ఇంటికి వస్తారు. ఏమైందని కాంచన దీపని అడిగితే కార్తీక్ బాబు చెప్తాడని దీప వెళ్లిపోతుంది. ఆఫీస్‌లో ఏదో గొడవ అయినట్లుందని కాంచన అనుకుంటుంది. ఇక సుమిత్రా, దశరథ్‌లు కార్తీక్‌ని కంపెనీ నుంచి తీసేయడం గురించి మాట్లాడుకుంటారు. శివనారాయణ, జ్యోత్స్న అక్కడికి వస్తారు. సుమిత్ర జ్యోత్స్నతో వాడు నీ సొంత బావే కదా నువ్వే అయినా వాడిని ఆపాల్సింది కదా వదిన గురించి అయినా ఆలోచించాల్సింది అని మామ, కూతురితో సుమిత్ర అంటుంది.


శివనారాయణ: వాడు పెద్దోడా నేను పెద్దోడినా వాడు తగ్గాలా నేను తగ్గాలా. వాడిని నేను జీవితం ఇచ్చానని గుర్తు రావాలి కదా.
సుమిత్ర: మీరు వాడికి జీవితం ఇచ్చారని బయటకు గెంటేస్తారా.
జ్యోత్స్న: మమ్మీ అర్థం చేసుకోకుండా మాట్లాడకు. మేం బతిమాలుతున్నా బావ మనందరినీ కాదని వెళ్లిపోయాడు. ఆ దీప కోసం అందర్నీ వద్దనుకొని వెళ్లిపోయాడు. అందుకు నువ్వు మమల్ని నిలదీయడం కాదు కావాలంటే బావకి కాల్ చేసి అడుగు.
పారిజాతం: వాడు పోతే ఇంకొకరు దొరకరా ఏంటి.
దశరథ్: దొరకరు పిన్ని వాడి హార్డ్ వర్క్ సిన్సియారిటీ ఇంకొకరికి రాదు. వాడు అసలు లండన్‌లో చదువుతూనే రెస్టారెంట్ కోసం సలహాలు ఇచ్చేవాడు. ఇక ఎంప్లాయ్‌గా మన రెస్టారెంట్‌కి ఫ్యూచర్ వాడు.
శివనారాయణ: దశరథా చాలు. వాడిని అంత మోయాల్సిన లేదు. నేను లేకపోతే కంపెనీ లేదు అని వాడు మాట్లాడుతున్నాడు. నువ్వు అంతే. ఈ రోజు వాడు వెళ్లిపోవచ్చు కానీ వాడు శివనారాయణని ఢీ కొట్టలేడు. అయినా నాకు నా మనవరాలు ఉంది. అయినా వాడు ఎక్కడికి పోతాడు నా కాళ్లు పట్టుకోవడానికి వస్తాడు. 


తాత మాటల్ని తలచుకొని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటే దీప కాఫీ తీసుకొస్తుంది. కార్తీక్ కాఫీని దీపతో షేర్ చేసుకుంటాడు. అక్కడి జరిగింది మీ అమ్మకి చెప్పమని దీప అంటుంది. ఇంతలో కాంచన వచ్చి చెప్పురా లేదంటే నాన్నని అడుగుతా అంటుంది. దాంతో కార్తీక్ తాతకి నువ్వు ఫోన్ చేసుంటే నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు నీకు తెలిసేది రెండు కుటుంబాలు మధ్య దూరం తెలుస్తుందని అంటాడు. ఇక ఆఫీస్‌ నుంచి తానే వచ్చేసేలా మీ నాన్న చేశాడని రిజైన్ చేసి అన్నీ వదిలేసి వచ్చేశాను అని ఆ కంపెనీకీ నీ కొడుకుకి ఏం సంబంధం లేదని చెప్తాడు. కాంచన ఏడుస్తుంది. అందరూ ఉండి కూడా అనాథలం అయిపోయామని కాంచన ఏడుస్తుంది. దాంతో కార్తీక్ ఇది మా నాన్న, మేనకోడలిల అహంకారం అని అంటుంది. దానికి కాంచన ఆస్తిలో మనకు వాటా ఉందని అంటాడు. ఇక దీప సుమిత్రతో మాట్లాడుదామని అంటుంది. వద్దని కార్తీక్ అంటాడు. ఇక అంతా అయిపోయిందని కార్తీక్ అంటాడు. ఇది ముగింపు కాదు ఆరంభం అని కార్తీక్ ఆవేశంగా వెళ్లిపోతాడు. కార్తీక్ మాటలకు నా రక్తం మరుగుతుందని మీకు ఏం అనిపించడం లేదా అని కాంచన, దీపలను అనసూయ అడిగితే దానికి దీప డబ్బు ఆస్తులు ముఖ్యం కాదు అభిమానించే మనుషులు కుటుంబాలు కదా అని అంటుంది. నా లాగే దీప ఆలోచిస్తుందని కాంచన అనసూయతో చెప్పి ఏడుస్తుంది. 


శ్రీథర్ దగ్గరకు కావేరి వెళ్లి మనకు అన్యాయం జరిగిపోయింది బేబీ అంటుంది. కార్తీక్‌ని కంపెనీ నుంచి బయటకు గెంటేశారని చెప్తే శ్రీథర్ ఎగిరి గంతేసి ఇది గుడ్ న్యూస్ అని చెప్పి గెంతులేస్తాడు. స్వీట్ తీసుకురమ్మని చెప్తే కావేరి కోపంతో పచ్చి, ఎండు మిర్చి భర్త నోటిలో పెట్టేస్తుంది. ఇక కావేరి కాంచన వాళ్లకు సాయం చేద్దాం అంటే శ్రీధర్ వద్దని అంటాడు. దాంతో కావేరి మిమల్ని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు అని ఎలాగోలా సాయం చేయాలని అనుకుంటుంది. ఇక కార్తీక్ ఇంటికి స్వప్నవాళ్లు వస్తారు. జరిగిన విషయం గురించి అందరూ మాట్లాడుకుంటారు. కొత్తగా ఏమైనా చేయండి మీకు మేం అండగా ఉంటాం అని చెప్తుంది. ఇక స్వప్న కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేయమని చెప్తుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారాన్ని పొడిచి పొడిచి చంపేసిన దీపక్.. రూప మీద విరుచుకుపడ్డ రాజు.. రూప ప్రెగ్నెంట్!