Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శోభని నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నాడని దీప చెప్తుంది. ఇక లాయర్ జ్యోతి శోభని బోనులోకి పిలుస్తుంది. శోభని భర్త అవునా కాదా అని అడిగితే ఆడమగ పక్కపక్కనే ఉంటే మొగుడు పెళ్లాలు అయిపోతారా. ఇందాక కార్తీక్ పెద్దమనిషి చెప్పినట్లు ఆడ మగ పక్కపక్కనే ఉంటే మొగుడు పెళ్లాలు అయిపోతారా అని ప్రశ్నిస్తుంది. తాను సాయమే చేశానని నర్శింహ తన తల్లిని అక్క అని పిలిచే వాడని టాక్సీ కొనుక్కుంటా అంటే ఫైనాన్స్ ఇప్పించామని అంత మాత్రాన తమకు సంబంధం అంటగడతారా అని ప్రశ్నిస్తుంది.
నర్శింహ: అది శోభ అంటే అంత ఈజీగా దొరుకుతుందా.. సుమిత్ర: ఈ అమ్మాయి ఇన్ని అబద్ధాలు ఆడుతుంది ఏంటి వదినా..
శోభ: మాకు ఏ సంబంధం లేదు.
దీప: లాయర్ గారు తను అబద్ధం చెప్తుంది తనే నర్శింహ రెండో భార్య.
శోభ: ఊరుకోమ్మా నువ్వు భలే చెప్తున్నావ్. నాకు అసలు పెళ్లే కాలేదు. నువ్వు ఈ మాట అన్నందుకు అక్కడ నర్శింహ ఎంత బాధ పడుతున్నాడో..
దీప: తను అబద్ధం చెప్తుంది. తన మెడలో తాళి ఉంది చూడండి.
శోభ: అయితే ఇదేంటో మీరే చూడండి అని చైన్ చూపిస్తుంది.
సుమిత్ర: ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.
జ్యోత్స్న: ఇది భలే ట్విస్ట్ ఇచ్చింది గ్రానీ.
శోభ: కార్తీక్, దీపలకు సంబంధం ఉందని నాకు కూడా ఈ దీప సంబంధం అంటకడుతుంది.
దీప: ఈవిడ అబద్దం చెప్తుంది మా అత్తయ్య ఇక్కడే ఉంది అడగండి.
నర్శింహ: నా భార్య చేసిన పనికి మా అమ్మ మనస్తాపం చెంది కోర్టుకు రాను అని చెప్పింది జడ్జి గారు.
జడ్జి: ఆవిడను తీసుకురండి ఈ కేసు మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నా.
వీవీ: మీ అమ్మ చెప్పబోయే సాక్ష్యం మీదే ఈ కేసు ఆధారపడి ఉంటుంది.. నా దగ్గర నువ్వేం దాయడం లేదు కదా. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఓకే నేను మిమల్ని నుమ్ముతున్నా మిమల్నిగెలిపిస్తా. తొందరగా వెళ్లి మీ అమ్మని తీసుకురండి.
జ్యోత్స్న లాయర్ వీవీ దగ్గరకు వచ్చి నర్శింహ, దీపలకు విడాకులు రాకూడదని, పాప నర్శింహ దగ్గరకు వెళ్లేలా చేయాలని అంటుంది. నర్శింహ తన తల్లి దగ్గరకు వెళ్లి అబద్దం చెప్పమని తల్లిని కోరుతాడు. తల్లిని తన సంతోషం కోసం అబద్ధం చెప్పమని బతిమాలుతాడు దీంతో అనసూయ సరే అంటుంది. మరోవైపు అనసూయ దీపకు సపోర్ట్‌గా మాట్లాడదని అనుకుంటారు. ఇక జ్యోత్స్న, అనసూయ అక్కడికి వస్తారు. జ్యోత్స్న ఎందుకు వచ్చిందని సుమిత్ర ఉంటే తనని పారిజాతం తీసుకురాలేదని బావ కోసం తానే వచ్చానని అంటుంది. ఇంతలో నర్శింహ అనసూయని తీసుకొని వస్తాడు. దీప తన అత్తతో మాట్లాడుతానని వెళ్తుంది.
దీప: అత్తయ్య అప్పుడే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా గురించి తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వే అత్తయ్య. నా జీవితంలో కష్టం తప్ప ఏ సుఖం అనుభవించలేదని నీకు తెలుసు. అయినా తెగించి మొండిదానిలా బతుకుతున్నాను అంటే అది నా కూతురు గురించే ఇప్పటి వరకు నేను పడ్డ అవమానాలు నేను మోసిన నిందలు చేతులు చాలా అత్తయ్య. ఇన్నాళ్లు నా భర్త లేకండా బతికాను ఇప్పుడు అలాగే ఉండాలి అనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావని నేను కోరుకుంటున్నాను అత్తయ్య. నాకు నా బిడ్డకి చావు భయం చూపించే ఈ బంధాలు నాకు వద్దు అత్తయ్య. మూడు ముళ్లతో నీ కొడుకు నాకు ఉరి తాడు వేశాడు. నాకు ఈ ఉరి తాడు నుంచి విముక్తి కావాలి అత్తయ్య. మమల్ని వదిలేయండి అత్తయ్య నన్ను నా కూతుర్ని దూరం చేయకండి.
అనసూయ: చెప్పడం అయిపోయిందా నువ్వు నా మేనకోడలివి వీడు నా కొడుకు నీకు నీ కూతురు ఎంతో నాకు నా కొడుకు అంత. చేసినది అంతా చేసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతానా. శౌర్య నీ కూతురు అయితే నా మనవరాలు. లాయర్ జ్యోతి సుమిత్రని ప్రశ్నిస్తాను అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.