Karthika Deepam Premi Viswanathan About Her Husband and Life: ప్రేమి విశ్వనాథన్‌.. "ఈమె ఎవరబ్బా  కొత్తగా?" అని ఆలోచిస్తున్నారా? అదేనండి వంటలక్క. 'కార్తీక దీపం' సీరియల్‌లో వంటలక్కగా బుల్లితెర ప్రేక్షకులకు ఆమె సుపరిచితం. ఎంతోమంది ప్రేక్షకులు ఆమెను తమ సొంత ఇంట్లో ఆడపిల్లలా భావించారు. ఆమె సీరియల్‌లో కన్నీళ్లుపెడితే ఏడ్చేశారు. ఆమెకి మంచి జరిగితే ఆనందపడ్డారు. అంతలా ఓన్‌ చేసుకున్నారు వంటలక్కని. అయితే, సీరియల్‌లో ఎన్ని కష్టాలు ఉన్నాయో నిజజీవితంలో కూడా వంటలక్కకి అన్ని కష్టాలు ఉన్నాయట. ఈ విషయాలు స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా.. ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి. 


నా భర్త నాతో ఉండడు.. 


వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథన్‌. కేరళకు చెందిన ఈమె.. కార్తీకదీపం సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ ఒక్క సీరియల్‌తోనే ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఫ్యాన్స్‌ విపరీతంగా పెరిగిపోయారు వంటలక్కకి. ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ విషయాలను పంచుకున్నారు. కార్తీకదీపం సీక్వెల్‌ వస్తున్న నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్‌ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. "కెరీర్ కోసం నేను నా పిల్లల్ని కూడా వదిలేసి తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. నా భర్త కూడా నాతో ఉండడు. ఆయన నా కంటే బిజీ. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం. ఆయన కేరళలో ఉంటే నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను హైదరాబాద్‌లో ఉంటే ఆయన కేరళలో ఉండే పరిస్థితి. ఇద్దరం ఎప్పుడూ వేరువేరు రాష్ట్రాల్లో ఉంటాం" అంటూ చెప్పుకొచ్చింది వంటలక్క. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన ఆమె ఫ్యాన్స్‌ తెగ బాధపడిపోతున్నారు. "నీకు రియల్‌లైఫ్‌లో ఇబ్బందులే, రీల్‌ లైఫ్‌లో ఇబ్బందులే" అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


లాయర్‌ టూ యాక్టర్‌.. 


కేరళకు చెందిన వంటలక్క బ్యాగ్రౌండ్‌ విషయానికొస్తే.. 1991 డిసెంబర్‌ 2న కేరళలో జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రేమి విశ్వనాథ్‌న్‌. ఈమె తల్లిదండ్రులు విశ్వనాథ్‌, కాంచన. వంటలక్క 'లా' చదివింది. ఒక ప్రైవేట్‌ సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు ఆమె. మోడల్‌గా, ఫొటోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది ప్రేమి విశ్వనాథ్‌న్‌. ఆమె అన్న శివప్రసాద్‌ కూడా ఫొటోగ్రాఫర్‌ కావడంతో అతనితో పాటు పెళ్లిలకు, ఫంక్షన్లకు ఫొటోగ్రాఫర్‌గా చేశారట ఆమె. ఆమె భర్తపేరు వినిత్‌ భట్‌ కాగా.. ఆయన కేరళలో ప్రముఖ జ్యోతిష్యుడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


కార్తీకదీపం - 2 


'కార్తీకదీపం' టెలివిజన్‌ రంగంలోనే చరిత్ర సృష్టించిన సీరియల్‌. కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ధారావాహిక. దాంట్లో డాక్టర్‌ బాబుగా నిరుపమ్‌ నటించగా, వంటలక్కగా ప్రేమి విశ్వనాథన్‌, మోనితగా శోభాశెట్టి నటించిన విషయం తెలిసిందే. ఈ సీరియల్‌కి ఫ్యాన్‌ బేస్‌ వేరెలెవెల్‌. ఇక ఇప్పుడు ఈసీరియల్‌కి సీక్వెల్‌ రాబోతోంది. దానికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ‘తెలుగు లోగిళ్లు మరవని కథ. కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది’ అంటూ ఈ ప్రోమో చివర్లో స్పష్టం చేశారు. దీంతో ఇక ఎప్పుడెప్పుడు మళ్లీ డాక్టర్‌ బాబుని, వంటలక్కని బుల్లితెరపై మరోసారి చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.  


Also Read: 'రానా నాయుడు 2' ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ - సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే?