Karthika Deepam August 31 Episode 1445


కార్తీక్ ని వెంబడించి వెళ్లిన దీపకి మోనిత షాక్ ఇచ్చింది. ఇదెవరో పిచ్చిది..డబ్బుల కోసం నాటకం ఆడుతోందని అనేస్తుంది. దీప:ఎవరే డబ్బులకోసం వచ్చింది..నేను నా మాంగల్యం కోసం వచ్చాను. నేను మీ దీపని, వంటలక్కని, మన పిల్లలు హిమ శౌర్య, అత్తయ్య మావయ్య ఎవ్వరూ గుర్తు రావడం లేదా..ఏం చేశావే నా డాక్టర్ బాబుని, నన్నే మర్చిపోయేలా ఏం మందు పెట్టావ్..ఈ మోనితకు మనకు ఎలాంటి సంబంధం లేదు..కొన్ని రోజుల క్రితం మనం విహార యాత్రకి వస్తే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మనం చనిపోయాం అనుకుని అత్తయ్య, మావయ్య వాళ్లు బాధపడతున్నారు..
మోనిత: ఎవరి పిల్లలకు ఎవర్ని తండ్రిని చేయాలనుకుంటున్నావ్..
దీప: నా పిల్లలు..నా డాక్టర్ బాబుపిల్లలు..నా పిల్లల గురించి తప్పుడు మాటలు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు
ఇంతలో బోటిక్ లో పనిచేసే వాళ్లంతా దీపను అడ్డుకుని..పరాయి ఆడదాని భర్తని ఎలా కోరుకుంటావంటారు...
దీప: ఎవరే పరాయి ఆడది..నా భర్త..ఇది పరాయిది
మోనిత: ఊరుకున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నావ్..రేయ్ శివ..దీన్ని బయటకు ఈడ్చెయ్..
శివ దీపను లాక్కెళ్లిపోతాడు..కార్తీక్ ని లోపలకు పంపించేసి మోనిత..దీప దగ్గరకు వెళుతుంది.. 


Also Read:  అసలు ఏం జరుగుతోందని నిలదీసిన కార్తీక్, మోనితకు సవాల్ విసిరి వెళ్లిన దీప!


నా డాక్టర్ బాబుని తీసుకునే ఇక్కడి నుంచి వెళతానంటుంది దీప.. నేను పంపిస్తాను నువ్వెళ్లి సార్ కి ట్యాబ్లెట్స్ తీసుకురా అని మోనిత..శివని పంపిస్తుంది
దీప: ఏం ట్యాబ్లెట్స్..ఏం చేస్తున్నావ్ నా డాక్టర్ బాబుని
మోనిత: కార్తీక్ పై నీకెంత ప్రేముందో నాక్కూడా అంతే ప్రేమ ఉంది. ఈ సారి నాకు కార్తీక్ పూర్తిగా సొంతం అయిపోవాలని నీ జ్ఞాపకాలు పూర్తిగా చెరిపేస్తున్నాను. అప్పుడు తన ఆలోచనల్లో మోనిత మాత్రమే ఉంటుంది
దీప: చంపేస్తా నిన్ను
మోనిత: నువ్వు ఆవేశ పడితే పరిగెత్తుకు రావడానికి ఇక్కడ నీ అత్తా లేదు..ఇది నీ అత్తారిల్లు కాదు. అదృష్టం బావుండి ప్రాణాలతో మిగిలావ్ కదా..నీ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపెయ్..
దీప: నువ్వే మా ఆయన్ని వదిలేసి పూర్తిగా సన్యాసుల్లో కలసిపోయే రోజొస్తుంది.. నా డాక్టర్ బాబు నాకోసం వస్తాడు..
మోనిత: వస్తాడా...వస్తే ధైర్యంగా తీసుకెళ్లు..నువ్వు ఎవరో గుర్తుపట్టలేదు..నిన్ను మర్చిపోయాడు..నువ్వు కూడా మర్చిపో..
దీపా..అప్పుడెప్పుడో మనం ఓ మాట అనుకున్నాం..ఈ జన్మ నాకోసం..మరో జన్మ నీకోసం అని..మొన్న ప్రమాదంలో చచ్చి బతికారు..ఆ మరణంతో నీ డాక్టర్ బాబు శకం ముగిసింది..ఇప్పుడిది మరో జన్మ..అంటే నాది..నా కార్తీక్ శకం మొదలైంది. నీకు కార్తీక్ కి ఏ సంబంధం లేదు..
దీప: అప్పుడు ఇలాగే ఎగిరావ్..కార్తీక్ నా సొంతం అయిపోయాడని..ఏమైంది చివరికి..నీ కుళ్లు బుద్ధి బయటపడింది. భగవంతుడు బలపర్చిన బంధాన్ని దూరం చేయడానికి నువ్వెవరు..
మోనిత: భర్త అంటే తాళి, మెట్టెలు కాదు..జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు చెరిపేస్తే ఆ బంధం ఎక్కడుంటుంది..
దీప: మా అనుబంధమే అన్నీ గుర్తుకు తెచ్చేలా చేస్తుంది..ఇన్ని రోజులు ఆయన ఉన్నారా లేరా అని టెన్షన్ పడ్డాను. నీ దగ్గర ఉన్నారని తెలిసింది.నీ నక్క జిత్తులు నా దగ్గర చెల్లవ్..డాక్టర్ బాబు కోసం మళ్లీ వస్తాను..
మోనిత: నువ్వెళ్లిసార్లు వచ్చినా కార్తీక్ నీకు దక్కడు..
దీప: నీకు అంత నమ్మకం ఉంటే..ఇక్కడే ఉండు..ఎవరి సొంతం అవుతారో తేల్చుకుందాం..అంతవరకూ నా డాక్టర్ బాబు జాగ్రత్త...


Also Read: మనసు మాట్లాడమంటోంది షరతు వద్దంటోంది - ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అంతే!


దీప మాటలు తల్చుకుని ఆలోచిస్తున్న కార్తీక్ దగ్గరకు వచ్చిన మోనిత..ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నిన్ను పేరు పెట్టి పిలిచింది కదా నిజంగా నీకు ఆమె తెలియదా అంటాడు. ఇంతకు ముందు కూడా ఈమె వేరేవాళ్లని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందట అనగానే..ఆమె అలా కనిపించలేదంటాడు కార్తీక్. మరోసారి డాక్టర్ బాబు అని నీ దగ్గరకు రాగానే డబ్బులివ్వకు..లాగిపెట్టి కొట్టు అని చెబుతుంది. ఆమెను కొట్టలేనని కార్తీక్ అంటాడు. ఆమె మాటలు నమ్మేస్తావా అని మోనిత అంటే నువ్వు ఏడ్చి నేనే నీ భార్యని అని చెబితే నమ్మాను కదా అంటాడు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదంటాడు. కార్తీక్ ఇంకా నన్ను భార్యని అని చెబితే నమ్మే పరిస్థితిలో లేడు..ఆ దీప మళ్లీ రాకుండా జాగ్రత్తపడాలని ఆలోచిస్తుంది.


దీప ఈ విషయం మొత్తం..డాక్టర్ అన్నయ్య( దీపను కాపాడి ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తి), ఆయన తల్లికి చెబుతుంది. అమ్మో నువ్వు చెబితే ఏమో అనుకున్నాం కానీ అంత కంత్రీదా అంటుంది డాక్టర్ తల్లి. అసలు డాక్టర్ బాబు బతికే ఉన్న విషయం ఆమెకు ముందు ఎలా తెలిసింది..హక్కు లేని మనిషిపై ఆశలు పెట్టుకుంది కానీ ఆమెది చాలా గొప్ప ప్రేమ అంటాడు డాక్టర్ అన్నయ్య. ఇన్నేళ్లైనా పిశాచంలా పీక్కుతింటోందంటే ఏమనుకోవాలని పెద్దావిడ చిరాకు పడుతుంది. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రాణాలతో ఉన్నందుకు మా పిల్లలతో, అత్తమామలతో సంతోషంగా ఉండేవాళ్లం. ఎప్పటికైనా కార్తీక నీ సొంతం అవుతాడని దీపకు ధైర్యం చెబుతారు. గుర్తుచేయడానికి మందులేమైనా ఉన్నాయా అన్న దీపతో...మర్చిపోవడానికి మందులున్నాయి కానీ గుర్తుచేయడానికి మందులు అవసరం లేదమ్మా అంటాడు డాక్టర్ అన్నయ్య. నా భర్త దగ్గరకు వెళ్లేదారి నేను వెతుక్కుంటానంటుంది దీప.


గతం మర్చిపోయేలా చేశాను కానీ ఒక్క పూట కూడా నాతో భర్తలా ప్రవర్తించలేదు. అప్పుడు దీప ఉన్నప్పుడే కార్తీక్ ని నా వాడిని చేసుకోగలిగాను ఇప్పుడు దీపా లేదు, దీప జ్ఞాపకాలు లేవు..నాపై ప్రేమ కలిగేలా చేస్తే చాలు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. 


రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
మీ మేడంకి మంచి వంట మనిషిని చూడాలని కార్తీక్ అనగానే.. సార్ వాసన చూడండి సార్ అంటాడు శివ. ఎవరో బిర్యానీ వండుకుంటున్నారు ఆ వాసన బావుంది..ఆవిడనే మనింట్లో వంటమనిషిగా పెట్టుకుంటే ఎలా ఉంటుందంటాడు కార్తీక్. కట్ చేస్తే దీప కనిపిస్తుంది.నువ్వా అని కార్తీక్ అనగానే..గుర్తుపట్టేశాడా ఏంటి అనుకుంటుంది మోనిత...