Keerthi bhat vijay karthik: బిగ్ బాస్ కీర్తిని పెళ్లిచేసుకుంటున్న కార్తీక్ ఎవరో తెలుసా!

బిగ్‌బాస్‌ ఫేమ్ కీర్తి భట్‌ తెలియనివారుండరు. సీరియల్స్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి బిగ్‌బాస్‌ షోతో పాపులర్ అయింది. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇంతకీ ఎవరా కార్తీక్

Continues below advertisement

Keerthi bhat vijay karthik:  'మనసిచ్చి చూడు' సీరియల్ లో భానుగా స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది కీర్తి. కార్తీకదీపం సీరియల్ లో పెద్దైన హిమ పాత్రలో నటించి మెప్పించింది. అప్పటివరకూ కొందరికి మాత్రమే కీర్తికి తెలుసు. ఎప్పుడైతే బిగ్ బాగ్ హౌజ్ లో అడుగుపెట్టి తన రియల్ లైఫ్ గురించి చెప్పిందో ఆ క్షణం నుంచి కీర్తి అందరి ఇంట్లో బిడ్డగా మారిపోయింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల వరకూ ఎవరికి వారే కీర్తిని ఓన్ చేసుకున్నారు. అయినవారందర్నీ యాక్సిడెంట్లో కోల్పోయి ఒంటరిగా మిగిలిన కీర్తి పెళ్లికి ముందే ఓ పాపను దత్తత తీసుకున్నా.. ఆ సంతోషం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. కీర్తికి బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిన సమయంలోనే పాప కూడా మరణించింది.   ఓ అమ్మాయి తల్లిగా మారడం కన్నా అద్భుతమైన క్షణం, అదృష్టం ఇంకోటి లేదని చెప్పే కీర్తి తనకు ఆ అదృష్టం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పటి వరకూ కెమెరా ముందు నటన మాత్రమే చూసిన ప్రేక్షకులు ఆమె అసలు కథ విని జీవితంలో ఇంతకన్నా విషాదం ఏముందనుకున్నారు. ఆమె కథ విని కరగని మనసు లేదు, కన్నీళ్లు రాని కళ్లులేవు. మేమున్నాం అంటూ భరోసా ఇవ్వని కుటుంబం లేదు. అలాంటి కీర్తి త్వరలో ఓ ఇంటిదవుతోంది. ఇంతకీ కీర్తిని పెళ్లిచేసుకుంటున్న అబ్బాయి ఎవరో తెలుసా...

Continues below advertisement

Also Read: వసుకి సమయానికి తగు సేవలు చేస్తోన్న రిషి, 'మిషన్ ఎడ్యుకేషన్' కి పోటీగా 'పవర్ ఆఫ్ స్టడీస్'!

మాటీవీలో‘మా బోనాల జాతర’ ప్రోగ్రాంలో నటుడు విజయ్‌ కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే వేదికపై అత్తమామలను కూడా పరిచయం చేసింది. తమ కుటుంబంలోకి కూతురిలా ఆమెను ఆహ్వానిస్తున్నట్లు చెప్పి భావోద్వేగానికి గురైంది. ‘నేను కార్తిక్‌ వంశాన్ని నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లలేనని నాకు తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకు చెప్తే.. నీకు పాప ఎందుకమ్మా? నువ్వే మాకు పాపవి. మనం పాపను దత్తత తీసుకుందామన్నారని చెప్పింది. 

Also Read: భర్తని చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన కావ్య- కోడలిని అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టు తిట్టిన అపర్ణ

మదనపల్లికి చెందిన కార్తీక్
కీర్తికి కాబోయే భర్త కార్తీక్‌ పూర్తి పేరు విజయ్ కార్తీక్‌. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పుట్టిపెరిగినన కార్తీక్ బెంగళూరులో చదివాడు. సినిమాలపై ఆసక్తితో కన్నడ నాట కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత 2014లో సేడు అనే మూవీలో హీరోగా నటించాడు. KGF‌ మూవీ విడుదలకు ముందు రోజే ఈ సినిమా రిలీజ్‌ కావడంతో అప్పట్లో హాట్‌టాపిక్‌ అయ్యింది. అలా పలుసినిమాల్లో నటించిన కార్తిక్‌ ‘ఏబీ పాజిటివ్’ సినిమాతో దర్శకుడిగా మారాడు.  తెలుగులోనూ ఓ వెబ్‌సిరీలో, ఏబీ పాజిటివ్, చెడ్డీగ్యాంగ్‌ అనే మూడు సినిమాల్లో నటించాడు. 'అన్‌లాక్' అనే మరో మూవీ ప్రస్తుతం మేకింగ్‌లో ఉంది. తమిళంలో కూడా 'డార్క్‌ నైట్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. మేమంతా ఉన్నాం అని కీర్తికి అందరూ భరోసా ఇస్తే కడదాకా తోడుంటా అంటూ ప్రామిస్ చేసి కీర్తి జీవితంలోకి అడుగుపెట్టాడు కార్తీక్. వీళ్లిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారంతా...

Continues below advertisement