Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ తల తుడుచుకుంటే విహారి మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు.. విహారి గారు ఏంటి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని లక్ష్మీ అడిగితే నేను నా భార్యతో ఎలా అయినా ఉంటాను.. ఇంకా ఇంకా క్లోజ్‌గా ఉంటాను అని అంటాడు. మీరు ఎలా ఉండాలి అనుకున్నా సహస్రమ్మతో ఉండండి అని లక్ష్మీ అంటుంది. 

Continues below advertisement

సహస్ర కోసం మన బంధం త్యాగం చేస్తున్నావా అని విహారి అడుగుతాడు. అదే న్యాయం అని భావిస్తున్నాను. మన మధ్య కేవలం ఈ తాళి బంధం మాత్రమే ఉందని లక్ష్మీ అంటుంది. ఏం బంధం లేదా.. అందుకేనా నేను చేయాల్సిన వన్నీ ఆ అమ్మవారు నీతో చేయిస్తుందా.. కనక మహాలక్ష్మీ ఒక్కటి గుర్తు పెట్టుకో ఆ అమ్మవారు కూడా చెప్తుంది. నువ్వే నా భార్యవి అని ఈ ఇంటి కోడలివి అని.. నువ్వు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా సరే నువ్వే నా భార్యవి.. అంతే అని అంటాడు. లక్ష్మీ మనసులో మీ  మీద ప్రేమ ఉన్నా మిమల్ని సహస్రమ్మని కలపడమే నా లక్ష్యం అని అనుకుంటుంది. యమున మొత్తం చాటుగా విని మనసులో మా కోసం మా కుటుంబం కోసం ఆలోచించి విహారిని నువ్వు దూరం పెడుతున్నావ్ అని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను లక్ష్మీ నన్ను క్షమించు అని అనుకుంటుంది. 

వీర్రాజు కొంత మంది పెద్ద మనుషులతో విహారి ఇంటికి వచ్చి భక్తవత్సలం గారిని పిలుస్తారు. అందరూ బయటకు వస్తారు. అమ్మవారికి సారె మీ కుటుంబమే ఇవ్వాలి కానీ అమ్మవారిని పునః ప్రతిష్ట చేయించిన ఈ లక్ష్మీ తన భర్తతో కలిసి అమ్మవారికి సారె ఇవ్వాలని ఊరి పెద్దలు పోచమ్మ నిర్ణయించారు అని అంటారు. కాదాంబరి వాళ్లు మమల్ని పిలిచారు ఇప్పుడేంటి ఇలా అంటే ఊరి క్షేమం కోసమే కదా అని భక్తవత్సలం అని అంటారు. పని మనిషితో ఇప్పించడం ఏంటి అని పద్మాక్షి అంటుంది. ఊరి క్షేమం కోసమే కదా అని అందరూ పద్మాక్షిని ఒప్పించాలి అనుకుంటారు. దాంతో పద్మాక్షి నీ భర్తని కూడా పిలు అంటుంది. ప్రకాశ్ ఉన్నాడు కదా అని సహస్ర అంటుంది. 

Continues below advertisement

తన కూతురు అల్లుడుతో సారె ఇప్పించాలని అనుకున్న పద్మాక్షి.. ప్రకాశ్ వస్తుంటే ఆపి నువ్వు లక్ష్మీ భర్తవా నిజం చెప్పరా అని అడుగుతుంది. నేను కదా ఆంటీ లక్ష్మీ భర్తని అని అంటాడు. నువ్వు ఎలా భర్తవి అవుతావురా అని పద్మాక్షి అడుగుతుంది. విహారి వాళ్లు షాక్ అయిపోతారు. వీడు ఆ రోజు లక్ష్మీతో వీడికి పెళ్లి అయిందని ఇచ్చిన సర్టిఫికేట్ ఫేక్.. వీడు నీ భర్త కాదని నువ్వు అయినా చెప్పాలి కదా అని లక్ష్మీని అంటుంది. నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా అని లక్ష్మీ అంటుంది. వీడు దొంగ నాటకం ఆడటానికే వచ్చాడు అని విహారి ప్రకాశ్‌ని కొడతాడు. ఇంకో సారి నువ్వు కనబడితే చంపేస్తా అని విహారి పంపేస్తాడు.

పద్మాక్షి ఊరి ప్రజలతో ఇప్పుడు చెప్పండి భర్త ఎవరో తెలీని దానితో సారె ఇప్పిస్తారా అని అడుగుతుంది. ఊరి పెద్దలు నీ భర్త ఎవరు అని లక్ష్మీని అడుగుతారు. దాని భర్త ఎవరో దానికే తెలీదు..  భర్త ఎక్కడున్నాడో దానికే తెలీదు అని పద్మాక్షి అంటుంది. అసలు భర్త ఉన్నాడా.. భర్త లేకుండానే ఇదంతా చేసిందా అని వీర్రాజు అడుగుతాడు. విహారికి చాలా కోపం వస్తుంటుంది. అపచారం అరిష్టం జరిగిపోయింది.. భర్త ఎవరో తెలీని మనిషితో పూజలు చేయించారు. రక్త తర్పణాలు చేయించారు. నిన్నటి వరకు కరువుతో పోయాం.. ఇప్పుడు దీంతో ఊరిలో అందరం పోతాం అని వీర్రాజు అంటాడు. ఊరి పెద్దలు లక్ష్మీతో నీ భర్త ఎవరో త్వరగా తీసుకురామ్మా అని చెప్తారు. రేపటిలో నీ భర్తని తీసుకొచ్చి సారె ఇప్పించకపోతే నీకు వంద కొరడా దెబ్బలు శిక్ష వేస్తాం అని చెప్తారు.

భక్తవత్సలం లక్ష్మీతో ఎలా అయినా నీ భర్తని తీసుకురామ్మా లేదంటే శిక్ష ఆపలేం అని అంటారు. లక్ష్మీ జరిగింది తలచుకొని బాధ పడుతుంటే విహారి వచ్చి లక్ష్మీతో నువ్వు నీ భర్తతో కలిసి సారె ఇవ్వకపోతే వాళ్లు నీకు శిక్ష వేస్తారు అని విహారి అంటే నా శిక్ష గురించి వదిలేయండి మీరు సహస్రమ్మతో కలిసి సారె ఇవ్వండి అని అంటుంది. నిన్ను కొడుతూ ఉంటే నేను చూడటం కంటే చావడం బెటర్ అని విహారి అంటాడు. అలా మాట్లాడొద్దు అని లక్ష్మీ అంటే నిజం అందరికీ చెప్తానని నీతో కలిసి నేను సారె ఇస్తాను అని విహారి అంటే అలా ఎప్పటికీ జరగకూడదు మీరు నోరు విప్పొద్దని లక్ష్మీ అంటుంది. మీరు నిజం చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని లక్ష్మీ అంటుంది. ఈ ఒట్లు ఏమీ కుదరవు అని విహారి అంటే మీరు నిజం చెప్పిన మరుక్షణం నా చావు చూస్తారు అని లక్ష్మీ విహారి నోరు కట్టేస్తుంది. దీంతో ఇవాళ్టిఎపిసోడ్ పూర్తయిపోతుంది.