Bigg Boss Telugu 9 Latest Promo on Immunity Task : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు నాలుగో వారంలోకి వచ్చింది. దసరా స్పెషల్ ఆదివారం ఎపిసోడ్లో ప్రియ షో నుంచి నిష్క్రమించగా.. సోమవారం నామినేషన్స్ జరుగుతాయనుకున్నారు. కానీ బిగ్‌బాస్ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కంటెస్టెంట్లను రెండు భాగాలుగా విభజించి.. నామినేషన్స్‌లో ఉండకూడదనుకుంటే గేమ్ ఆడాలంటూ సూచించాడు. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 డే 22కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. నామినేషన్స్ తప్పించుకునేందుకు కంటెస్టెంట్లకు అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. గతవారం ఇలాగే ఫ్లోరా షైనీ ఇమ్యూనిటీ పొంది.. నామినేషన్స్ నుంచి సేవ్ అయింది. ఇప్పుడు అదే విధంగా నామినేషన్స్ తప్పించుకోవాలంటే గేమ్ గెలవాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో కంటెస్టెంట్లను 6-6 టీమ్స్‌గా విడదీశాడు బిగ్‌బాస్. సంచాలకుడిగా కెప్టెన్ పవన్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది.
గేమ్కోసం ముందుగా బ్లాక్స్ అన్ని ఖాళీ చేసి.. తర్వాత పైన ఉన్న స్టార్స్‌ను ఒక్కొక్కటిగా తెచ్చి కింద ఉన్న బాక్స్‌లో వేయాలని బిగ్‌బాస్ టాస్క్ పెట్టాడు. దీనిలో భాగంగా కంటెస్టెంట్లు తమ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి.. ఆ తర్వాత పైకి వెళ్లి స్టార్ తీసుకోవాలి. ఒక్కసారి ఒక్క స్టార్‌ని మాత్రమే తీసుకురావాలని చెప్పాడు.
ఫౌల్ ఆడేశారు..
ఇమ్యూనిటీ గేమ్‌లో భాగంగా.. మూడు రౌండ్స్ జరిగాయి. దీనిలో మొదటి రౌండ్లో దివ్య, సుమన్ శెట్టి- సంజన, ఇమ్మాన్యూయేల్.. రెండో రౌండ్లో ఫ్లోరా, మాస్క్ మ్యాన్ హరీశ్- భరణి, తనూజ.. మూడో రౌండ్లో శ్రీజ, రాము - కళ్యాణ్, రీతూ వెళ్లారు. మొదటి రౌండ్లో దివ్య, సుమన్ శెట్టి గెలిచినట్లు లైవ్ చూస్తే తెలుస్తుంది. రెండో రౌండ్, మూడో రౌండ్లో వెళ్లిన కంటెస్టెంట్లు రూల్స్ బ్రేక్ చేసి.. ఫౌల్ గేమ్ ఆడడంతో వారిని డిస్క్వాలిఫై చేశాడు పవన్.
ఈ గేమ్‌లో మరోసారి హరీశ్‌కి, తనూజకి ఆర్గ్యూమెంట్ జరిగింది. మీరు రెండు తీసుకువచ్చాక బ్లాక్స్ పగలగొడుతున్నారంటూ హరీశ్ సీరియస్ అయ్యాడు. దీంతో వీరి గేమ్ ఫౌల్ గేమ్ అంటూ పంపేశాడు కెప్టెన్. లైవ్ ప్రకారం ఈ దివ్య, సుమన్ శెట్టి, కెప్టెన్‌గా ఉన్న డిమోన్ పవన్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. మిగిలిన వారికి నామినేషన్స్ టాస్క్ జరగనుంది.