Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి వీసా చింపిన కారణం లక్ష్మీ మీద వేశాను కానీ అసలు ఎవరు వీసా చింపారు ఆ అవసరం ఎవరికి ఉంది అని అంబిక అనుకుంటుంది. ఇంతలో సుభాష్ కాల్ చేసి విహారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది కదా మరి మన ప్లాన్ ఆపేస్తామా అంటే అంబిక వద్దని అంటుంది.
అంబిక సుభాష్‌తో మాట్లాడుతుంటే పద్మాక్షి వస్తుంది. అక్క మొత్తం వినేసిందా అని అంబిక భయపడుతుంది. పద్మాక్షి అంబికతో ఎవరితో మాట్లాడుతున్నావే అంటే ఫ్రెండ్‌తో అని అంబిక కవర్ చేసి లక్ష్మీ కావాలనే వీసా చింపేసిందని తిడుతుంది. లక్ష్మీ ఎలా అయినా వెళ్లిపోతుందిలే ఆ ప్రకాశ్ తీసుకెళ్లిపోతాడులే అని పద్మాక్షి అంటుంది. ఇంతలో సహస్ర వచ్చి అమ్మ ఎలా అయినా లక్ష్మీ, ప్రకాశ్‌లను పంపేయాలని అని అంటుంది. నాకు బావకి పట్టిన పీడ పోతుందని అంటుంది. దానికి అంబిక ఆ లక్ష్మీని పంపేసిన తర్వాత మళ్లీ నిన్ను విహారిని అమెరికా పంపిస్తామని అంబిక అంటుంది. మరోవైపు సుభాష్ తన మనసులతో డ్యూప్లికేట్ సిమెంట్ బస్తాలను విహారి కనెస్ట్రక్షన్ చేయిస్తున్న బిల్డింగ్ ప్రాంతంలో పెట్టిస్తాడు. లక్ష్మీ ఆరు బయట ఉంటే అక్కడికి విహారి వెళ్తాడు.
లక్ష్మీ: విహారి గారు మీరేంటి ఇలా వచ్చారు.
విహారి: కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు అంతు చిక్కడం లేదు. నేను ఏమడుగుతానో నీకు తెలుసు కానీ నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేదు కదా.
లక్ష్మీ: ఇష్టం లేక కాదు బదులు లేక.
విహారి: నాకు సమాధానం కావాలి. ఎందుకు విడాకులు ఇవ్వాలి అనుకున్నావ్.
లక్ష్మీ: మీరు యమునమ్మ గారు సంతోషంగా ఉండాలి. మీ నాన్న గారి కోరిక నెరవేరాలి. మీరు సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి. అందుకు విడాకులు మాత్రమే పరిష్కారం.
విహారి: నువ్వు నన్ను వదిలేసి ఉండగలవా.
లక్ష్మీ: ఉంటాను. నేను మధ్యలో వచ్చాను నా వల్ల మీరు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. నాకు విడాకులు ఇచ్చి మీరు హ్యాపీగా ఉండండి.(యమున వచ్చి వింటుంది.)
విహారి: నీకు తాళే ముఖ్యం అన్నావ్ కదా.. ఏ ఉద్దేశంతో అన్నావ్. మదన్‌ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు. విషం ఎందుకు తాగావ్.. నా కోసం ఎందుకు చెరువులో దూకావ్.
లక్ష్మీ: మీరు కట్టిన తాళి తప్పించి ఆ తాళి బంధం తప్పించి.. నాకు ఇంకేం లేదు.
విహారి: మనస్సాక్షిగా నిజం చెప్పు.
లక్ష్మీ: మీరు అంటే అభిమానం తప్ప ఇంకేం లేదు.( యమున వెళ్లిపోతుంది)
విహారి: ఇన్నాళ్లు నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తా. లక్ష్మీ వద్దని అంటే ఆపి కనకం నిన్ను భార్యగా అంగీకరించిన రోజు నుంచి నిన్ను భార్యగా అంగీకరించా. అప్పటి నుంచి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బతకలేను ఐలవ్యూ కనకం. ఐలవ్‌యూ సోమచ్.
లక్ష్మీ: విహారి తన మీద చేయి వేయడంతో చేయి తీసేస్తుంది. తప్పు విహారి గారు మీరు నన్ను ప్రేమించడం కరెక్ట్ కాదు. మీరు ప్రేమించాల్సింది సహస్రమ్మని. మీరు ఇష్టం పెంచుకోవాల్సింది సహస్రమ్మ మీద. నేను వెళ్లిపోతే మీరు కొన్ని రోజులకు సహస్రమ్మని ప్రేమిస్తారు. దయచేసి ఆవిడనే ప్రేమించండి.
విహారి: ప్రేమ ఒక్కసారే కలుగుతుంది. అది నీ మీద కలిగింది. నువ్వేంటే నాకు ప్రాణం. ( లక్ష్మీ మనసు చాలా సంతోషించి ఆత్మ విహారిని ప్రేమగా హగ్ చేసుకున్నట్లు కల గంటుంది.)
లక్ష్మీ: మీరు నన్ను ప్రేమిస్తూ సహస్రమ్మని అన్యాయం చేయకూడదు. మీ ప్రేమకి నేను అర్హురాలిని కాదు. దయచేసి నాకు విడాకులు ఇచ్చేయండి. నా మానాన నన్ను వదిలేయండి. నేను దూరంగా వెళ్లి నా బతుకు నేను బతుకుతా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి.
లక్ష్మీ గదిలోకి వెళ్లి విహారి ప్రపోజల్ గుర్తు చేసుకొని చాలా బాధ పడుతుంది. ఇంతలో యమున లక్ష్మీ దగ్గరకు వస్తుంది. లక్ష్మీ కంగారుగా అమ్మ నేను విహారి గారి వీసా చింపలేదు అని అంటుంది. నేను జరిగిపోయిన దాని కోసం మాట్లాడటానికి రాలేదు. జరగబోయేదాని కోసం వచ్చా అంటుంది. విహారి సంతకం చేసిన విడాకుల పేపర్లు వసుధ చింపేసింది కాదా అవి ఇక పనికి రావు అని అంటుంది. ప్రకాశ్ చాటుగా విని ఇదేదో నాకు పనికొచ్చే విషయంలా ఉందే.. విడాకుల పేపర్లు అంటున్నారు అంటే ఆంటీకి నిజం తెలుసా. ఆంటీకి నిజం తెలుసు అని విహారికి తెలుసా.. తెలిసే ఛాన్స్ లేదు. లక్ష్మీకి మాత్రేమే ఈ విషయం తెలుసు అన్న ఈ పాయింట్ వాడుకొని లక్ష్మీతో ఓ ఆట ఆడించాలి అనుకుంటాడు. మొత్తం వీడియో తీస్తాడు.
యమున లక్ష్మీకి పేపర్లు ఇచ్చి ఈసారి నువ్వు విడాకులు అడిగినట్లు విడాకుల పేపర్లు రాయించా సంతకాలు పెట్టు లాయర్‌తో మాట్లాడి తర్వాత పని చేయొచ్చని సంతకం చేయమని అంటుంది. లక్ష్మీ ఏడుస్తుంది. ఏడుస్తూ సంతకం చేస్తుంది. యమున వాటిని తీసుకొని వెళ్లిపోతుంది. ప్రకాశ్ ఏడుస్తున్న లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో ఒకర్ని మించి ఒకరు నటించేస్తున్నారు కనకం అంటాడు. లక్ష్మీ ప్రకాశ్ మీద అరిస్తే ఆగు ఆగు అని లక్ష్మీ, యమునల మాటలు వీడియో చూపించి విహారికి చెప్పేస్తా అంటాడు. వద్దని లక్ష్మీ బతిమాలుతుంది. మీ లిమిట్స్‌లో మీరు ఉండండి నాతో ఎక్కువ చేయొద్దని చెప్పి ప్రకాశ్ వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.