Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం కర్వాచౌత్‌లో విహారిని చూస్తుంది. విహారి ఇక్కడున్నాడేంటి అనుకుంటుంది. యమున అమ్మగారి కొడుకే విహారి అని అనుకొని షాక్ అయిపోతుంది. తన మెడలో తాళి కట్టిన విహారి ఇప్పుడు తన మరదలు సహస్రతో పెళ్లికి రెడీ అయి తన జీవితం తాను చూసుకుంటున్నాడా అని బాధపడుతుంది. ఏడుస్తూ అక్కడి నుంచి తన గదికి వెళ్లిపోతుంది.


లక్ష్మీ: భగవంతుడా ఏంటయ్యా ఇదంతా ఆయన్ని ఇచ్చి పెళ్లి చేసి నాకు మేలు చేశావ్ అనుకున్నా అంతలోనే దూరం చేసి కీడు చేశావ్ అనుకున్నా. నా జీవితం ఎలా అయినా పర్లేదు ఆయన  మాత్రం క్షేమంగా ఉండాలి అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్లీ ఆయన్ను నాకు ఎదురు పడేలా చేసి మేలు చేశావో కీడు చేశావో నాకు ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయనే నా భర్త అని ఎవరికీ చెప్పలేను. ఆయనకు అన్యాయం చేయలేను. అలా అని ఆయన్ను ఎదురుగా పెట్టుకొని ఈ ఇంట్లో ఎలా తిరగ్గలను. నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టలేను. ఎందుకయ్యా నాకు ఇన్ని పరీక్షలు. 


ఆదికేశవ్, గౌరీలు కనకానికి వీడియో కాల్ చేస్తారు. కనకం ఏం చేయాలా అని టెన్షన్ పడుతుంది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అల్లుడు ఎలా ఉన్నాడని అడిగితే ఇప్పుడే చూశాను బాగున్నాను అని అంటుంది. తల్లిదండ్రులు కనకంతో ఎప్పటికీ నువ్వు ఇలాగే భర్తని ప్రేమించాలని అంటుంది. ఇక కనకం మెడ చూసి మెడలో తాళి ఏది అని అడిగితే ఉంది అని కనకం దాచిన తాళి చూపెడుతుంది. అలా దాచుకోకూడదని అంటుంది గౌరీ. ఇక ఆదికేశవ్ అల్లుడిని చూపించమని అడిగితే ఆఫీస్‌ నుంచి వచ్చాక జాగింగ్‌‌కి వెళ్లారని చెప్పి కవర్ చేస్తుంది. ఇక ఆదికేశవ్ తనకు అవార్డు వచ్చిందని సన్మానం కూడా కేంద్ర మంత్రి చేస్తారని చెప్తాడు. కనకం ఫోన్ కట్ చేసి చాలా ఏడుస్తుంది.  


మరోవైపు సహస్రకు గాయం అవ్వడంతో అందరూ చాలా టెన్షన్ పడతారు. తర్వాత సహస్రతో కర్వాచౌత్ పూర్తి చేయించి విహారిని జల్లెడలో చూసే పని పూర్తి చేయిస్తారు. విహారిని చూస్తూ సహస్ర ఎమోషనల్ అవుతుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని విహారితో పాటు అంబిక అడిగితే ఆనందభాష్పాలని చెప్తుంది. 


సహస్ర: నా ప్రపంచంలో అమ్మానాన్న తప్ప ఎవరూ ఉండేవారు కాదు. అందరిలా పెద్ద కుంటుంబం ఉంటే బాగున్ను అనుకున్నా. కానీ మన కుంటుంబాల మధ్య గొడవల వల్ల నాకు ఆ అదృష్టం దక్కలేదు ఈ రోజు బావ వల్ల నాకు ఆ అదృష్టం దక్కింది. మీ అందరి ప్రేమ దక్కింది. అందుకే బావ మీద ఇష్టం పెరిగింది. అది వదులుకోలేనంత ప్రేమగా మారింది. విహారి చేతులు పట్టుకొని ఏడుస్తూ ..  ఐలవ్ యూ బావ ఐలవ్‌యూ సో మచ్ అని హగ్ చేసుకుంటుంది. 
వసుధ: సహస్ర బావ అంటే ఎంత ఇష్టమే నీకు.
సహస్ర: మన రెండు కుటుంబాలు కలిసాయి అంటే దానికి బావే కారణం అందుకే నేను బావకి ఎప్పటికీ వదులుకోలేనంత ప్రేమిస్తున్నాను. వదులుకోను.
పద్మాక్షి: చూశావా అమ్మ దీన్ని ఇన్ని రోజులు చిన్న పిల్లగానే చూసా కానీ ఎంత పెద్దగా మాట్లాడిందో అని ఏడుస్తుంది.
కాదాంబరి: వీళ్లింద్దరినీ చూస్తుంటే నా మనసు నిండిపోతుంది. వీళ్లిద్దరికీ ఎందరి దిష్టి తగిలిందో. వసుధ వెళ్లి లక్ష్మీని తీసుకొని రా వీళ్లకి దిష్టి తీస్తుంది.


వసుధ వెళ్లి లక్ష్మీని దిష్టి తీయడానికి పిలుస్తుంది. లక్ష్మీ రాను అంటే వసుధ బలవంతంగా చేతిలో గుమ్మడి కాయ పెట్టి లక్ష్మీని రమ్మని పిలుస్తుంది. లక్ష్మీకి ఏం చేయాలో తెలీక టెన్షన్ పడుతూనే వెళ్తుంది. ఇంతలో విహారికి తన ఫ్రెండ్ సత్య కాల్ చేస్తాడు. కనకం ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లినప్పుడు తన బ్యాగ్ కలర్ అడుగుతాడు. విహారి తెలీదు అని చెప్తాడు. కనకం వచ్చి దిష్టి తీయడానికి వచ్చి విహారి వచ్చే టైంకి ముఖానికి అడ్డంగా గుమ్మడి కాయ పెట్టుకుంటుంది. ఇక అప్పుడే కరెంట్ కూడా పోతుంది. లక్ష్మీ చీకట్లోనే దిష్టి తీస్తుంది. ఇక విహారి లక్ష్మీని చూడడు. దిష్టి తీసిన వాళ్లకి కానుక ఇవ్వాలని చెప్పడంతో లక్ష్మికి విహారి డబ్బులు ఇస్తాడు. చీకట్లో లక్ష్మీ విహారికి కనిపించదు. ఇక డబ్బులు కిందపడేలా లక్ష్మీ చేసి విహారి కాళ్లకి దండం పెడుతుంది. విహారికి ఎవరో తాకినట్లు అవ్వడంతో కిందకి చూస్తే విహారి తలమీద అక్షితలు కనకం మీద పడతాయి. లక్ష్మీ తన గదికి వచ్చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కాశీ దాసు కొడుకని తెలుసుకున్న శ్రీధర్.. ఇక స్వప్న పెళ్లి అయినట్లే.. పారు, శౌర్యల ఫన్నీ ఫైట్!