Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప కార్తీక్‌కి మందులు ఇస్తుంది. కార్తీక్ తర్వాత వేసుకుంటానని అంటే దీప వేసుకోమని ట్యాబ్లెట్ తీస్తుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి పోనీ మీ శౌర్యకి వేసినట్లు నోట్లో వేసే దీప అని అంటుంది. అన్నీ దగ్గరుండి చూసుకుంటా అంటే ఏమో అనుకున్నా కానీ మరీ ఇంత దగ్గరుండి చూసుకుంటావని అనుకోలేదని అంటుంది. కార్తీక్, దీప షాకై చూస్తూ ఉండిపోతారు.


కార్తీక్: జ్యోత్స్న కాస్త నువ్వు నీలా మాట్లాడితే మంచింది. 
జ్యోత్స్న: నేను నాలానే ఉండాలి అనుకుంటున్నా బావ కానీ నువ్వే ఉంచడం లేదు పక్కనుండాల్సిన మరదల్ని బయటకి పో అంటున్నావ్. బయట ఉండాల్సిన మనిషిని పక్కనే పెట్టుకుంటున్నావ్. 
కార్తీక్: నిన్ను బయటకు పొమ్మని నేను అనలేదు అనేలా చేసుకోవద్దు.
జ్యోత్స్న: అవును బావ ఆ మాట కూడా అనిపించుకుంటే కానీ నా లాంటి దానికి సిగ్గు ఉండదు. దీప చేసిన తప్పులు లెక్కిస్తే చేతికున్న వేలు సరిపోవు. దీప వల్ల నష్టాన్ని చర్చించుకుంటే రోజుకున్న 24 గంటలు సరిపోవు. అయినా దీపగారు తనే తప్పు చేయలేదు అని మంచితనం అనే ముసుగు వేసుకొని పద్ధతిగా తిరుగుతుంటారు. 
దీప: జ్యోత్స్న జరిగిన వాటికన్నింటికీ నేను బాధ్యత వహిస్తాను. కార్తీక్ బాబు త్వరగా కోలుకోవాలని నీ కంటే ఆత్రంగా నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకో తెలుసా మీ నిశ్చితార్థం పెళ్లి అన్నీ ఆగిపోవడానికి నేనే కాబట్టి కొన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే చూసే జనానికి అన్నీ తెలుసు.
జ్యోత్స్న: ఎగ్జాట్లీ దీప చూసే జనానికి అన్నీ తెలుసు. మనం ఒక విషయం ఓపెన్‌గా మాట్లాడుకుందామా. నీ భర్త కారణంగానే మా బావ ఈ పరిస్థితిలో ఉన్నాడు. మామూలుగా అయితే నువ్వు ఏం చేయాలి. నీ ప్లేస్‌లో నేను ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా రాత్రికి రాత్రే పెట్టేబేడా సర్దుకొని పోయేదాన్ని. 
కార్తీక్: జ్యోత్స్న ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావ్ ఇక చాలు.
జ్యోత్స్న: సరిపోదు బావ ఎవరు ఏం చేసినా దీప మాత్రం తన స్వార్థం కోసమే చేస్తుంది. 
దీప: జ్యోత్స్న నీకు ఇప్పుడు ఏం కావాలి.
జ్యోత్స్న: నువ్వు వెళ్లిపోవాలి వెళ్లిపోతావా.
కార్తీక్: దీప కాదు నువ్వు వెళ్లిపో నిన్ను చూస్తుంటే దీపతో గొడవ పెట్టుకునేలా ఉన్నావ్.
జ్యోత్స్న:  ఏం బావ నేను ఉంటే నీ ప్రైవసీకి ఏమైనా ఇబ్బందా. ఆ మాట డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా దీపతో గొడవకు వచ్చావా అని అనడం ఏంటి. సరే బావ నేను వెళ్లిపోతా దీప నువ్వు హ్యాపీనే కదా. 
దీప: నువ్వు కార్తీక్ బాబు మరదలివి కాబోయే భార్యవి నేను సాయం చేయడానికి వచ్చాను నేనే వెళ్లపోతాను. 
కార్తీక్: దీప.. ఏం మనిషివి జ్యోత్స్న నువ్వు కొంచెం అయినా సిగ్గు లేదా.
జ్యోత్స్న:  ఇంకో రెండు తిట్టు బావ పర్లేదు కానీ నీకు మరదలిని అయినా పెళ్లాల్ని అయినా సర్వెంట్‌ని అయినా నేనే.
కాంచన: నేను మొత్తం విన్నాను దీప అది నీ కూతురు  లాంటిదే. ఎక్కడ తను కోరుకున్నది దక్కదేమో అని భయం. చిన్నపిల్లలా భయపడుతుంది. అంతే నువ్వేం అనుకోకు. మళ్లీ అవసరం ఉంటే ఫోన్ చేస్తాను నువ్వు వెళ్లు. 


శ్రీధర్ కాశీని కలవడానికి వస్తాడు. ఇంతలో పారిజాతం కాశీతో మాట్లాడుతూ వాళ్ల ఇంటి నుంచి రావడం చూస్తాడు. అత్తయ్య గారు ఇక్కడున్నారేంటి అనుకుంటాడు. కాశీ పారుని నానమ్మ అని పిలవడం విని షాక్ అవుతాడు. ఇంతలో దాసు కూడా బయటకు వస్తాడు. పారిజాతం కొడుకు దాసు కొడుకే కాశీ అని తెలుసుకొని షాక్ అయిపోతాడు. స్వప్న, కాశీలకు పెళ్లి జరిగితే తన రెండో పెళ్లి గురించి తెలిసిపోతుందని వాళ్లకి ఎదురు పడకుండా శ్రీధర్ వెంటనే వెళ్లిపోతాడు. 


కార్తీక్ జ్యోత్స్న మాటలు గుర్తు చేసుకొని బాధ పడతాడు. ఇంతలో కార్తీక్‌కి స్వప్న కాల్ చేస్తుంది. డాడీ పెళ్లికి ఒప్పుకున్నారని కార్తీక్‌తో చెప్తుంది. కాశీ వాళ్ల నాన్నతో వెళ్లారని చెప్తుంది. కార్తీక్ షాక్ అయిపోతాడు. ఇంతలో కాంచన రావడంతో కార్తీక్ కాల్ కట్ చేసేస్తాడు. కాంచన వచ్చి ఏమైందని అడుగుతుంది. దాంతో కార్తీక్ తల్లి దగ్గర కవర్ చేస్తాడు. దీపకి విషయం చెప్తే సమస్య ఇంటి వరకు రాకుండా చేస్తుందని అనుకుంటాడు. ఇక మీ నాన్న కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఒకసారి చేయమని అంటుంది. ఇక కాంచన మీ నాన్నలో ఏదో తేడా వచ్చిందని అంటుంది. 


కార్తీక్ డల్‌గా ఉంటే కాంచన దీపకి కాల్ చేసి శౌర్యకి తీసుకురమ్మని చెప్పనా అది వస్తే నువ్వు సంతోషంగా ఉంటావ్ అంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. జ్యోత్స్న తప్ప వీళ్లకి అందరూ కనపడతారని అనుకుంటుంది. ఇంతలో జ్యోత్స్నని చూసిన కార్తీక్ అక్కడే ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఇక కాంచన, కార్తీక్‌లు సరదాగా జ్యోత్స్న మీద సెటైర్లు వేస్తారు. 


పారిజాతం ఇంటికి వస్తుంది. శౌర్య ఆడుకోవడం చూసిన పారిజాతం అనసూయని ఇంటి నుంచి పంపేయాలని కావాలనే గొడవ పడటానికి వెళ్తుంది. కావాలనే పారిజాతం గొడవ పడితే శౌర్య ఫోన్ తీసుకొని వచ్చి కార్తీక్‌కి కాల్ చేస్తానని బెదిరిస్తుంది. ఇక అనసూయ, పారిజాతం ఇద్దరూ ఒకర్ని ఒకరు మాటలు అనుకుంటారు. శౌర్య పారిజాతాన్ని వెక్కిరిస్తూ తెగ నవ్విస్తుంది. ఊరికే అరుస్తున్నావ్ ఏంటి అని అనసూయ అంటే పారిజాతం వాళ్లని వెళ్లిపోమని  అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అసలు జున్ను తండ్రి నువ్వేనా అని మిత్రని ప్రశ్నించి ఆలోచనలో పడేలా చేసిన మనీషా!