Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర వల్ల జున్నుకి జ్వరం వస్తుంది. లక్కీ తండ్రిని నిలదీస్తుంది. జున్ను నీ కొడుకే కదా ఎందుకు సంతకం పెట్టలేదని అడుగుతుంది. మరోవైపు జున్నుని హాస్పిటల్‌కి తీసుకెళ్దామని ఇంట్లో వాళ్లు అంటే జున్ను వద్దని నాన్న సంతకం పెడితే జ్వరం తగ్గిపోతుందని అంటాడు. దేవయాని, మనీషాలు జున్నుని తిట్టుకుంటారు. అరవింద వెళ్లి గొడవ పెట్టుకుంటా అని అంటే లక్ష్మీ వద్దని ఆపేస్తుంది. బాధ్యత బలవంతంగా రాకూడదని ఆయనకు ఆయన ఇష్టపడాలని అంటుంది.
దేవయాని: మనీషా నువ్వు మిత్ర దగ్గరకు వెళ్లి సంతకం ససేమిరా చేయొద్దని చెప్పు.
మనీషా: మిత్ర నీకు కూడా తలనొప్పి వచ్చే మీదకు వచ్చావ్ కదా. ప్రపంచంలో ఒక్క జున్నునే పిల్లాడు ఉన్నట్లు వాడికే జ్వరం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.
మిత్ర: జున్నుకి నా వల్లే జ్వరం వచ్చింది మనీషా. నేను సంతకం పెట్టలేదని వాడు ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడంట.
మనీషా: మిత్ర నీ వల్ల ఎందుకు జ్వరం వస్తుంది వాళ్లంతా నీతో సంతకం పెట్టించుకోవడానికి అలా నాటకం ఆడుతున్నారు. బలవంతంగా నిన్ను తండ్రీ అని ఒప్పించేస్తున్నారు. సొంత ఇంట్లోనే నీకు శత్రువులు తయారయ్యారు.
మిత్ర: నేను సంతకం పెట్టి ఉంటే బాగుండేది మనీషా. నేను సంతకం పెట్టి ఉంటే వాడికి జ్వరం వచ్చేది కాదు ఈపాటికి హాయిగా ఆడుకుంటూ ఉండేవాడు. లక్కీ కూడా హ్యాపీగా ఉండేది.
మనీషా: అవునా అయితే వెళ్లు మిత్ర వెళ్లి సంతకం చేసేయ్ లక్ష్మీని కూడా ఒప్పుకో.
మిత్ర: నేను లక్కీ గురించి ఆలోచిస్తున్నా మనీషా.
మనీషా: అటు కంపెనీ పరంగా ఇటు ఫ్యామిలీ పరంగా నిన్ను ఇబ్బంది పెడుతుంది. మన కంపెనీని నష్టాల్లో నెట్టి ఇప్పుడు జేఎమ్మార్ కంపెనీ ప్రాజెక్ట్ చేసేలా చేస్తుంది. ఇటు జున్నుతో నిన్ను నాన్న నాన్న అని పిలిపించి నిన్ను మెంటల్‌గా దెబ్బకొడుతుంది. ఇదంతా లక్ష్మీ ప్లాన్ మిత్ర అర్థం చేసుకో తనకి లొంగిపోకు.
మరోవైపు జాను వివేక్‌లు అరవింద జయదేవ్‌లు మిత్ర సంతకం పెడితే బాగున్నని అనుకుంటారు. మధ్యలో పిల్లాడు ఇబ్బంది పడుతున్నాడని అనుకుంటున్నారు. ఇక అరవింద మిత్ర సంతకం తాను చేసి జున్నుని సంతోషపెడతానని అంటుంది. వివేక్ కూడా ఇదే ప్లాన్ వేస్తాడు. జున్ను ఉదయం లేచి ప్రోగ్రస్ కార్డ్ చేసే టైంకి మిత్ర సంతకం ఉంటుంది. జున్ను సంతోషంతో లక్ష్మీకి చూపించి తనకు చాలా సంతోషంగా ఉందని అంటాడు. ఇంట్లో అందరికీ విషయం చెప్తానని పరుగులు తీస్తాడు. లక్ష్మీ కూడా మిత్ర సంతకం చేశాడని సంతోషపడుతుంది. జున్ను పరుగున వెళ్లి అందరికీ విషయం చెప్తాడు. అందరూ సంతోషిస్తారు. లక్కీ కూడా హ్యాపీగా ఫీలవుతుంది. మనీషా, దేవయాని షాక్ అయిపోతారు.
మనీషా దేవయానితో మిత్ర సంతకం పెట్టే ఛాన్స్ లేదని అంటుంది. దేవయాని మాత్రం ఒప్పుకోదు అది మిత్ర సంతకమే అని అంటుంది. త్వరలోనే లక్ష్మీ, మిత్రలు ఒకటైపోతారని నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతావని అంటుంది. అది మిత్ర సంతకం కాదని అక్కడ అందరూ నాటకం ఆడుతున్నారని మనీషా అవుతుంది. ఇంట్లో ఎవరో మిత్ర సంతకం పెట్టారని అంటుంది మనీషా. ఇక వివేక్ సంతకం పెట్టాడని జాను అనుకొని థ్యాంక్స్ చెప్తుంది. దానికి వివేక్ నేను పెట్టలేదు అని అంటాడు. ఇంతలో జయదేవ్ మీ పెద్దమ్మ సంతకం పెట్టిందని అంటాడు. దానికి అరవింద నేను పెట్టలేదు అని అంటుంది. లక్ష్మీనే పెట్టుంటుందని జాను అంటే జాను నవ్వుతూ నేను పెట్టలేదు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మనీషా, దేవయాని కూడా బిత్తర పోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పాపని కిడ్నాప్ చేయనున్న గజగండ.. ఆ వాగుడుకి సుమన తల పగలగొట్టిన ఫొటో!