Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode తన తల్లి ఒక్క మాట చెప్తే సహస్రని పెళ్లి చేసుకోనని విహారి అంటాడు. మా అమ్మ అందరి మీద ప్రేమ చూపిస్తుంది ఆ ప్రేమ మీకు ఎందుకు ఉండదని అడుగుతాడు. ఏదో తేడా కొడుతుందని పద్మాక్షి అనుకొని తానే ఇప్పుడు తగ్గాలని అనుకొని యమున దగ్గరు వెళ్లి తన భుజం మీద చేయి వేసి పట్టుకొని నవ్వుతూ మా మధ్య 20 ఏళ్ల నాటి దూరం ఉందని కానీ మీ పెళ్లితో అది దూరం అయిపోయిందని వదిన అనుకొని యమునతో మాట్లాడుతుంది. దాంతో అందరూ అది నిజం అనుకొని చాలా సంతోషంగా ఉంటారు.
అంబిక: విహారి చూశావా వదినా మరదల్లు ఎంత ఆప్యాయంగా ఉన్నారో ఎంత ప్రేమగా కలిసిపోయారో మీ కంటికి మా ఆడవాళ్ల ప్రేమ మీకు కనిపించదు.
విహారి: పోనీలే అత్త మీరంతా మా అమ్మతో కలిసిపోతే నాకు అంతే చాలు.
చారుకేశవ: అంబిక మీ అక్కా చెల్లెళ్లు భలే కిలాడీలు.
అంబిక: నువ్వు మామూలు కిలాడీవా నీ జాతకం చెప్పమంటావా.
చారుకేశవ: వద్దులే.
పండు యమున కష్టం గురించి లక్ష్మీకి చెప్తాడు. విహారి బాబు పెళ్లితో రెండు కుటుంబాలు కలిస్తాయని నవ్వుతున్నారని తల్లికొడుకు ఇద్దరూ చాలా మంచోళ్లని గొప్పోళ్లని పొగుడుతాడు. లక్ష్మీ అవును అని నాకు వాళ్ల మంచి తనం తెలుసుని అంటుంది. అలాంటి వాళ్లకి మన వల్ల ఎప్పుడూ హాని జరగకూడదని అంటుంది. ఇక విహారి కనకం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా వాల్లని సంతోషపెట్టడానికి మార్గం వెతుక్కుంటున్న నేను కనకం జీవితాన్ని ఓ మార్గంలో పెట్టడం లేదని అనుకుంటాడు. ఇక విహారి, సహస్రల నిశ్చితార్థం ఫ్లెక్సీని బయట పెట్టడం చూస్తాడు.
ఉదయం యమున తన దగ్గరున్న బంగారం మొత్తం బయట తీస్తుంది. వసుధ, చారుకేశవ అక్కడికి వస్తారు. చారు కేశవ ఆ ఏడు వారాల నగలు చూసి దొంగ తనం చేయాలని చూస్తాడు. యమున వాటిని వసుధకి ఇచ్చి సహస్రకి ఇవ్వమని అంటుంది. దానికి వసుధ యమునకే ఇవ్వమని అంటుంది. దానికి యమున నాకు మాంగల్యం లేదు కదా పద్మాక్షి ఏమైనా అనుకుంటుందని నువ్వే ఇవ్వు అని అంటుంది. ఇక వసుధ వాటిని తీసుకొని వెళ్తుంటుంది. చారుకేశవ దొంగతనం చేయాలని అనుకుంటాడు. ఇంతలో లక్ష్మీ విహారి డ్రస్ పట్టుకొని అటుగా వెళ్తుంది. చారు కేశవ లక్ష్మీ దొంగలా నగలు చూస్తుందని అంటుంది. లక్ష్మీ ఆ మాటలు విని బాధ పడుతుంది. లక్ష్మీ యమున దగ్గరకు వెళ్తుంది. విహారి డ్రస్ ఇస్తుంది. యమున చాలా సంతోషంగా ఫీలవుతుంది. ఆ డ్రస్ విహారికి ఇవ్వమని లక్ష్మీకి చెప్తుంది. ఇంతలో లక్ష్మీని పిలిచి ఆ డ్రస్ పండుకి ఇవ్వమని చెప్తా అని చెప్పి లక్ష్మీకి కొత్త చీర ఇస్తుంది. లక్ష్మీ ఎమోషనల్ అవుతుంది.
లక్ష్మీ వద్దు అంటే మనకు బంధం లేకపోయినా వరస పెడితే అమ్మనో అత్తనో అవుతాను కదా అంటుంది. దానికి లక్ష్మీ విహారితో పెళ్లి గుర్తు చేసుకొని మీరు మాట వరసకు అన్నా అని నేను మీకు కోడలిని మీరు నాకు అత్తగారే అని అనుకుంటుంది. ఈ బంధం ఉంచుకోవాలో తెంచుకోవాలో కూడా తెలీడం లేదని అంటుంది. మరోవైపు సహస్ర తల్లితో కలిసి నేను అన్నీ మ్యాచింగ్ చూసుకోవాలి అనుకుంటున్నా అని బట్టలు ముందేసుకొని చూస్తుంటారు. అంబిక కూడా అక్కడికి వస్తుంది. సహస్రని సెటైర్లు వేస్తుంది. ఇక వసుధ ఏడు వారాల నగలు తీసుకొని వసుధ దగ్గరకు వస్తుంది. అంబిక, పద్మాక్షి ఇద్దరూ యమున కుట్రలు చేస్తుందని అనుకుంటారు. వసుధ యమునను పొగిడితే పద్మాక్షి అరుస్తుంది. నిశ్చితార్థంలో యమున ఉండకూడదని అంబిక తో పద్మాక్షి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.