Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి వ్రతం చేయను అని చెప్పడంతో ఏ పని ఉన్నా వ్రతం తర్వాతే చేసుకో అని పద్మాక్షి అంటుంది. యమున కూడా తర్వాత చేసుకుందాం అంటే దానికి కాదాంబరి విహారి సహస్రతో పూజ చేసిన తర్వాతే విహారి బయటకు వెళ్లాలి అని చెప్తుంది. యమునని కూడా వ్రతానికి రెడీ అయి రమ్మని ఆర్డర్ వేస్తుంది.  

Continues below advertisement


చారుకేశవ, వసుధలు లక్ష్మీ కోసం మాట్లాడుకుంటారు. ఇంతలో యమున వచ్చి లక్ష్మీనే నా అసలైన కోడలు.. సహస్రకు అన్యాయం చేయాలి అని కాదు కానీ ఈ వ్రతం జరగకూడదు అని యమున అంటుంది. ఇప్పుడేం చేద్దాం అని ఎలా అయినా వ్రతం ఆపాలి అనుకుంటారు. 


వ్రతం ఏర్పాట్లు మొదలవుతాయి. చారుకేశవ విహారితో లక్ష్మీ కనిపించకుండా ఉంటే నువ్వు వ్రతాలు చేయడం కరెక్ట్ కాదు అంటాడు. నాకు వెళ్లాలి అని ఉంది కానీ ఇలా ఇరికించేశారు అని అంటాడు. పద్మాక్షి పరధ్యానంలో ఉంటుంది. సహస్ర వెళ్లి పంతులు కోసం అడుగుతుంది. ఇంతలో పంతులు వస్తారు. ముహూర్తానికి 5 నిమిషాలు ఉంది త్వరగా వ్రతం మొదలు పెడదామని అంటారు. పద్మాక్షి మనసులో నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా పూజలు చేసినా నీ కడుపు పండదే.. ఏది ఏమైనా నువ్వు ఈ ఇంటికి వారసుడికి ఇచ్చేలా నేను చేస్తాను.. ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటా అని అనుకుంటుంది. 


యమున మనసులో ఇది లక్ష్మీ, విహారి చేయాల్సిన వ్రతం సహస్రతో విహారి చేయడానికి వీల్లేదు ఎలా అయినా ఆపాలి అని అనుకుంటుంది. లక్ష్మీని రౌడీలు ఓ చోట కట్టేసి ఉంటారు. లక్ష్మీకి మెలకువ వచ్చి చూసి డోర్ లాక్ చేయకుండా ఉండటంతో కట్లు విప్పుకొని పారిపోతుంది. అయితే రౌడీలు లక్ష్మీని చూసి పట్టుకొని బంధించి వ్యాన్‌లో ఎక్కించుకొని తీసుకెళ్లిపోతారు. యమున వ్రతం ఆపడానికి కుంకుమ నీరు తీసుకొని వాటిని సహస్ర చీర మీద పడేస్తుంది. పంతులు వచ్చి సహస్ర, విహారిలను పీటల మీద కూర్చొమని అంటారు. 


సహస్ర వెళ్లే టైంకి వసుధ ఆపి సహస్రని వెనక్కి చూసుకో అని చెప్పి సహస్ర ముట్టు అయినట్లు చెప్తుంది. అంబిక చూసి సహస్ర ఇప్పుడు పూజ చేయకూడదు అంటు అని చెప్తారు. దాంతో పంతులు లేచి మరో సారి ముహూర్తం చూసి వస్తానని పంతులు చెప్పి వెళ్లిపోతారు. విహారి బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని సహస్ర, పద్మాక్షి అడుగుతారు. లక్ష్మీ కోసం ఎంక్వైరీ చేయాలని అంటాడు. దాని కోసం నువ్వు వెళ్లడం ఏంటి అని సహస్ర అంటుంది. ఇందాక దానికోసమేనా వ్రతంలో కూర్చొను అని అన్నావ్ అని పద్మాక్షి అంటుంది. ఇంట్లో పెళ్లాం కంటే పరాయిది ఎక్కువైపోయిందా అని అంబిక అంటుంది. నిన్నటి నుంచి లక్ష్మీ లక్ష్మీ అని దాని గురించే రచ్చ ఏంట్రా ఇది కాదాంబరి అడుగుతుంది. తను ఇన్ని రోజులు మనతో ఉంది తను మన బాధ్యత అని విహారి అంటాడు. నాకు ఎందుకో మీరే లక్ష్మీని ఏదో చేశారని అనిపిస్తుందని విహారి అనడంతో అందరూ షాక్ అయిపోతారు. నీ కళ్లకి మేం ఎలా కనిపిస్తున్నాం.. మేం ఏమైనా క్రిమినల్సా అని అడుగుతారు.


సహస్ర కోపంగా ఎవరో పరాయిదాని కోసం నువ్వు మమల్ని అనుమానిస్తున్నావా అని అడుగుతుంది. తను పరాయిది కాదు ఈ ఇంటి మనిషి అని విహారి అంటాడు. నెత్తిన పెట్టుకొని పూజించాలి అది మంచి స్కెచ్ వేసి ఆస్తి పట్టుకుపోయింది అని పద్మాక్షి అంటుంది. దాని విషయంలో అలాంటి పనులు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు అని అంటుంది. మన మీద అనుమానం ఉంది కదా పద పోయి కంప్లైంట్ ఇద్దాం అని అంబిక సహస్రతో చెప్తుంది. 


విహారి లక్ష్మీ కోసం వెతుకుతూ అమ్మిరాజు మీద అనుమానంతో చితక్కొడతాడు. వీర్రాజు, పానకాలు చూసి పరుగులు పెడతారు. చారుకేశవ వచ్చి విహారిని ఆపుతాడు. లక్ష్మీని నేను కిడ్నాప్ చేయడం ఏంటి అది నాకు దొరికితే చంపేస్తా అని అమ్మిరాజు అంటాడు. మేం ఎక్కడికీ వెళ్లలేదు మేం కూడా ఆరోజు చెట్టు దగ్గరే ఉన్నాం అని వీర్రాజు అంటాడు. అవును విహారి అని చారుకేశవ చెప్పి విహారిని తీసుకెళ్తాడు. విహారిని చావు దెబ్బ కొడతా అని అమ్మిరాజు అంటాడు. అంబిక, సహస్రలు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తారు వాళ్లు కూడా ఇలా చేయరు అని చారుకేశవ అంటాడు. ఇక ఇద్దరూ పోలీస్‌ స్టేషన్‌కి బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.